Tollywood: సంగీతంతో ప్రపంచాన్ని మాయ చేశాడు.. అతని పాటలు వింటూ లోకాన్ని మైమరచిపోవాల్సిందే.. ఈ చిన్నోడిని గుర్తుపట్టండి..

చిన్నతనం ఓ మధురమైన జ్ఞాపకం. ప్రస్తుతం ఈ తీపి గుర్తులను సోషల్ మీడియా ప్రపంచంలో గుర్తుచేసుకుంటున్నారు. తమ చిన్ననాటి ఫోటోస్ స్నేహితులతో.. ఫాలోవర్లతో పంచుకుంటూ అప్పటి రోజులను తలుచుకుంటున్నారు.

Tollywood: సంగీతంతో ప్రపంచాన్ని మాయ చేశాడు.. అతని పాటలు వింటూ లోకాన్ని మైమరచిపోవాల్సిందే.. ఈ చిన్నోడిని గుర్తుపట్టండి..
Tollywood
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 06, 2023 | 10:11 AM

బాల్యం.. అభం శుభం తెలియని అమాయక అందమైన ప్రపంచం. చిన్నతనం అపూర్వమైన వరం. అ అందమైన బాల్యం తాలుకూ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం ఎవరికీ ఇష్టముండదు చెప్పండి. చిన్నతనం ఓ మధురమైన జ్ఞాపకం. ప్రస్తుతం ఈ తీపి గుర్తులను సోషల్ మీడియా ప్రపంచంలో గుర్తుచేసుకుంటున్నారు. తమ చిన్ననాటి ఫోటోస్ స్నేహితులతో.. ఫాలోవర్లతో పంచుకుంటూ అప్పటి రోజులను తలుచుకుంటున్నారు. కేవలం సామాన్యులే కాదు…ఎక్కువగా సెలబ్రెటీలు తమ బాల్యం తాలుకూ జ్ఞాపకాలను షేర్ చేస్తూ.. ఆరోజులను. ఆ ప్రత్యేక దినాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. తాజాగా ఓ స్టార్ షేర్ చేసిన అరుదైన ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. తనకు సంగీత పాఠాలు చెప్పిన గురువుతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసుకున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. తన గురువు పక్కన్న కూర్చున్న ఈ చిన్నోడిని గుర్తుపట్టండి. అతనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అతని సంగీతం.. పాటలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.

అతని సంగీతాన్ని ప్రపంచమే మెచ్చింది. దశాబ్దాలు గడిచిన ఆయన అందించిన మ్యూజిక్ ఇప్పటికీ శ్రోతల మనసులను తాకుతుంది. ఆ పాటలు వింటూ లోకాన్ని సైతం మైమరచేవారు ఎందరో ఉన్నారు. గుర్తుపట్టారా ?. అతను మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. భారతీయ సినీ పరిశ్రమలో ఆయన ప్రత్యేకం. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్.. చిన్నతనంలోనే పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ వద్ద సహాయకుడిగా పనిచేశారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమా ఆయన అందించిన సంగీతం ఎవర్ గ్రీన్ హిట్స్. ఈ సినిమాతో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత.. నిప్పు రవ్వ.. ప్రేమ దేశం, రక్షకుడు, రోజా, జెంటిల్ మాన్, జీన్స్, సఖి, నీ మనసు నాకు తెలుసు, నాని, పులి, రోబో, నువ్వు నేను ప్రేమ, వంటి చిత్రాలకు సంగీతం అందించారు. అలాగే ఆయన ఖాతాలో ఎన్నో పురస్కారాలు.. మరెన్నో బిరుదులు. 2021లో బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందిన అల్లిపూల వెన్నెల పాటకు ఆయనే సంగీతం అందించారు. ఈరోజు (జనవరి 6న ) ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటుంది టీవీ 9 తెలుగు.

View this post on Instagram

A post shared by ARR (@arrahman)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.