Ajith Kumar: స్టార్ హీరో అజిత్ మొబైల్ ఉపయోగించడు అని మీకు తెలుసా ?.. తనకు ఫోన్ నంబర్ కూడా లేదట..

ఇటీవల వాలిమై సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈహీరో ఇప్పుడు తునీవు సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సంక్రాంతికి జనవరి 12న తమిళంతోపాటు.. తెలుగులోనూ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఉన్న హీరోలలో అజిత్ స్టైల్ వేరు.

Ajith Kumar: స్టార్ హీరో అజిత్ మొబైల్ ఉపయోగించడు అని మీకు తెలుసా ?.. తనకు ఫోన్ నంబర్ కూడా లేదట..
Ajith Kumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 04, 2023 | 1:00 PM

తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్‏కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. కేవలం కోలీవుడ్ కాదు.. టాలీవుడ్ లోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. ఇటీవల వాలిమై సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈహీరో ఇప్పుడు తునీవు సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సంక్రాంతికి జనవరి 12న తమిళంతోపాటు.. తెలుగులోనూ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఉన్న హీరోలలో అజిత్ స్టైల్ వేరు. స్టార్ గా ఎంతో ఎత్తుకు ఎదిగినా.. ఏమాత్రం స్టార్ డమ్ ఉపయోగించరు. ఎంతో సాధారణ వ్యక్తిగా తన జీవితాన్ని గడిపేస్తుంటారు. అజిత్ కు ప్రయాణాలంటే ఎంతో ఇష్టం. సినిమాల నుంచి కాస్త బ్రేక్ దొరికినా..బైక్ రైడింగ్ వెళ్తుంటారు.

బైక్ పై 30 రోజుల పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రయాణించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. అలాగే.. ఇటీవల రైఫిల్ షూటింగ్ లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం ఎంతగా వ్యాపించిందో తెలిసిందే. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం నెట్టింట గంటలు తరబడి మునిగితేలుతున్నారు. కానీ స్టార్ హీరో అజిత్ మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటివరకు ఆయనకు ట్విట్టర్.. ఇన్ స్టా ఖాతా లేదంటే నమ్మగలరా ?. అంతేకాదు.. ఆయనకు వ్యక్తిగతంగా ఓ మొబైల్ కూడా లేదట.

గతంలో ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ త్రిష ఈ విషయాన్ని బయటపెట్టింది. అందులో అజిత్ సర్ నంబర్ మీరు ఏమని సేవ్ చేశారు ? అని అడగ్గా.. ఆమె స్పందిస్తూ.. తన నంబర్ లేదని.. ఎందుకంటే అజిత్ సర్ అసలు మొబైల్ కూడా ఉపయోగించరని చెప్పుకొచ్చింది. దీంతో అతను ప్రజలు.. సినీ ప్రముఖులతో ఎలా కమ్యూనికేట్ చేస్తారని అడగ్గా.. తన వెంటే ఉండే మేనేజర్ అన్ని విషయాలను అప్డేట్ చేస్తుంటాడని.. అందుకే అతనికి ఫోన్ అవసరం లేదని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇవే కాదు.. ప్రతి విషయంలోనూ అజిత్ ఆలోచన విధానం చాలా ప్రత్యేకం. 2011లో తన ఫ్యాన్ క్లబ్స్ అన్నింటిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నాడు. గతంలో తన ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ కొందరు దుర్వినియోగం చేస్తున్నారని తెలుసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. అలాగే తనను అభిమానులు ముద్దుగా తల అని పిలుచుకుంటారు. ఇకపై తనను అలా పిలవకూడదని గతేడాది అభిమానులకు చెప్పుకొచ్చారు అజిత్. ప్రస్తుతం ఉన్న హీరోలందరిలో అజిత్ వ్యక్తిత్వం చాలా వేరు కదా.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.