అల్లరి నరేశ్‌ ‘బ్లేడ్‌ బాజ్జీ’ సినిమా హీరోయిన్‌ గుర్తుందా? ఒక్క మూవీతోనే మాయమైపోయిన ఈ బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా?

మైనే ప్యార్‌ కియా భాగ్యశ్రీ, గీతాంజలి గిరిజా, మన్మథుడు అన్షు.. ఇలా ఒకటి, రెండు సినిమాలతో కెరీర్‌ను ముగించిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్‌ ఫిల్మ్‌ వండర్‌ జాబితా తీస్తే బ్లేడు బాజ్జీ సినిమా హీరోయిన్ సయాలీ భగత్ కూడా ఉంటుంది

అల్లరి నరేశ్‌ 'బ్లేడ్‌ బాజ్జీ' సినిమా హీరోయిన్‌ గుర్తుందా? ఒక్క మూవీతోనే మాయమైపోయిన ఈ బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా?
Actress
Follow us
Basha Shek

|

Updated on: Mar 29, 2023 | 3:42 PM

మైనే ప్యార్‌ కియా భాగ్యశ్రీ, గీతాంజలి గిరిజా, మన్మథుడు అన్షు.. ఇలా ఒకటి, రెండు సినిమాలతో కెరీర్‌ను ముగించిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్‌ ఫిల్మ్‌ వండర్‌ జాబితా తీస్తే బ్లేడు బాజ్జీ సినిమా హీరోయిన్ సయాలీ భగత్ కూడా ఉంటుంది. అల్లరి నరేశ్‌ హీరోగా, దేవీ ప్రసాద్‌ దర్శకత్వంలో 2008లో విడుదలైన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతోనే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది బాలీవుడ్‌ భామ సయాలీ భగత్‌. అంతకు ముందు హిందీలో ది ట్రైన్‌, గుడ్‌లక్‌, హల్లాబోల్‌ సినిమాలు చేసింది. అదే ఊపులో బ్లేడ్‌బాజ్జీ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన గ్లామర్‌ లుక్‌తో కట్టిపడేసింది సయాలీ. అలాగే కామెడీ సన్ని వేశాల్లో కూడా బాగా నటించింది. సినిమా కూడా సూపర్‌ మిట్‌ కావడంతో సయాలీ మరికొన్ని తెలుగు సినిమాల్లో నటిస్తుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. చాలామంది లాగే ఈ అందాల తార కూడా ఒక్క తెలుగు సినిమాకే పరిమితమైంది. అయితే బాలీవుడ్‌లో మాత్రం వరుస ఆఫర్లు దక్కించుకుంది.

కిర్కిట్, పేయింగ్ గెస్ట్‌, ఘోస్ట్, దిస్‌ వీకెండ్‌, రాజధాని ఎక్స్‌ప్రెస్‌, యారియాన్‌ తదితర హిందీ సినిమాల్లో నటించింది సయాలీ. అయితే ఇందులో ఏ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దీంతో బాలీవుడ్‌ బుల్లితెర వైపు అడుగులు వేసింది. అయితే అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండలేకపోయింది. దీంతో వ్యక్తిగత జీవితం వైపు దృష్టిసారించింది.ఈక్రమంలోనే 2013లో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నవనీత ప్రతాప్ సింగ్ యాదవ్ అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2020 జూన్‌లో వీరికి ఇవాంకా సింగ్‌ అనే కూతురు పెట్టింది. కాగా వివాహం తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది సయాలీ. అయితే రియల్‌ ఎస్టేట్‌తో పాటు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల్లో బాగానే రాణిస్తోంది. కాగా సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్‌లో అదరగొట్టిందీ అందాల తార. ఫెమినా మిస్ ఇండియా టైటిట్‌లను కూడా గెల్చుకుంది. అందుకే కొన్ని రోజలు క్రితం ఓ ఫ్యాషన్ ఈవెంట్లోనూ తళుక్కున మెరిసింది. ఇందులో చాలా బొద్దుగా కనిపించినప్పటికీ ఎంతో అందంగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..