ఈ ఫొటోలోని చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. పవన్ కల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్.. గుర్తుపట్టారా మరి?
టాలీవుడ్‌లో హ్యాండ్సమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఒకరికి అతని సోదరి ఈ విధంగా త్రో బ్యాక్ ఫొటోతో బర్త్ డే విషెస్ చెప్పింది. ఇందులో క్యూట్‌లుక్స్‌తో కనిపిస్తోన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. అంతేకాదు ఈ హ్యాండ్సమ్ హీరోకు అమ్మాయిల్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం త్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీల పాత ఫొటోలు, చిన్నప్పటి ఫొటోలు నెట్టింట్లో బాగా కనిపిస్తున్నాయి. చాలామంది తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేటప్పుడు తమ చిన్ననాటి ఫొటోలను షేర్ చేసుకుంటున్నారు. తద్వారా బాల్యం నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. పై ఫొటో కూడా అలాంటిదే. టాలీవుడ్‌లో హ్యాండ్సమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఒకరికి అతని సోదరి ఈ విధంగా త్రో బ్యాక్ ఫొటోతో బర్త్ డే విషెస్ చెప్పింది. ఇందులో క్యూట్‌లుక్స్‌తో కనిపిస్తోన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. అంతేకాదు ఈ హ్యాండ్సమ్ హీరోకు అమ్మాయిల్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు సిని మా కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డాడు. మళ్లీ హీరోగా నిలదొక్కుకున్నాడు. హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఇంతకీ ఈ బుడ్డోడు ఎవరో కనిపెట్టారా? గుర్తుపట్టకపోతే మీకు ఒక క్లూ.. ఈ హీరో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనను స్ఫూర్తిగా తీసుకునే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ పాటికే చాలామందికి అర్థమై ఉంటుంది అతనెవరో.. యస్.. ఈ బుడ్డోడు మరెవరో కాదు.. టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.
ఈరోజు నితిన్ పుట్టిన రోజు (మార్చి 30). ఈ సందర్భంగా అతని సోదరి, నిర్మాత నిఖితారెడ్డి సోషల్ మీడియా వేదికగా హీరోకు బర్త్‌డే విషెస్ చెప్పింది. అలాగే ఓ త్రో బ్యాక్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమెతో పాటు చిన్నప్పటి నితిన్ కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నితిన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే. .ఇటీవలే వెంకీ కుడుములతో కలిసి మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు నితిన్. రష్మిక మంధన్నా హీరోయిన్‌గా కనిపించనుంది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.