Vishwak Sen: ఇలాంటి ప్రమోషన్ నెవ్వర్ బిఫోర్.. విశ్వక్ ఆడించే ఫ్యామిలీ ఆట..

ఇటీవలే దాస్ కా ధమ్కీ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటివరకు నటుడిగా.. దర్శకుడిగా మెప్పించిన విశ్వక్.. ఇప్పుడు హోస్ట్‏గా అలరించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ విషయం తెలిపేందుకు సస్పెన్స్ క్రియేట్ చేస్తూ నోట్ షేర్ చేశారు. అందులో తన జీవితంలో మరో ఘట్టాన్ని ప్రారంభించబోతున్నానని.. త్వరలోనే కుటుంబాన్ని స్టార్ట్ చేయబోతున్నాను అంటూ ఓ గ్రీటింగ్ కార్డు షేర్ చేశాడు.

Vishwak Sen: ఇలాంటి ప్రమోషన్ నెవ్వర్ బిఫోర్.. విశ్వక్ ఆడించే ఫ్యామిలీ ఆట..
Vishwak Sen
Follow us

|

Updated on: Aug 16, 2023 | 5:37 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫలక్ నుమా దాస్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని.. మాస్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే దాస్ కా ధమ్కీ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటివరకు నటుడిగా.. దర్శకుడిగా మెప్పించిన విశ్వక్.. ఇప్పుడు హోస్ట్‏గా అలరించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ విషయం తెలిపేందుకు సస్పెన్స్ క్రియేట్ చేస్తూ నోట్ షేర్ చేశారు.

అందులో తన జీవితంలో మరో ఘట్టాన్ని ప్రారంభించబోతున్నానని.. త్వరలోనే కుటుంబాన్ని స్టార్ట్ చేయబోతున్నాను అంటూ ఓ గ్రీటింగ్ కార్డు షేర్ చేశాడు. దీంతో విశ్వక్ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. విశ్వక్ కు కాబోయే భార్య ఎవరంటూ నెట్టింట సెర్చింగ్ కూడా స్టార్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

విశ్వక్ సేన్ ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

ఇక ఇదే విషయంపై అందరి అంచనాలను తారుమారు చేస్తూ పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చాడు విశ్వక్. తెలుగు బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్టార్ట్ కాబోతున్న సరికొత్త షోకు విశ్వక్ హోస్ట్ గా చేయబోతున్నారు. ఫ్యామిలీ ధమాకా (Family Dhamaka) అనే టైటిల్ తో రాబోతున్న ఈ షోలో ఇండస్ట్రీకి చెందిన పలు సెలబ్రెటీ ఫ్యామిలీస్‏ను తీసుకొచ్చి విశ్వక్ ఆట ఆడించబోతున్నాడు. ఈవిషయాన్ని తెలియజేస్తూ.. కుటుంబాన్ని స్టార్ట్ చేయడమంటే ఇదే అంటూ క్లారిటీ ఇచ్చేశాడు విశ్వక్.

విశ్వక్ సేన్ ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

విశ్వక్ సేన్ ఇన్ స్టా పోస్ట్..

ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ షో చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆహాలో ఎన్ని షోలు వచ్చిన అన్ స్టాపబుల్ మ్యానియాని బ్రేక్ చేయలేకపోయాయి. ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ ఫ్యామిలీ ఆట ఆడించేందుకు వస్తున్నాడు. ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆహా ఓటీటీ ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.