OTT: మూవీ లవర్స్‌కు బంపర్‌ ఆఫర్‌.. ఆ ప్రముఖ ఓటీటీలో రెండు రోజుల పాటు సినిమాలన్నీ ఫ్రీ.. పూర్తి వివరాలివే

ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో భాగంగా వివిధ ఓటీటీ సంస్థలు కొత్త కంటెంట్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. అలాగే పండగలు, ప్రత్యేక సందర్భాల్లోనూ కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అంటే ఎలాంటి సబ్‌ స్క్రిప్షన్‌ ఛార్జీలు చెల్లించకుండానే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను చూసేయచ్చన్నమాట. తాజాగా మరో ప్రముఖ ఓటీటీ సంస్థ ఇలాంటి బంపర్‌ ఆఫర్‌తో మన ముందుకు వచ్చింది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కు చెందిన..

OTT: మూవీ లవర్స్‌కు బంపర్‌ ఆఫర్‌.. ఆ ప్రముఖ ఓటీటీలో రెండు రోజుల పాటు సినిమాలన్నీ ఫ్రీ.. పూర్తి వివరాలివే
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Aug 23, 2023 | 3:08 PM

ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో భాగంగా వివిధ ఓటీటీ సంస్థలు కొత్త కంటెంట్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. అలాగే పండగలు, ప్రత్యేక సందర్భాల్లోనూ కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అంటే ఎలాంటి సబ్‌ స్క్రిప్షన్‌ ఛార్జీలు చెల్లించకుండానే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను చూసేయచ్చన్నమాట. తాజాగా మరో ప్రముఖ ఓటీటీ సంస్థ ఇలాంటి బంపర్‌ ఆఫర్‌తో మన ముందుకు వచ్చింది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కు చెందిన ఈటీవీ విన్‌ రెండు రోజుల పాటు తమ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న మొత్తం కంటెంట్ ను ఉచితంగా చూసేయచ్చని ప్రకటించింది. వాచ్‌ పార్టీ పేరుతో ఈ ఆఫర్‌ను ప్రకటించిన ఈటీవీ విన్‌.. ఆగస్టు 26, 27 తేదీల్లో తమ సినిమాలు, షోలన్నీ ఉచితంగా చూడవచ్చని తెలిపింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్‌ చేసింది. ‘మీ అందరి కోసం ఎంతో ఉత్సాహవంతమైన అనౌన్స్‌మెంట్‌. ‘వాచ్‌ పార్టీ’ పేరుతో ఈటీవీ విన్‌ అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈటీవీ విన్‌లో ఉన్న సినిమాలు, షోలను ఆగస్టు 26, 27 తేదీల్లో మొత్తం రెండు రెండు రోజుల పాటు సినిమాలు, షోలను ఫ్రీగా చూసేయండి. ఈ వారాంతంలో మీ ప్లాన్స్‌ అన్నీ క్యాన్సిల్‌ చేసుకోండి. తమ ప్లాట్ ఫామ్ లోని  కంటెంట్‌ మొత్తాన్ని చూసి ఆనందించండి’ అని తమ ప్రకటనలో పేర్కొంది ఈటీవీ విన్‌ ఓటీటీ.

ప్రస్తుతం ఈటీవీ విన్‌ ఓటీటీలో అందుబాటులో ఉన్న కొత్త సినిమాలివే.. ప్రస్తుతం ఈటీవీ విన్‌ ఓటీటీలో పలు కొత్త సినిమాలున్నాయి. అలాగే పాత క్లాసిక్‌ సినిమాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కొత్త సినిమాల విషయానికొస్తే.. ప్రకాశ్‌ రాజ్‌ ‘పార్థుడు’ ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇప్పటికే అన్నపూర్ణ ఫొటో స్టూడియో, అలాగే పోలీస్‌ స్టోరీ వంటి థ్రిల్లింగ్‌ మూవీస్‌ ఉన్నాయి. కనులు తెరిచినా కనులు మూసినా, లాక్‌ డౌన్‌ వెబ్ సిరీస్‌, అసలు, డియర్‌ మేఘా, పంచతంత్రం వంటి సరికొత్త సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు రేసు గుర్రం, నువ్వేకావాలి, ఏం మాయ చేశావే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆనందం, సమ్మోహనం, మిస్సమ్మ, గీతాంజలి, నర్తనశాల, ఆదిత్య 369 తదితర కల్ట్‌ క్లాసిక్‌ సినిమాలున్నాయి. సో.. వీకెండ్‌లో ఈ సినిమాలన్నింటినీ ఉచితంగా చూసేయండి మరి.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ ఓటీటీ ఆఫర్ ఇదే

ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులో ఉండే కొత్త సినిమాలు

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..