Krishna Mukunda Murari,22 August: మురారీ ప్రేమ తనకు మాత్రమే దక్కాలనుకుంటున్న ముకుంద.. కృష్ణ కోసం శిబిరం దగ్గరకు డ్యూటీ వేయించుకున్న మురారీ..

స్టార్ మా లో ప్రసారం అవుతున్న కృష్ణ, ముకుంద, మురారీ ప్రేమ, పెళ్లి మధ్య సాగుతున్న కథ, కథనంతో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ప్రేమని మరచి పెళ్లికి విలువ ఇచ్చే మురారీ..జీవితం ఏ మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్రా ఉత్కంఠం రేపుతుంది. భవానికి ముకుంద ప్రేమ గురించి అనుమానం రావడమే కాదు.. ఆ ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలనీ నిశ్చయించుకుంది.

Krishna Mukunda Murari,22 August: మురారీ ప్రేమ తనకు మాత్రమే దక్కాలనుకుంటున్న ముకుంద.. కృష్ణ కోసం శిబిరం దగ్గరకు డ్యూటీ వేయించుకున్న మురారీ..
Krishna Mukunda Murari
Follow us
Surya Kala

|

Updated on: Aug 22, 2023 | 7:09 AM

కృష్ణ, ముకుంద, మురారీ..జీవితం ఏ మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్రా ఉత్కంఠం రేపుతుంది. భవానికి ముకుంద ప్రేమ గురించి అనుమానం రావడమే కాదు.. ఆ ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలనీ నిశ్చయించుకుంది. దీంతో రేవతి, మురారీలు టెన్షన్ పడతారు.. క్యాంప్ కు వెళ్తానని చెప్పిన మురారీ.. ఆదర్శ్ ఆచూకీ దొరికింది అంటూ ముకుందకు షాక్ ఇచ్చాడు.. ఈ రోజు అగస్తు 22వ తేదీ ఎపిసోడ్ లో ఏమి జరగనుందో చూద్దాం..

దారి తప్పిన నిన్ను..  నా ప్రేమతో మళ్ళీదారికి తెచ్చుకుని అర్ధం చేసుకున్నాక ఒక్క నిజాన్నే కాదు.. ఎన్ని నిందలైనా భరిస్తా.. నీ ప్రేమ కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాను.. మొదటి ప్రేమకి మరణం ఉండదు మురారీ.. అంటుంది మురారీ.. ప్రేమ బాధ్యతకు తేడా తెలుసుకో.. మన ప్రేమని బతికించుకోవడానికి ఇదే అవకాశం మురారీ అంటుంటే .. ఆదర్శ్ ఆచూకీ తెలిసింది అని చెప్పి ముకుందకు షాక్ ఇస్తాడు మురారీ..

ఆదర్శ్ రాడని తెలిస్తే.. ముకుంద నా మీద ఇంకా హోప్స్ పెట్టుకుంటుంది.. కనుక  వస్తున్నాడని చెబుదాం.. అప్పుడైనా తన ఆలోచన మారుతుంది.. అతి త్వరలో ఆదర్శ్ ఇంటికి తిరిగి వస్తున్నాడు.. కన్నల్ ఫోన్ చెప్పాడు.. అని అంటే.. ముకుంద మురారీ అసలు నీకు మనసాక్షి అంటేనే లేదా ప్రాణ స్నేహితుడు ప్రేమించిన అమ్మాయిని భార్యగా ఎలా స్వీకరించాలని ఆదర్శ్ వెళ్ళిపోయాడు.. ప్రాణ స్నేహితుడి భార్యని ప్రియురాలిగా ఎలా చూడాలని నువ్వు ఫీల్ అవుతున్నావు.. మరి నిన్ను నమ్మి నువ్వే జీవితం అనుకున్న నా పరిస్థితి ఏమిటి మురారీ .. నీ స్నేహం చాలా గొప్పది.. అది నేను అర్ధం చేసుకున్నా.. మన ప్రేమ చాలా గొప్పది.. అది నువ్వు కూడా అర్ధం చేసుకో.. నేను చావనైనా చస్తా కానీ.. నా భర్తగా నిన్ను తప్ప నేను ఇంకొకరిని అంగీకరించను అని ముకుంద తెగేసి మరీ చెబుతుంది..

ఇవి కూడా చదవండి

నన్ను నాకైనా మిగుల్చు అంటున్న కృష్ణ

కృష్ణ.. ఏమిటయ్యా నీ ప్రాబ్లెమ్.. నీ మనసులో లేను కదా.. ఎందుకు పదే పదే గుర్తుచ్చి నా ప్రాణాలు ఇలా తోడేస్తున్నావు.. నా మనసులో నాకు కూడా చోటు ఇవ్వవా.. నా గుండెల్లో నువ్వే వున్నావు.. ఎక్కడ చుస్తే అక్కడ నువ్వే కనిపిస్తే నేను ఏమైపోవాలి.. ఏసీపీ సార్ మీకు అర్ధం అవుతుందా.. నా గురించి కూడా ఆలోచించండి.. ఆడపిల్లని.. ఇలా వర్షాకాలంలో ముసురులా మీ జ్ఞాపకాలు నన్ను తడిపేస్తే తట్టుకోవడం ఎలా ఊపిరి ఆడడం లేదు నాకు కొంచెం స్పెస్ కావాలి.. అనుకుంటుంది.. కృష్ణ నువ్వు ఇక్కడ నువ్వు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చావు కనుక నీ వర్క్ మీద దృష్టి పెట్టు.. అస్తమాను ఆలోచించడం అంటే అతనికి ఒకరకంగా బానిసవ్వడమే.. అని తనకు తానే దైర్యం చెప్పుకుంటుంది. ఒకవేళ ఏసీపీ సార్ ఎదురుపడ్డవేళ.. ఎమోషనల్ అవ్వకు.. మౌనంగానే ఉండు.. ఆయనకేనా బెట్టు మనకుండదా అనుకుంటుంది.

క్యాంప్ కు బయలుదేరిన మురారీ

రోడ్డుమీద డెడ్ ఎండ్ బోర్డు చూసి రూట్ మార్చుకున్న మురారీ కారుకి .. ముకుంద తనవైపు వచ్చేలా చూసుకుంటుంది.. ఆగకుండా వెళ్తున్న మురారీ కారుని ఓ సూపర్ అనుకుంటుంది.. రోడ్డుమీద ఆ బోర్డు తీసెయ్యి అని ఒకరికి చెబుతుంది.. రోడ్డుకి అడ్డంగా నిలబడి మురారీని కారుని ఆపుతుంది.. ఎందుకు కారు ఆపవు.. నీతో మాట్లాడాలి.. నువ్వు చెప్పిన నిజం నిజం కాదని.. నిజం ఏమిటో నీకు తెలియాలని.. అంటే ఏమిటా నిజం కానీ నిజం.. అంటే.. ఆదర్శ్ అంటే నాకు చాలా ఇష్టం.. గౌరవం ఎందుకో తెలుసా.. ఒక అమ్మాయి మనసు అర్ధం చేసుకోవడం తనకు తెలుసు.. మన ప్రేమ విషయం తెలుసుకున్నాడు.. మన ప్రేమని అర్ధం చేసుకున్నాడు కాబట్టే… ఆ మరుసటి రోజే వెళ్ళిపోయాడు . అంటే ఆదర్శ్ కూడా మనం కలవాలని కోరుకున్నాడు. తనకి మనం సంతోషంగా ఉండడం ఇష్టం ఏమో అనిపిస్తుంది. కాదు మురారీ.. నాకు ఒక విషయం అర్ధం కావడం లేదు..  నేను ఆదర్శ్ ని ప్రేమించుకున్నాక నువ్వు నేను ప్రేమించుకోవడం తప్పు.. అంటే అదే కదా నేను అంటుంది అంటాడు మురారీ.. ఐ యాం నాట్ డన్ ఇట్.. లెట్ మీ ఫినిష్ మురారీ.. చెప్పు అంటాడు. క్లారిటీగా విను.. నేను ఏమి చెబుతున్నా అంటే.. మన ప్రేమ విషయం పెళ్ళికి ముందు ఆదర్శ్ కు తెలియదు..  పెళ్ళికి వచ్చేదాకా తను నీ ఫ్రెండ్ అని నాకు తెలియదు.. తను చేసుకోబోయే వరకూ నీకు కూడా తెలియదు కదా.. అవును ఇందులో నా తప్పు ఏముంది.. నీ తప్పు ఏముంది.. ఆదర్శ్ తప్పు ఏముంది.. అసలు ఈ విషయం అత్తయ్యకు తెలిస్తే తప్పేముందు.. మనం ఎందుకు మన జీవితాలను నాశనం చేసుకోవాలి అని మురారీని ప్రశ్నిస్తుంది ముకుంద..

లెట్స్ బ్రేక్ దా వాల్ మురారీ.. అంటే.. మురారీ .. ముకుంద ప్లీజ్.. ప్రేమ, బంధం, బాధ్యత, స్నేహం, కుటుంబం ఇలా బంధాల మధ్య చాలా నలిగిపోయాను.. ఇప్పటికే చాలా అలసిపోయాను.. దయచేసి నన్ను కలిసి పదే పదే నాకు కళ్లు తెరిపించాలని చేసే ఈ ప్రయత్నాల వలన నువ్వే నన్ను ఇంకా డిప్రెషన్ లోకి నెట్టిస్తున్నావనిపిస్తుంది.. నువ్వు చెప్పింది నిజమే కానీ..  ఇలా జరుగుతుందని నువ్వు నేను ఊహించగలమా లేదు..

ముకుంద అప్పటి పరిస్థితి వేరు.. ఇప్పటి పరిస్థితి వేరు.. ఇప్పుడు వెళ్లి తప్పు అయిపొయింది పెద్దమ్మ.. కృష్ణ తో నా పెళ్లి నాటకం.. నేను ముకుంద ప్రేమించుకున్నాం.. అని చెబితే పెద్దమ్మ తట్టుకోగలదా .. ఇంట్లో అందరూ ఏమనుకుంటారు.. ఏమనుకున్నా నిజం మారదు కదా మురారీ అంటుంది ముకుంద..

అందుకే మనమే మారాలి అంటున్నా.. ఎందుకోసం మారాలి.. ఎవరి కోసం మారాలి మురారీ అంటే.. మన ఫ్యామిలీ కోసం అంటాడు మురారీ..  కృష్ణ మేడలో తాళి కట్టినప్పుడు ఎందుకు నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించలేదు. అక్కడ మా గురుగారి ప్రాణం కోసం అంటుంటే.. చాలు మురారి .. నువ్వు కాదు మురారీ.. నేను మన ఫ్యామిలీ గురించి ఆలోచించాను అంటుంది.. ముకుంద.. మన ప్రేమ విషయం అత్తయ్య అడిగినా చెప్పలేదు.. కృష్ణతో నీ అగ్రమెంట్ గురించి బయట పెట్టాలంటే.. నాకు ఎంత సెపో పట్టేది కాదు మురారీ అని అంటూ తన గొప్పదనం కోసం గుర్తు చేస్తుంది మురారీ..

నీ ప్రేమ నాకే కావాలి.. నాకు మాత్రమే కావాలంటున్న ముకుంద..

మురారీ.. ముకుంద చేసిన ఛాలెంజ్ విషయాలు గుర్తు చేసుకుంటాడు.. అదేదో నిన్ను కంట్రోల్ చేసేందుకు కానీ.. నిజం చెప్పే ఉద్దేశ్యం నాకు లేదు.. మురారీ నాకు నువ్వు కావాలి.. నీ ప్రేమ నాకే దక్కాలి..  కానీ బలవంతంగా కాదు.. తనకు తానుగా మనలో మనకు కలిగింది స్వచ్ఛమైన ప్రేమ అలా అంటుంది ముకుంద..

నేను నిన్ను అర్ధం చేసుకోవడంలేదో.. లేక నన్నే నువ్వు అర్ధం చేసుకోవడం లేదో నాకు అర్ధం కావడం లేదు కానీ.. మన వలన మన ఫ్యామిలీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అనుకుంటాడు మురారీ..

ముకుంద ప్లీజ్ అర్ధం చేసుకో.. నేను ఇప్పుడు వెళ్ళాలి.. లెట్ అయితే ప్రాబ్లెమ్ అవుతుంది.. అంటే సరే వేళ్ళు అంటూనే.. మురారీ గుర్తు పెట్టుకో ఎప్పటికైనా నేను నీ దానినే.. నువ్వు నావాడివే అంటుంది ..

పోలీస్ ఆఫీసర్ కు యాక్సిడెంట్

కృష్ణ దగ్గరకు వచ్చి ఎవరో పోలీసు ఆఫీసర్ కు యాక్సిడెంట్ జరిగింది అనగానే.. ఏసీపీ సార్ అంటూ కంగారు పడుతుంది.. అక్కడ ఉన్న ఆఫీసర్ కు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి చూసి ఊపిరి పీల్చుకుంటుంది. తర్వాత అతనికి ట్రీట్మెంట్ చేస్తుంది.

తమ క్యాంప్ కు వచ్చిన మురారీ .. ఎక్కడ ఉన్నావు కృష్ణ అని ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణ తాను మురారితో గడిపిన సందర్భాలను గుర్తు చేసుకుంటుంది. మనసుని ఎంత అదుపు చేసుకున్నా మీ జ్ఞాపకాలు వెంటాడుతుంటే.. ఏమి చేయను సార్.. నిద్ర లేచారా.. అయినా ఈ టైం వరకూ నిద్ర లేకవపోతే రేవతి అత్తయ్య ఊరుకుంటుందా.. భవానీ అత్తయ్య డిసిప్లీన్ కు ఇప్పటికి టిఫిన్ చేసి ఉంటారు.. అంత మంచి ఫ్యామిలీలో మెంబర్ అవ్వాలంటే రాసి పెట్టాలి ఉండాలి అనుకుంటుంది కృష్ణ.. తనకోసమే డ్యూటీ వేసుకుని పట్టుబట్టి మరీ వచ్చానని బెట్టు చేస్తుందేమో.. అనుకుంటూనే.. చేస్తే చెయ్యని నా పెళ్ళామేగా నాదగ్గర కాకా ఇంకెవరి దగ్గర బెట్టు చేస్తుంది అనుకుంటాడు మురారీ..  ఎంతైనా మరీ సరెండర్ అవుతున్నానేమో అనిపిస్తుంది.. తగ్గడం వరకూ ఒకే.. దిగజారడం బాగుండదు.. ఒరేయ్ మురారీ ఎవరు రా నువ్వు ఏసీపీ వి .. కృష్ణ నిన్ను ఏమని పిస్తుంది ఏసీపీ సార్ అని అనుకుంటూనే.. అక్కడ నుంచి ఇక్కడ వరకూ వచ్చింది ఎందుకు కృష్ణ కోసమే కదా అని మళ్ళీ తనకు తానే చెప్పుకుంటాడు. తనకోసం ఇంత దూరం వచ్చావు.. నా కోసం తాను గుడారం నుంచి బయటకు రాలేదా.. నేను ఇక్కడే ఉన్నానని తెలిసి.. నాకోసం వేడుకుంటూ పరిగెత్తుకుని రావాలి అనుకుంటాడు మురారి..

రేపటి ఎపిసోడ్ లో

ఎవరిని చూసినా ఏసీపీ సార్ అనుకుంటున్నా కృష్ణ.. నిజంగా మురారీ ఎదురుపడితే.. కలే అనుకుంటుంది..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..