AHA: ఆహా యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‌కు హాలీవుడ్‌ సూపర్‌హిట్‌ మూవీస్‌.. తెలుగులోనే

ఆహా యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. హాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సినిమాలు మరికొన్ని గంటల్లో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నాయి. అది కూడా తెలుగులో. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది ఆహా. ఇందులో భాగంగా 7 పాపులర్‌ హాలీవుడ్‌ మూవీస్‌ను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలిపింది.

AHA: ఆహా యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‌కు హాలీవుడ్‌ సూపర్‌హిట్‌ మూవీస్‌.. తెలుగులోనే
Aha Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Jun 24, 2023 | 4:03 PM

ఆహా యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. హాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సినిమాలు మరికొన్ని గంటల్లో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నాయి. అది కూడా తెలుగులో. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది ఆహా. ఇందులో భాగంగా 7 పాపులర్‌ హాలీవుడ్‌ మూవీస్‌ను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలిపింది. ‘మరింత ఎంటర్‌టైన్‍మెంట్ ఇవ్వడానికి.. హాలీవుడ్ ఈజ్‌ బ్యాక్‌. అది కూడా మన భాషలో..’ అని ట్వీట్‌ చేసిన ఆహా.. అమేజింగ్ స్పైడర్‌మ్యాన్, అమేజింగ్ స్పైడర్‌మ్యాన్-02, యాంగ్రీబర్డ్స్ 2, బ్రైట్‍బర్న్, చార్లెస్ ఏంజెల్స్, డోంట్ బ్రీత్, ఇన్‍సీడియస్ హాలీవుడ్ చిత్రాలను తెలుగులో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. శనివారం (జూన్‌ 24) అర్ధరాత్రి నుంచి ఈ బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలిపింది ఆహా. ఈ మేరకు సినిమాలకు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా పోస్ట్ చేసింది.

కాగా ఆహా ఓటీటీలో ఇప్పటికే ఇంటింటి రామాయణం, మళ్లీ పెళ్లి సినిమాలు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ఇంటింటి రామాయణం సినిమా థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే ఆహాలోకి అందుబాటులోకి వచ్చేసింది. రాహుల్‌ రామకృష్ణ, నవ్య స్వామి, నరేశ్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ టీజర్లు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇవి స్ట్రీమింగ్‌ అవుతుండగానే హాలీవుడ్‌ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికోసం 7 హాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది ఆహా. మరి.. మీరు కూడా హాలీవుడ్ మూవీ లవర్స్‌ అయితే ఎంచెక్కా ఆహాలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..