OTT Movies: ఓటీటీలో కొత్త సినిమాల జాతర.. ఈ వీకెండ్‌లో 30కు పైగా మూవీస్‌.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే

టీటీల్లో మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవలేదు. ఇప్పటికే గుడ్‌నైట్‌, రుద్రమాంబపురం, చక్రవ్యూహం లాంటి థ్రిల్లింగ్ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక శుక్రవారం (జులై 7) కూడా 20కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి.

OTT Movies: ఓటీటీలో కొత్త సినిమాల జాతర.. ఈ వీకెండ్‌లో 30కు పైగా మూవీస్‌.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Jul 06, 2023 | 8:45 PM

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జులై 7) కొత్త సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. ఈవారం నాగశౌర్య రంగబలి మాత్రమే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే భాగ్‌ సాలే వంటి కొన్నిచిన్న సినిమాలు కూడా థియేటర్లలో అడుగపెట్టనున్నాయి. అయితే ఓటీటీల్లో మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవలేదు. ఇప్పటికే గుడ్‌నైట్‌, రుద్రమాంబపురం, చక్రవ్యూహం లాంటి థ్రిల్లింగ్ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక శుక్రవారం (జులై 7) కూడా 20కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. అందులో సిద్ధార్థ్‌ కొత్త సినిమా టక్కర్‌, అలాగే ఐశ్వర్యా రాజేశ్‌ ఫర్హానా సినిమాలు వంటి ఇంట్రెస్టింగ్‌ సినిమాలు ఉన్నాయి. అలాగే విద్యుత్ జమాల్‌ ఐబీ 71 కూడా థియేటర్లలో ఆకట్టుకుంది. వీటితో పాటు హిందీ, ఇంగ్లిష్‌ భాషలకు చెందిన మరికొన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కు రానున్నాయి. మరి ఈ వీకెండ్‌లో ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లేంటో తెలుసుకుందాం రండి.

అమెజాన్‌ ప్రైమ్‌

  • బాబీలోన్ (హాలీవుడ్ )
  • స్వీట్ కారం కాఫీ (తెలుగు సిరీస్)
  • అదూరా (తెలుగు డబ్బింగ్ సిరీస్)
  • చక్రవ్యూహం (తెలుగు సినిమా ) (ఆల్రెడీ స్ట్రీమింగ్‌)
  • ద హారర్ ఆఫ్ డోలేరస్ రోచ్ (ఇంగ్లిష్ సిరీస్)

నెట్‌ఫ్లిక్స్

  • టక్కర్ (తెలుగు, తమిళ్)
  • ద లింకన్ లాయర్
  • ది పోప్స్‌ ఎగ్జార్సిస్ట్‌ (ఇంగ్లిష్‌ సినిమా)
  • ది ఔట్‌-లాస్‌ – (ఇంగ్లిష్‌ సినిమా)
  • 65 (ఇంగ్లిష్‌ మూవీ)

డిస్నీ+హాట్‌స్టార్

  • గుడ్‌నైట్ (తెలుగు డబ్బింగ్ సినిమా)(ఆల్రెడీ స్ట్రీమింగ్‌)
  • కిజాజీ మోటో : జనరేషన్ ఫైర్ (ఆఫ్రికన్ సిరీస్)
  • ఐబీ 71 (హిందీ సినిమా)
  • రుద్రమాంబపురం (తెలుగు సినిమా) (ఆల్రెడీ స్ట్రీమింగ్‌)

జీ5

  • తర్లా (హిందీ సినిమా)
  • కాథర్‌ బాషా ఎండ్ర ముత్తు రామలింగం (తమిళ్ సినిమా)

ఆహా

  • 3:33 (తమిళ్ సినిమా)

సోనీలివ్

  • ఫర్హానా (తమిళ్/తెలుగు)

జియో సినిమా

  • బ్లైండ్ (హిందీ)
  • ఉనాద్ (మరాఠీ సినిమా)
  • ది మ్యాజిక్ ఆఫ్ సిరి (హిందీ మూవీ)

బీఎస్ఎమ్

  • జాయ్ లాండ్ (పాకిస్థానీ సినిమా)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..