Khakee Season 2: ‘ఖాకీ: సీజన్ 2’ వచ్చేస్తోంది.. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోథా జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ఖాకీ: ది బిహార్ చాప్టర్'. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో కరణ్ టక్కర్, అవినాష్ తివారి, అభిమన్యుసింగ్, నీరజ్ కశ్యప్, జతిన్ శరణ్, రవి కిషన్, అశుతోష్ రానా తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేదాది నవంబర్‌లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఖాకీ వెబ్ సిరీస్ సూపర్‌హిట్‌గా నిలిచింది
ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోథా జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో కరణ్ టక్కర్, అవినాష్ తివారి, అభిమన్యుసింగ్, నీరజ్ కశ్యప్, జతిన్ శరణ్, రవి కిషన్, అశుతోష్ రానా తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేదాది నవంబర్‌లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఖాకీ వెబ్ సిరీస్ సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘సూపర్ పోలీస్ వర్సెస్ గ్యాంగ్‌స్టర్ పోరు’ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’లో మొత్తం ఏడు ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్‌లోనూ ట్విస్టులు ఉండడంతో ఓటీటీ లవర్స్ ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ను బాగా వీక్షించారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఐదు నెలలకు పైగా టాప్ 10 షోలలో ఒకటిగా ఖాకీ వెబ్ సిరీస్ నిలిచింది. కాగా సిరీస్ ఆఖరులోనే సీక్వెల్ కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్. అన్నట్లు గానే ఇప్పుడు ‘ఖాకీ: సీజన్ 2’ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.
ఈసారి ఎలాంటి కథతో వస్తారో మరి..
తాజాగా ఖాకీ సీజన్ 2 రిలీజ్ విషయాన్ని తెలియజేస్తూ ఖాకీ సీజన్ 2 టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఖాకీ: ది బిహార్ ఛాప్టర్‌ను ఎంతగానో ఆదరించారు.మీరు మాకు చాలా ప్రేమను ఇచ్చారు. ఇప్పుడు మీరు మమ్మల్ని మళ్లీ పిలుస్తున్నారు. ఖాకీ సీజన్ 2తో మీ ప్రేమ, శుభాకాంక్షలు, ఆశీర్వాదాల కోసం మేము ఎప్పటిలాగే ఎదురు చూస్తున్నాము’ అని టీజర్‌లో చెప్పుకొచ్చారు మేకర్స్. కాగా మొదటి పార్ట్‌కు దర్శకత్వం వహించిన నీరజ్ పాండేనే సీజన్ 2ను తెరకెక్కిస్తున్నారు. మొదటి సీజన్ బిహార్ గ్యాంగ్‌స్టర్ల నేపథ్యంలో సాగింది. మరి సీజన్ 2 ఏకథతో తెరకెక్కిస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఖాకీ సీజన్ 2 టీజర్ అనౌన్స్ మెంట్
View this post on Instagram
‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’ ట్రైలర్
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..