Krishna Mukunda Murari,17 August: కృష్ణకు సెండాఫ్ ఇచ్చిన మురారీ.. పెళ్లి కోసం కలలు కంటున్న ముకుంద.. నేటి ఎపిసోడ్ లో..
ముకుంద సంతోషంతో ఈ ఇంట్లో మొట్టమొదటిగా ఆదర్శ్ భారీగా ఎడమకాలు పెట్టి లోపలి వచ్చాను.. ఈ ఇంట్లో మురారీ భార్యగా కుడికాలు పెట్టి మొదటిసారిగా లోపలకు వస్తాను అంటూ లోపలి వచ్చి.. తాను మురారీ సంతోషంగా గడుతున్న రోజులను గుర్తు చేసుకుని .. అక్కడ ఉన్న ఓ లెటర్ ని చూస్తుంది.. లవ్ మెబీ బ్లైండ్.. మ్యారేజెస్ ఆర్ రియల్ ఐ ఓపెనర్.. ముకుంద నీకు అన్నీ తెలుసు.. అయినా కూడా ఒక ఫ్రెండ్ లా నీకు ఒకటి చెప్పాలనిస్తుంది..
ప్రేమించిన ప్రియురాలికి, పెళ్ళి చేసుకున్న భార్యకు నలిగిపోతున్న ఓ యువకుడి కథతో సాగుతున్న కృష్ణ ముకుంద మురారీ బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. అగ్రిమెంట్ పూర్తి కానున్న నేపథ్యంలో మెడికల్ క్యాంప్ కు వెళ్లి ఇక తిరిగి రాను అని చెప్పిన కృష్ణ.. తన ప్రేమ పెళ్లి పీటలు ఎక్కనున్నదని ఆనందంలో ముకుంద.. మురారీ ప్రేమని కృష్ణకు చెప్పడం కోసం వాట్సాప్ లో మెసేజ్ పంపించిన నందిని.. ఈ రోజు ఆగష్టు 17వ తేదీ ఎపిసోడ్ ఎలా సాగుతుందో తెలుసుకుందాం..
మనం చాలా తప్పు చేశాం ఏసీపీ సార్.. మన అగ్రిమెంట్ గురించి చెప్పాల్సింది.. నన్ను అందరూ తప్పుగా అనుకుంటారు.. మీరంటే మీవాళ్ళతో ఉంటారు.. ఇప్పుడు నందుకు, రేవతి అత్తయ్యకు తప్ప ఎవరికీ మన అగ్రిమెంట్ పెళ్లి గురించి తెలియదు.. ఇప్పుడు అందరూ నా గురించి ఏమనుకుంటారు.. అని మురారీని ప్రశ్నిస్తుంది కృష్ణ.. నా అవసరం కోసం నా స్వార్ధం కోసం మిమ్మల్ని మీ ఫ్యామిలీ అందరిని మోసం చేశాను అనుకుంటారు కదా.. నన్ను చెప్పనివ్వలేదు..మీరు చెప్పలేదు.. అందరిలో నన్ను దోషిని చేశారు.. తప్పు చేశాం ఏసీపీ అందరిలో నన్ను దోషిని చేశారు అని మురారిని నిలదీస్తుంది.
నందు మెసేజ్ ని డిలీట్ చేసి బ్లాక్ చేసిన మురారీ..
ఇంతలో కృష్ణకు మెసేజ్ వచ్చింది చూసి.. నందు నా ప్రేమ గురించి చెప్పిందా ఎలాగైనా కృష్ణ మొబైల్ చూడకూడదు.. అని అనుకుంటాడు..ఇంతలో కారు ఆపమని అడుగుతుంది కృష్ణ.. ఎందుకు ఆపావు కృష్ణ అంటే.. వాటర్ బాటిల్ తీసుకోవాలి.. అంటుంది.. నన్ను వెళ్లి తీస్కుని రమ్మనకు ప్లీజ్ అనుకుంటాడు మురారీ.. కనీసం వెళ్లి తీసుకుని వస్తా అని కూడా అనలేదు కదా అనుకుంటుంది కృష్ణ.. కృష్ణ వెళ్లి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చే లోపు నందు పెట్టిన మెసేజ్ డిలీట్ చేస్తాడు మురారీ..
నువ్వు ఎందుకు వెళ్ళావు కృష్ణ.. నేను తీసుకొచ్చేవాడిని కదా.. ఏమీ పర్వాలేదు ఏసీపీ సార్.. ఇక నుంచి ఎవరూ నాకు తోడుగా ఉండరు కదా.. నేనే చేసుకోవాలి కదా అంటుంటే.. ప్రతిసారి నేను నీకు పరాయివాడిని అని నాకు చెప్పక్కర్లేదు అని అనుకుంటాడు మురారి.
కృష్ణ స్వార్ధపరురాలని అపార్ధం చేసుకున్న నందు
నందు కృష్ణ మెసేజ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.. వాట్సప్ లో తన డీపీ కనిపించకపోవడమతొ గౌతమ్ కాల్ చేయమంటాడు.. అప్పుడు నెంబర్ కలవకపోవడంతో .. అంటే కృష్ణ నా మెసేజ్ చూసి నన్ను బ్లాక్ చేసిందా.. మా అన్నయ్య చెప్పిందే కరెక్ట్.. నేను కృష్ణను అర్ధం చేసుకోలేకపోయానా అనుకుంటూ బాధపడుతుంటే.. గౌతమ్.. నందు నువ్వు బాధపడితే నేను చూడలేను.. అంటూ ఓదారుస్తాడు. ఇందులో కృష్ణ తప్పులేమీ లేదనిపిస్తుంది. అంటే.. మా అన్నయ్యదే తప్పు అంటావా అని నందు అడిగితె.. ఇద్దరిదీ తప్పుకాదు.. మనం చాలామందితో ఫ్రెండ్లిగా ఉంటాం.. ఆఫీస్ లో కాలేజీ లో అలాగని అందరికి ప్రేమిస్తున్నట్లు కాదుగా.. కృష్ణ విషయంలో మురారీ కరెక్ట్ గానే ఉన్నాడు.. కృష్ణకు తన పట్ల ప్రేమ లేదు కాబట్టి.. మురారీ తన ప్రేమ విషయం కృష్ణతో చెప్పలేదు.. కృష్ణ విషయంలో మురారీ తనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు కనుక కృష్ణ విషయం మురారీ నిన్ను కూడా చెప్పవద్దు అన్నాడు.. ఛ.. అమ్మాయిలు ఇంత స్వార్ధంగా ఉంటారు అనుకోలేదు.. తన గోల్ రీచ్ కావడానికి మనసులో ఇంత పెట్టుకుని పైకి ఎంత ప్రేమని ఒలకబోసింది అని కృష్ణ అంటూ అపార్ధం చేసుకుని దారుణంగా మాట్లాడుతుంది నందు..
నువ్వు కూడా తనని తోబుట్టుకన్నా ఎక్కువగా చేసుకున్నావు కదా మనతో కూడా నటించినట్లేకదా.. మనల్ని కాదనుకుని వెళ్లిపోయిన వారికోసం మనం ఎందుకు బాధపడాలి.. పద వెళ్ళిపోదాం అంటుంది నందు..
నంది వెలుగు మెడికల్ క్యాంప్
నంది వెలుగు.. పేరు బాగుంది కదా.. వెలుగు ఉంది పేరులో అని కృష్ణ అంటే.. నాలో చీకటిని నింపి నువ్వు వెలుగు వైపుకి వెళ్ళిపోతున్నావు కదా కృష్ణ అని మురారీ అనుకుంటుంటే.. మీరు లేని నా లైఫ్ చీకటే .. కానీ నేను చెప్పలేను.. మీరు నన్ను అర్ధం చేసుకుంటారు అని ఈ క్షణం వరకూ వేచి చూశా సార్ అని బాధపడుతుంది కృష్ణ..
మరోవైపు మురారీ.. ఎటు తను ఇక రాదు కనిపించదు కనుక..నా మనసులోని మాట ఇప్పుడు చెప్పితే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు.. ఏసీపీ సార్.. మీరు నన్ను మరచిపోరుగా.. అంటే ఏమీ లేదు ఏసీపీ సార్.. బృందావనం లాంటి ఆ ఇల్లు.. సందడి సందడిగా ఉంటుంది.. రేవతి అత్తయ్య వంటలు చేస్తూ.. మధు రీల్స్ చేస్తూ భవానీ చిరు కోపం.. వీటిల్లో నేను ఏమి గుర్తుంటానని అన్నా అంతే.. అంటే.. మరి మా ఇంటి గురించి చాలా గొప్పగా చెప్పావు కదా.. మరి నీకు ఎలా వెళ్లాలనిపించింది అని మురారి ప్రశ్నిస్తాడు. ఎందుకు వచ్చేశావు కృష్ణ అని అడుగుతాడు..
నాకు కావాల్సింది మీరు ఏసీపీ సార్.. మీ మనసులోనే నాకు స్థానం లేనప్పుడు ఎలా ఉండగలను.. ఏసీపీ సార్.. గుళ్లో రోజూ ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు కదా ఏసీపీ సార్.. ఏటో ఆలోచిస్తూ డ్రైవింగ్ చేయవద్దు అంటూ జాగ్రత్తలు చెబుతుంది మురారీకి. ఏమిటి ఏసీపీ సార్.. సరే అనండి .. అంటుంది.. నువ్వు చెప్పావు గా అలాగే అంటాడు..
మీరు ఎప్పుడు నా మనసులోనే ఉంటారు.. ఆ దేవుడిని తలుచుకోవడం మానేస్తాను ఏమో కానీ ఈ దేవుడిని కాను..అంటుంది.. కారులో నుంచి రెండో షూట్ కేస్ తీసి బయట పెట్టి.. నిన్న నైట్ ఒక బ్యాగ్ తెప్పించి మిగిలిన లగేజ్ అంతా ఇందులో సర్దాను.. అందరి ముందు పెడితే బాగుందని.. అనుమానం వస్తుందని.. ముందే కారులో పెట్టేశాను.. ఇక రాదు.. ఇంత పగడ్బందీగా ప్లాన్ చేసుకుందంటే..నా నుంచి శాశ్వతంగా దూరమైపోతుంది.. ఇక తిరిగి రాదు..అనుకుంటుంటే .. ఇక జాగ్రత్తగా వెళ్లండి ఏసీపీ సార్ అంటూ బాయ్ చెబుతుంది.
పిలిచారా ఏసీపీ సార్.. అని కృష్ణ అడిగితె లేదు అంటాడు మురారీ.. మళ్ళీ కృష్ణ నువ్వు పిలిచావా అంటే లేదు అంటుంది..
కృష్ణ లెటర్ ని చదివిన భవానీ
భవానీ గదిలో తనతో పాటు తన గెటప్ లో ఉన్న కృష్ణ ఫోటోని దాని పక్కన ఒక లెటర్ ను చూస్తుంది.. పెద్దతయ్య.. మన జీవితాల్లో తల్లిదండ్రి గురువు వెళ్లే ప్రత్యక్ష దైవాలు అంటారు కదా.. అలాంటిది నా లైఫ్ లో ఆ ముగ్గురిని కలిపి మీ ఒక్కరిలోనే చూశాను.. మీరు అంటే నాకు గౌరవంతో కూడిన అభిమానం.. అభిమానంతో కూడిన భక్తి.. అందుకే మీరే నాకు ప్రత్యక్ష దైవం.. మీరు ఎప్పుడూ నవ్వుతు ఉండాలి.. ప్రేమతో మీ తింగరి అని ఉంటుంది.. ఆ లెటర్ చూసి నవ్వుకుంటూ పైకి చాలా తింగరి పిల్లలా ఉంటుంది కానీ.. చాలా ఎమోషనల్ సెన్సిటివ్ లా ఉంది అనుకుంటూ తన ఫోటోని చూస్తూ ఉంటుంది భవానీ..
ముకుంద .. ఇప్పుడు నేను నిన్ను ఫ్రెండ్ అనుకుంటున్నా కృష్ణా..
ముకుంద సంతోషంతో ఈ ఇంట్లో మొట్టమొదటిగా ఆదర్శ్ భారీగా ఎడమకాలు పెట్టి లోపలి వచ్చాను.. ఈ ఇంట్లో మురారీ భార్యగా కుడికాలు పెట్టి మొదటిసారిగా లోపలకు వస్తాను అంటూ లోపలి వచ్చి.. తాను మురారీ సంతోషంగా గడుతున్న రోజులను గుర్తు చేసుకుని .. అక్కడ ఉన్న ఓ లెటర్ ని చూస్తుంది..
లవ్ మెబీ బ్లైండ్.. మ్యారేజెస్ ఆర్ రియల్ ఐ ఓపెనర్.. ముకుంద నీకు అన్నీ తెలుసు.. అయినా కూడా ఒక ఫ్రెండ్ లా నీకు ఒకటి చెప్పాలనిస్తుంది..
నీ ప్రేమని మర్చిపోయి పెళ్లి జీవితాన్ని సంపూర్ణం చేసుకో.. సంతోషంగా ఉంది.. కోటి రాగాలు పలికించే వేణువు కూడా ఉపయోగించక పోతే తుప్పు పట్టిపోతుంది.. కాబట్టి నీ టాలెంట్ ను నీలో నే దాచుకోకు ముకుంద .. ఈ ప్రపంచానికి తెలియజేయి నువ్వు నవ్వితే ఎంత అందంగా ఉంటావో.. నీ పెదాలపై ఎప్పుడు చిరునవ్వు చెడనీయకు నీ ఫ్రెండ్ కృష్ణ.. అని ఆ లెటర్ ని చదివి చింపేసి.. అవును కృష్ణ నీవంటే నాకు ఎప్పుడూ కోపం లేదు.. ప్రేమ లేదు.. మురారీ భార్యగా నువ్వు వచ్చావని.. నాకు దక్కాల్సిన ప్రేమ నీకు ఎక్కడ దక్కుతుందో అని దిగులు అంతకు మించి నీపై నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు అని అనుకుంటుదని ముకుంద.. కానీ ఇప్పుడు కలిగింది ఓ మంచి ఫ్రెండ్ అనే ఫీలింగ్..
కృష్ణ.. తన పెళ్లి ఫోటోలు చూస్తూ కన్నీరు పెట్టుకుంటుంది.
రేపటి ఎసిపోడ్ లో..
కృష్ణ కోసం క్యాంప్ కు వచ్చిన మురారీ.. కలా నిజమా..