Samantha: బొద్దింకను చంపితే హీరో అవుతారు.. మరోసారి ఇంట్రెస్టింగ్ కోట్ షేర్ చేసిన సమంత..
సినిమాల నుంచి విరామం తీసుకున్న సామ్.. కొద్ది రోజులుగా తన స్నేహితులతో కలిసి ఇండోనేషియాలోని బాలీలో స్నేహితులతో కలిసి చిల్ అవుతుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి వేకేషన్ లో ఉన్న సామ్.. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇక త్వరలోనే సామ్ చికిత్స కోసం అమెరికా వెళ్లనుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత… సినిమాలకు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా మయోసైటిస్ సమస్యతో పోరాడుతున్న ఆమె.. ఇటీవల కోలుకుని ఖుషి, సిటాడెల్ చిత్రీకరణలో పాల్గొంది. ఇక ఇప్పుడు ఆమె తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి సారించింది. ఇటీవల ఆమె కొత్త సినిమాలేవి ప్రకటించలేదు. ఇప్పటికే అంగీకరించిన సినిమాల నుంచి తప్పుకుంటూ రెమ్యూనరేషన్ కూడా తిరిగి ఇచ్చేసినట్లుగా సమాచారం. సినిమాల నుంచి విరామం తీసుకున్న సామ్.. కొద్ది రోజులుగా తన స్నేహితులతో కలిసి ఇండోనేషియాలోని బాలీలో స్నేహితులతో కలిసి చిల్ అవుతుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి వేకేషన్ లో ఉన్న సామ్.. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇక త్వరలోనే సామ్ చికిత్స కోసం అమెరికా వెళ్లనుంది.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన లేటేస్ట్ ఫోటోస్ అప్లోడ్ చేయడమే కాకుండా.. కొన్నిసార్లు ఫిలాసఫీ కోట్స్ షేర్ చేస్తుంటుంది. ఇక ఆమె చేసిన ప్రతి పోస్ట్ నెట్టింట క్షణాల్లో వైరలవుతుంటుంది.తాజాగా మరో ఆసక్తికర పోస్ట్ షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
సమంత లేటేస్ట్ ఇన్ స్టా పోస్ట్..
“బొద్దింకను చంపితే హీరో అవుతారు.. సీతాకోక చిలుకను చంపితే విలన్ అవుతారు. నైతికతకు కూడా సౌందర్య ప్రమాణాలు ఉన్నాయి” అంటూ రాసుకొచ్చింది సామ్. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఇది చూసిన నెటిజన్స్… విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.
సమంత ఇన్ స్టా ఫోటోస్..
View this post on Instagram
ఇక సామ్.. విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఖుషి చిత్రం త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి.
సమంత ఇన్ స్టా ఫోటోస్..
View this post on Instagram
ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది. ఈ సినిమానే కాకుండా… సామ్.. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ రీమేక్ లో నటించింది.
సమంత బాలి వెకేషన్ ఫోటోస్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.