Adipurush Movie Release Updates: ఆదిపురుషుడి ఆగమనం.. జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లుతన్న థియేటర్లు
Prabhas Adipurush Release Live Updates: ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆదిపురుష్' థియేటర్లలోకి అడుగుపెట్టాడు. ఈరోజు ఉదయం 4 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోస్ మొదలయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ సందడి నెలకొంది.
Prabhas Adipurush Release Updates: ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్’ థియేటర్లలోకి అడుగుపెట్టాడు. ఈరోజు ఉదయం 4 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోస్ మొదలయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ సందడి నెలకొంది. థియేటర్ల వద్ద కేక్ కట్ చేసి, తీన్ మార్ డప్పులతో డాన్సులు చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఇక హైదరాబాద్లోని భ్రమరాంబ థియేటర్లో ఇప్పటికే ఆదిపురుష్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యింది. ‘సినిమా బాగుంది. ఫస్ట్ అఫ్ అద్భుతంగా వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ ,మేకింగ్ ,రాముడి పాత్రలో ప్రభాస్ అద్భుతంగా ఉన్నారు. ఇప్పటివరకు సినిమాపై వచ్చిన ట్రోల్స్ అన్నిటికీ సినిమా సమాధానం. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్’ అని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.
LIVE NEWS & UPDATES
-
ఆదిపురుష్ సినిమాలో సీతమ్మ డైలాగ్ కట్
ఆదిపురుష్ సినిమాలో సీతమ్మ డైలాగ్ కట్ చేశారు. ఈ మూవీలో సీతమ్మ భారతదేశంలో పుట్టినట్లు పేర్కొన్నారట. దీనికి నేపాల్ సెన్సార్ బోర్డ్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ వాళ్ల నమ్మకం ప్రకారం సీతాదేవి అక్కడ జన్మించారట. అందుకే ఆమెను అక్కడి దేవతగానే కొలుస్తుంటారు. ఈ డైలాగ్ కట్ చేసిన తర్వాత నేపాల్ థియేటర్లలో ఆదిపురుష్ విడుదల చేశారు.
-
ఆదిపురుష్ సినిమా చూసిన మోహన్ లాల్
Malayalam SuperStar @Mohanlal Now In Theatres For watching #Adipurush Early Show ?#Prabhas? #Mohanlal #AdipurushReview pic.twitter.com/yDeLD8mK1X
— sunny 2.O (@sunny_115_2) June 15, 2023
-
-
అన్ని ఏరియాల నుంచి అదే రెస్పాన్స్
విడుదలైన అన్ని ఏరియాల నుంచి పాజిటి టాక్ సొంతం చేసుకుంటున్న ఆదిపురుష్. సాహో , రాధేశ్యామ్ సినిమాల తర్వాత హిట్ అందుకున్న ప్రభాస్
-
సంబరాలు చేసుకుంటున్న అభిమానులు
ఆదిపురుష్ బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో సంబరాలు చేసుకుంటున్న అభిమానులు.
-
థియేటర్ అద్దాలు బద్దలయ్యాయి
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని జ్యోతి థియేటర్లో అభిమానులు థియేటర్ అద్దాలు పగల గొట్టారు. సినిమా ఆలస్యం అవవడం అపి సౌండ్ సిస్టం సరిగ్గాలేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
-
ప్రపంచవ్యాప్తంగా 9000కి పైగా స్క్రీన్స్ లో..
ప్రపంచవ్యాప్తంగా 9000కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి.. బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న ఆదిపురుష్
-
రాములోరి సినిమాకు విచ్చేసిన హనుమాన్
Hanuman ji watching #Adipurush
— Prabhas matters ? (@Single_Sintakay) June 16, 2023
-
హనుమంతిడి కోసం స్పెషల్ సీట్స్
Sri Hanuman ji ? sthaan at tarakramana theater before starting show #Prabhas#Adipurush pic.twitter.com/y7jR2jvJfz
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) June 16, 2023
-
రాముడితో పాటు మరో పాత్రలో ప్రభాస్..?
ఆదిపురుష్లో రాముడితో పాటు దశరధుడి పాత్రలో ను కనిపించిన ప్రభాస్
-
రాముడి పాత్రలో ప్రభాస్ అద్భుతం
విజువల్ ఎఫెక్ట్స్, మేకింగ్, రాముడి పాత్రలో ప్రభాస్ అద్భుతంగా ఉన్నారంటున్న ఫ్యాన్స్
-
ప్రభాస్ ఫ్యాన్స్ వార్నింగ్..
ఆదిపురుష్ సినిమా రివ్యూలా విషయంలో హనుమంతుడి గెటప్ వేసుకొని లైకులు కోసం పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఊరుకోమని ప్రభాస్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు.
-
బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం..
ఆదిపురుష్ హంగామా మొదలైంది. థియేటర్స్ దగ్గర అభిమానులు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ బెనిఫిట్ షోస్ మొదలవ్వడంతో ప్రేక్షకులు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
-
కాషాయం జెండాలతో అభిమానులు..
కాషాయం జెండాలతో థియటర్స్ దగ్గర అభిమానుల సందడి. జై శ్రీ రామ్ నినాదాలు చేస్తున్న ఫ్యాన్స్
-
భీమవరంలో థియేటర్ల ప్రభాస్ అభిమానుల సందడి..
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆది పురుష్ థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల సందడి మాములుగా లేదు. పట్టణం అంతలా ఆదిపురుష్ , ప్రభాస్ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక థియేటర్ల వద్ద కేక్ కట్ చేసి, తీన్ మార్ డప్పులతో డ్యాన్సులు చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్
Published On - Jun 16,2023 6:36 AM