AHA OTT: ‘ఆహా’ యూజర్లకు పండగే.. తెలుగు స్ట్రీమింగ్‌కు వచ్చిన హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీస్‌.. లిస్ట్‌ ఇదే

గతంలో పలు హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సినిమాలను ఓటీటీ ప్రేక్షకుల కోసం స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది ఆహా. అది కూడా తెలుగు వెర్షన్‌లో. ఈసారి మరిన్ని హాలీవుడ్ సినిమాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవేంటంటే..

AHA OTT: 'ఆహా' యూజర్లకు పండగే.. తెలుగు స్ట్రీమింగ్‌కు వచ్చిన హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీస్‌.. లిస్ట్‌ ఇదే
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Jul 30, 2023 | 3:17 PM

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహా వినూత్నమైన కార్యక్రమాలు, ఈవెంట్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లనూ ఆడియెన్స్‌కు అందిస్తోంది ఆహా. అలాగే అన్‌స్టాపబుల్‌, ఇండియన్‌ ఐడల్‌ వంటి రియాలిటీషోలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మహిళల కోసం ఏకంగా ‘ నేను సూపర్ వుమన్‌’ అనే కొత్త షోను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా గతంలో పలు హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సినిమాలను ఓటీటీ ప్రేక్షకుల కోసం స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది ఆహా. అది కూడా తెలుగు వెర్షన్‌లో. ఈసారి మరిన్ని హాలీవుడ్ సినిమాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ది యాంగ్రీ బర్డ్స్ మూవీ, గూజ్‍బంప్స్ 2: హాంటెడ్ హలోవీన్, 2012, అండర్ వరల్డ్ బ్లడ్ వార్, మెన్ ఇన్ బ్లాక్ (ఎంఐబీ): ఇంటర్నేషనల్ వంటి హాలీవుడ్ సినిమాలు ప్రస్తుతం ఆహా ఓటీటీలోకి అడుగుపెట్టాయి. తెలుగు వెర్షన్‌లోనూ ఈ సినిమాలు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి.

కాగా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చిన హాలీవుడ్‌ సినిమాలన్నీ గతంలో సూపర్‌హిట్‌గా నిలిచినవే. బాక్సాఫీస్‌ వద్ద కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టిన సినిమాలే. ఇక ఈ వారమే విడుదలైన బ్లాక్‌ బస్టర్‌ మూవీ సామజవరగమన ఓటీటీలోనూ సూపర్‌ రెస్సాన్స్‌ దక్కించుకుంటోంది. 40 గంటల్లోనే 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. మరి వీకెండ్‌లో మంచి యాక్షన్‌ మూవీస్‌ను చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. ఓసారి ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ సూపర్‌ హిట్‌ మూవీస్‌పై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..