Kangana Ranaut: కంగనా సినిమా చూడాలని ఉందన్న కరణ్‌ జోహార్‌.. చంద్రముఖి రియాక్షన్ ఏంటో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ క్వీన్‌ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా బాలీవుడ్ పెద్ద సెలబ్రిటీలపై తనదైన శైలిలో విరుచుకుపడుతుంది. ముఖ్యంగా బంధుప్రీతికి పేరొందిన కరణ్ జోహార్ విషయంలో మరింత దూకుడుగా మాట్లాడుతుంది కంగనా. కరణ్ జోహార్ కూడా అప్పుడప్పుడు ఈ బ్యూటీ క్వీన్‌పై విమర్శలు చేస్తుంటాడు. అ

Kangana Ranaut: కంగనా  సినిమా చూడాలని ఉందన్న కరణ్‌ జోహార్‌.. చంద్రముఖి రియాక్షన్ ఏంటో తెలుసా?
Kangana Ranaut, Karan Johar
Follow us
Basha Shek

|

Updated on: Aug 22, 2023 | 9:56 PM

బాలీవుడ్ బ్యూటీ క్వీన్‌ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా బాలీవుడ్ పెద్ద సెలబ్రిటీలపై తనదైన శైలిలో విరుచుకుపడుతుంది. ముఖ్యంగా బంధుప్రీతికి పేరొందిన కరణ్ జోహార్ విషయంలో మరింత దూకుడుగా మాట్లాడుతుంది కంగనా. కరణ్ జోహార్ కూడా అప్పుడప్పుడు ఈ బ్యూటీ క్వీన్‌పై విమర్శలు చేస్తుంటాడు. అయితే ఇప్పుడు కంగనా ‘ఎమర్జెన్సీ’ సినిమా కోసం తాను వెయిట్ చేస్తున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు కరణ్. బాలీవుడ్‌ డైరెక్టర్‌ అండ్‌ ప్రొడ్యూసర్‌ ప్రకటనపై స్పందించిన కంగనా.. సోషల్‌ మీడియా వేదికగా మరోసారి కరణ్‌పై సెటైర్లు వేసింది. ‘మణికర్ణిక’ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని కరణ్ గతంలోనే చెప్పాడు. ఆ సినిమా విడుదలైనప్పుడు, నా జీవితంలో అత్యంత దారుణమైన పరిస్థితులు చూశాను. ఆ సినిమాలో నటించిన చాలా మంది పెద్ద నటీనటులు డబ్బులు తీసుకుని మరీ నన్ను తిట్టారు. సినిమా విడుదలై మొదటి వారాంతంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ, నాపై జరిగిన దాడి నన్ను పీడకలలా వెంటాడడం ప్రారంభించింది. ఇప్పుడు మళ్లీ కరణ్ నా సినిమా చూడాలని ఎగ్జయిట్‌గా ఉన్నానని చెప్పాడు. నాకు మళ్లీ భయం మొదలైంది’ అని ట్వీట్‌ చేసిందీ బాలీవుడ్ బ్యూటీ

కాగా కరణ్ జోహార్ కూడా స్టార్ నటుల పిల్లలతో సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో నెపోటిజానికి మద్దతు ఇస్తున్నాడని కంగనా విమర్శలు చేస్తోంది. కరణ్ జోహార్ బాలీవుడ్ మాఫియాలో సభ్యుడిగా ఉన్నాడని, బయటి వ్యక్తులను తొక్కే ప్రయత్నం చేస్తున్నాడని తరచూ ఆరోపిస్తూనే ఉంది. కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ షోపై కూడా కంగనా విమర్శలు గుప్పించింది. ఈక్రమంలోనే కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో నటించింది. కంగనా రనౌత్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రితేష్ షా స్క్రీన్ ప్లే రాశారు. ఈ సినిమా కోసం కంగనా నిర్మాతగా కూడా మారింది. ఇది కాకుండా, కంగనా రనౌత్ తమిళ చిత్రం చంద్రముఖి 2 లో కూడా నటించింది. వినాయక చవితి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

 కరణ్ జోహార్ పై  కం గనా రనౌత్ ట్వీట్

కంగనా రనౌత్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.