Baby: బేబీ మూవీ ఫుల్ రివ్యూ.. హార్డ్ హిట్టింగ్ పెయిన్ లవ్ స్టోరీ..
కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు బేబీ. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
మూవీ రివ్యూ: బేబీ
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు, లిరిష, కుసుమ, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి
సంగీతం: విజయ్ బుల్గానిన్
నిర్మాత: SKN
రచన, దర్శకత్వం : సాయి రాజేష్ నీలం
కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు బేబీ. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
ఆనంద్ (ఆనంద్ దేవరకొండ), వైష్ణవి (వైష్ణవి చైతన్య) స్కూల్ వయసు నుంచే ఒకరినొకరు ప్రేమించుకుంటారు. వాళ్ల ప్రేమ కూడా వయసుతోపాటు పెరిగి పెద్దదవుతుంది చిన్న బస్తి నుంచి ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తుంది వైష్ణవి. అక్కడ కొత్త కొత్త పరిచయాలు ఆమెకు ఏర్పడతాయి. వాటి వల్ల ఆమె జీవితంలో అనుకొని మార్పులు వస్తాయి. సరిగ్గా అదే సమయంలో విరాజ్ (విరాజ్ అశ్విన్) ఆమె జీవితంలోకి వస్తాడు. అప్పటికే ఆనంద్ తో ప్రేమలో ఉన్న వైష్ణవి అనుకోని పరిస్థితుల్లో విరాజ్ తోనూ చాలా దగ్గరవ్వాల్సి వస్తుంది. ఆ దశలో వైష్ణవి జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. చివరికి ఆనంద్, వైష్ణవి, విరాజ్ జీవితాలు ఎలా ముందుకెళ్లాయి అనేది ఈ సినిమా కథ..
కథనం:
కొన్ని సినిమాలు మొహం మీద కొట్టినంత కఠినంగా ఉంటాయి. అవి ఒప్పుకోడానికి అంత త్వరగా మనసు రాదు. బేబీ కూడా అలాంటి సినిమానే. చాలా పచ్చిగా ఈ సినిమా తీసాడు దర్శకుడు సాయి రాజేష్. బయట పరిస్థితులు ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు. బేబీ సినిమా అంతా చాలామందికి నచ్చడం కష్టం.. కానీ కొన్ని సీన్స్ మాత్రం అదిరిపోయాయి. ఇదేం తెలియని కథ కాదు.. రోజూ మనం చూసేదే. దానికే తెర రూపం ఇచ్చాడు సాయి రాజేష్. ఈ క్రమంలో కొన్ని సీన్స్ సూపర్ గా వర్కవుట్ అయ్యాయి.. ఇంకొన్ని ఆకట్టుకోలేదు. ఫస్ట్ హాఫ్ అంతా నెమ్మదిగా వెళ్తుంది.. స్క్రీన్ ప్లే కూడా అంతే స్లో. ఇంటర్వెల్ సీన్ మాత్రం సినిమాకే హైలైట్. అక్కడ వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ మధ్య జరిగే ఫోన్ మాట్లాడే సీన్ నెక్స్ట్ లెవల్. ఆ సీన్ అంత బాగా బ్యాలెన్స్ చేసిన దర్శకుడికి సలామ్. అంతే కాదు.. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా సూపర్. నిజమైన ప్రేమకి, బలహీనతకి మధ్య నలిగే పాత్రను అందంగా రాసుకున్నాడు దర్శకుడు. దాన్ని అంతే అందంగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసింది వైష్ణవి చైతన్య. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది.. కొన్ని సీన్స్ అదిరిపోయాయి. క్లైమాక్స్ కూడా హార్డ్ రియాలిటీ ట్రై చేసాడు దర్శకుడు.
నటీనటులు:
ఆనంద్ దేవరకొండ చాలా బాగా నటించాడు. అతడి పాత్రతో చాలా మంది కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో రెండు మూడు సీన్స్ అద్భుతంగా నటించాడు. విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి ఎలాగో.. ఆనంద్ కు బేబీ అలా. విరాజ్ అశ్విన్ జస్ట్ ఓకే. వైష్ణవి చైతన్య ఈ సినిమాకు హీరో.. ఆ అమ్మాయి మీదే నడుస్తుంది సినిమా అంతా. మిగిలిన వాళ్ళందరూ ఓకే..
టెక్నికల్ టీం:
విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ప్లస్. సినిమా కాస్త పడిపోతుంది అనుకున్న సమయంలో విజయ్ పాటలు బాగా నిలబెట్టాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్స్ కూడా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ వీక్. తక్కువలో తక్కువ 20 నిమిషాల సినిమాకు పైగానే కట్ చేయొచ్చు. 3 గంటల రన్ టైం కష్టం. దర్శకుడు సాయి రాజేష్ రియాలిటీ చూపించాలని ప్రయత్నం చేశాడు. అందులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్ గా బేబీ.. యూత్ కి పిచ్చెక్కించడం ఖాయం.. కామన్ ఆడియన్స్ కు మాత్రం రొటీన్ హార్డ్ హిట్టింగ్ పెయిన్ లవ్ స్టోరీ..