Krishna Mukunda Murari,11 August: ఈ రోజు ఎపిసోడ్ లో.. కృష్ణ అప్పగించింది బాధ్యతలు కాదు.. తన జీవితాన్ని అంటూ హ్యాపీ ఫీల్ అవుతున్న ముకుంద..

నాకు లక్ అనేది ఇప్పటి వరకూ ఎప్పుడూ కలిసి రాలేదు కృష్ణ అంటుంది. నేను నిజంగా అంత అదృష్ట వంతురాలినే అయితే.. నీ దురదృష్టంలో అదృష్టాన్ని వేడుకుకునే ఖర్మ నాకు పట్టేది కాదు కృష్ణ. అయినా నేను ఎప్పుడు అదృష్టాన్ని నమ్మను.. నన్ను నేనే నమ్ముకుంటా.. అంటే సూపర్ కృష్ణ నువ్వు.. మా నాన్న కూడా నాకు ఎప్పుడూ అదే చెబుతూ ఉండేవారు అంటుంది కృష్ణ..

Krishna Mukunda Murari,11 August: ఈ రోజు ఎపిసోడ్ లో.. కృష్ణ అప్పగించింది బాధ్యతలు కాదు.. తన జీవితాన్ని అంటూ హ్యాపీ ఫీల్ అవుతున్న ముకుంద..
Krishna Mukunda MurariImage Credit source: Hotstar
Follow us
Surya Kala

|

Updated on: Aug 11, 2023 | 11:48 AM

ఓ వైపు కృష్ణ మెడికల్ క్యాంప్ పేరుతొ ఇంటిని వదిలి పెట్టి వెళ్ళడానికి రెడీ అవుతుంది.. మరోవైపు రేవతి ఈ పెళ్లితో నైనా వాళ్లిద్దరూ మనసులు మార్చుకుంటే బాగుండుని .. పాపం అక్క వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు అనుకుంటుంది.. ఒక రకంగా నేను కూడా అక్కకి అసలు విషయం చెప్పకుండా మోసం చేస్తున్న అంటూ తనలో తనే బాధపడుతుంది.  ఇంతలో భవానీ వచ్చి రేవతి ఏమిటి ఆలోచిస్తున్నావు.. మనం ఇవన్నీ దాటుకుని వచ్చిన వాళ్ళమే కదా.. చిన్న చిన్న గొడవలు సహజం.. ఇవన్నీ స్వీట్ మెమొరీస్ గా వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటారు.. పెళ్లి చాలా బాగా జరిగింది కదా అంటుంది భవానీ.. అవును అక్క ఇదంతా నీ వల్లే.. అంటే నావల్ల నీ వల్ల కాదు.. అంతా ఆ పై వాడి వల్ల ఆయన దయ ఎప్పుడూ మన ఫ్యామిలీ మీద ఉంటుంది అని అంటుంది భవానీ..

ఒకే అన్న భవానీ

ఇంతలో కృష్ణ వస్తే.. రా తింగరి పిల్లా అంటే, ఏమిటి పిచ్చిది.. నిజం చెప్పడానికి వచ్చిందా అని ఆలోచిస్తుంది రేవతి.. ఇంతలో కృష్ణ.. తన ఫోన్ లో వచ్చిన మెసేజ్ ను చూపిస్తుంది. నీకు అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.. కానీ అంటుంటే.. రేవతి ఏముందక్కా దానిలో అంటుంది.. నీ అవార్డు వచ్చిన వెంటనే ఇలా రావడం నాకు ఇష్టమే కానీ.. అంటుంటే.. అప్పుడు నీ కోడలికి ఇక్కడికి దగ్గరలోని గ్రామంలో విష జ్వరాలున్నాయట.. అక్కడ మెడికల్ క్యాంప్ కు రమ్మనమని మెసేజ్ వచ్చింది అని భవానీ చెబుతుంది. వెళ్తావా.. పరిమలతో మాట్లాడి వేరే వాళ్ళని పంపమనా అని అడుగుతుంది. చాలు అత్తయ్య జీవితంలో మీ మనసులో స్తానం పొందగలనా అనుకున్నా.. మీ మనసులో స్తానం సంపాదించుకున్నా.. అది చాలు అనుకుంటుది.

ఎన్ని రోజులు అంటే.. వారం.. పదిరోజులు అంటుంది.. అంటే అగ్రిమెంట్ చివరి రోజులు మళ్ళీ తిరిగి వస్తుందా రాదా అని రేవతి ఆలోచిస్తుంటే.. నేను ఇక్కడ ఉంటె ఏడిచేసేటట్లు ఉన్నా అంటూ లగేజీ సర్దుకుంటా అని పైకి వెళ్ళిపోతుంది.

జ్ఞాపకాలు పుట్టుమచ్చలు వంటివి అవి పోవు..

కృష్ణతో ముకుంద మాట్లాడుతూ.. అప్పుడప్పుడు నీలో నన్ను చూసుకున్నట్లు అనిపిస్తుంది కృష్ణ.. అంటుంది..   కృష్ణ నువ్వు తప్పుగా అనుకోను అంటే ఒకటి చెప్పనా.. ముకుందా అని అంటూ.. నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తా.. గతం నీ లవ్ స్టోరీ ఎంత గొప్పదైనా సరే.. నువ్వు మర్చిపో ముకుందా.. అది నీకే మంచిది.. నీకిప్పుడు పెళ్లయింది.. భర్త ఉన్నాడు.. నువ్వు ఎప్పుడో ప్రేమించిన ప్రియుడికి తలుచుకోవడం.. అతని ఆలోచనలోనే ఉండడం కరెక్ట్ కాదు.. అని సలహా చెబితే ముకుంద షాక్ తింటుంది. నామాటలు నీకు కోపం తెప్పించి ఉండవచ్చు.. కానీ నేను చెప్పేది నిజం.. అంటుంది కృష్ణ..  జ్ఞాపకాలు వెంటాడతాయి.. కాదనను.. ఒకప్పటి ఊహలను గుర్తు తెచ్చుకుని వాటిల్లో బతకడం అసలు కరెక్ట్ కాదు.. థాంక్యూ కృష్ణ చాలా మంచి సలహా చెప్పావు.. కానీ ఆలోచనలు మనుకోవచ్చు.. జ్ఞాపకాలు మరచిపోలేము.. అవి మాననవి.. కొన్ని అనుభవంలోకి వచ్చినప్పుడే  అర్ధం అవుతాయి అంటుంది ముకుంద.. బహుసా నా మాటలు నీకు అర్ధం కాలేదు అనుకుంటా అంటే.. కరెక్ట్ ప్రేమలో నీ అంత అనుభవం నాకు లేకపోవచ్చు.. కానీ మా అమ్మానాన్న జ్ఞాపకాలు నాకు బోలెడున్నాయి అంటుంది.. అంతేకాదు నువ్వు చాలా అదృష్ట వంతురాలివి ముకుందా అంటుంది కృష… ఆ మాటకి ముకుంద నాకు లక్ అనేది ఇప్పటి వరకూ ఎప్పుడూ కలిసి రాలేదు కృష్ణ అంటుంది. నేను నిజంగా అంత అదృష్ట వంతురాలినే అయితే.. నీ దురదృష్టంలో అదృష్టాన్ని వేడుకుకునే ఖర్మ నాకు పట్టేది కాదు కృష్ణ. అయినా నేను ఎప్పుడు అదృష్టాన్ని నమ్మను.. నన్ను నేనే నమ్ముకుంటా.. అంటే సూపర్ కృష్ణ నువ్వు.. మా నాన్న కూడా నాకు ఎప్పుడూ అదే చెబుతూ ఉండేవారు అంటుంది కృష్ణ.. అంతేకాదు నేను వెళ్లిపోతున్నా ముకుందా అని కృష్ణ చెప్పడంతో ముకుంద చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది.

రేపటి నుంచి ఇంట్లో ఉండను కదా ముకుంద అదేమిటి కృష్ణ.. క్యాంప్ కదా వెళ్ళేది.. మళ్ళీ వస్తావు కదా అంటుంది ముకుంద.. అప్పుడు కృష్ణ..  తర్వాత నీకే అర్ధం అవుతుంది ముకుంద అంటుంది. పెద్దయ్య నిన్ను ఎంత గొప్పగా సత్కరించింది తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అని అంటుంది.

మురారీ మనసులో నేను లేనప్పుడు ఇక్కడ నేను ఎలా ఉంటాను అనుకుంటూ.. నాకు పెద్దత్తయ్య అప్పగించిన బాధ్యతలు నీకు నేను అప్పగిస్తున్నా అంటూ కృష్ణ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ముకుంద థాంక్యూ కృష్ణా..  అంటూ వెళ్లిపోతుంటే.. కౌగలించుకుంది. నువ్వు నాకు అప్పగించింది భాధ్యతలను మాత్రమే కాదు.. నీ జీవితాన్ని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ముకుంద.

బ్యాగ్ సర్దుకుంటున్న కృష.. 

బ్యాగ్ లో బట్టలు సర్దుకుంటూ బాధపడుతుంది.. ఇంతలో మురారీ వచ్చి ఏమి చేస్తున్నావు అంటే.. బ్యాగ్ లో బట్టలు పట్టడం లేదు అంటే.. పిలవచ్చు కదా అంటారు.. అడిగితె గానీ సాయం చేయరా అని అంటుంది.. బ్యాగ్ చూసి మొత్తం సర్దేసుకుంది.. అంటే క్యాంప్ నుంచి తిరిగి రాదు అన్నమాట అనుకుంటూ బైగ్ జిప్ ను ఇద్దరూ కలిసి పెడతారు. కృష్ణ తలను రెండో సారిఢీ కొట్టి సారీ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మీ మనసులో నేను ఉన్నా అనుకుని.. ఎప్పుడైనా మీకు దిగులుగా ఉంటె నా ఫోటోలు చూడండి ఏసీపీ సార్ అంటూ నా ఫోటోలు ఇక్కడ పెట్టా కానీ ఇప్పుడు ఈ ఫోటోలు ఇక్కడే ఉంటే .. భవిష్యత్ లో మీ ప్రేమకు ఏమైనా ఇబ్బంది వస్తుందేమో.. నా వల్ల మీరు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు.. అంటూ ఏడుస్తూ గోడమీద ఫోటోలు తీసేస్తుంది. అప్పుడే మురారీ వచ్చి.. తన గుర్తులు ఉండకూడదు అనుకుని అన్నీ తీసేస్తుంది కదా.. అంటే తన బహుమతులు కూడా నాకు అక్కర్లేదు అంటూ కృష్ణ అంటూ.. కృష్ణుడి బొమ్మని తిరిగి ఇచ్చేస్తాడు.. నీ వస్తువులు అన్నీ సర్దేస్తున్నావు కూడా.. ఇది కూడా నీదే మళ్ళీ మర్చిపోతావేమో అంటూ చేతిలో పెట్టేస్తాడు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది కృష్ణ..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..