అన్నగారికి అరుదైన గౌరవం.. కుటుంబ సభ్యుల సమక్షంలో ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల.. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా..

NTR Rs.100 Coin: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆగస్ట్ 28వ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ వంద రూపాయిల నాణాన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఇప్పటికే ఆయన..

అన్నగారికి అరుదైన గౌరవం.. కుటుంబ సభ్యుల సమక్షంలో ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల.. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా..
Sr NTR's 100 Rupees Coin
Follow us
Sravan Kumar B

| Edited By: Vimal Kumar

Updated on: Jan 03, 2024 | 11:10 AM

NTR Rs.100 Coin: నిర్మలా సీతారామన్‌ని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గతంలో కలిసి తెలుగువారి ఖ్యాతిని దేశ మొత్తం చాటిన ఎన్టీఆర్‌కి గుర్తుగా వంద రూపాయల నాణెం విడుదల చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన నిర్మల సీతారామన్ ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం విడుదలయ్యేలా కృషి చేశారు. ఈ మేరకు హైదరాబాదులోని మింట్ కాంపౌండ్‌లోనే ఈ వంద రూపాయల నాణెం ముద్రించబడటం విశేషం అయితే 100 రూపాయల నాణెం మీద ముద్రించిన ఎన్టీఆర్ బొమ్మలను ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు స్వయంగా సెలెక్ట్ చేయగలిగే అవకాశం లభించడం గమనార్హం.

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆగస్ట్ 28వ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ వంద రూపాయిల నాణాన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలను కూడా పంపింది. అలాగే ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమంలో భాగమయ్యేందుకు ఆహ్వానించారు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలతో పాటు వారి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు కూడా హాజరవుతారని సమాచారం. అలాగే ఈ నెల 28న జరిగే ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విదుతల కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణెన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు.

అలాగే ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరో వైపు ఎన్టీఆర్ చిత్రం ఉంటాయి. అలాగే ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శత జయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శత జయంతి ఈ ఏడాదితో ముగిసింది కనుక 1923- 2023 అని ముద్రితమై ఉండనుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..