Samantha: సమంత ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదా? కళ్లు తెరవడానికి కూడా ఇబ్బంది పడుతోందే.. వీడియో వైరల్
అనారోగ్య సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు ఇటీవల ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనను చూస్తే సామ్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని తెలుస్తోంది. ఇటీవల శాకుంతలం త్రీడి ట్రైలర్ విడుదల కోసం ముంబై వచ్చింది సమంత. అయితే ఫొటోగ్రాఫర్లు ఆమె ఫొటోల కోసం ఎగబడ్డారు.
సమంత గతేడాది మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో సతమతవువుతున్నట్లు తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వ్యాధి కారణంగానే కొన్ని నెలల పాటు సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చింది. అయితే మయోసైటిస్‌తో పోరాడుతూనే యశోద సినిమాను పూర్తి చేసింది. ప్రమోషన్లలోనూ పాల్గొని సినిమాపై తన మక్కువను నిరూపించుకుంది. కాగా మరి కొన్ని రోజుల్లో శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది సమంత. ఇందుకోసం వరుస ప్రమోషన్లు చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళుతోంది. మరోవైపు సిటాడెల్ వెబ్ సిరీస్‌తో పాటు విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్‌లకు హాజరవుతూ బిజిబిజీగా గడుపుతోంది. కాగా అనారోగ్య సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు ఇటీవల ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనను చూస్తే సామ్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని తెలుస్తోంది. ఇటీవల శాకుంతలం త్రీడి ట్రైలర్ విడుదల కోసం ముంబై వచ్చింది సమంత. అయితే ఫొటోగ్రాఫర్లు ఆమె ఫొటోల కోసం ఎగబడ్డారు. అయితే వెంటవెంటనే కెమెరాలు ఫ్లాష్ మనిపించడంతో సామ్ తీవ్రంగా ఇబ్బంది పడింది. కళ్లు మూసుకుంటూ చేతులతో తన ముఖాన్ని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.
ఈ వీడియోను చూసిన అభిమానులు, నెటిజన్లు సమంత ఆరోగ్యం ఇంకా కుదుపటడలేదని కామెంట్లు చేస్తున్నారు. కాగా సామ్ నటించిన పాన్ ఇండియా సినిమా శాకుంతలం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. శకుంతల సమంత పాత్రలో నటిస్తుండగా.. దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నాడు. రుద్రమ దేవి సినిమా తర్వాత సుమారు ఏడేళ్ల గ్యాప్ తీసుకుని మరీ ఈ సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు గుణశేఖర్. అల్లు అర్జున్ కూతురు అర్హ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్, ట్రైలర్లకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..