Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

Associate Editor - TV9 Telugu

mahatma.kodiyar@tv9.com

ఐటీ – టెక్నాలజీ రంగంలో గ్రాడ్యుయేట్ అయినప్పటికీ ఈనాడు జర్నలిజం స్కూల్ ద్వారా 2003లో మీడియా రంగంలోకి అడుగుపెట్టాను. ఈటీవీలో ట్రైనీ రిపోర్టర్ గా మొదలైన ప్రయాణంలో 2004 సార్వత్రిక ఎన్నికల కవరేజ్ తర్వాత క్రైమ్ రిపోర్టింగ్ చేపట్టాను. అక్కడే క్రైమ్ బ్యూరో ఇంఛార్జిగా పదోన్నతి పొంది, ఆ తర్వాత 2007లో NTV లో చేరాను. అక్కడ హైదరాబాద్ క్రైమ్ బ్యూరోతో పాటు విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర రీజనల్ హెడ్ గా పనిచేశాను. ఈ మధ్యలోనే జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. 2010లో టీవీ9లో క్రైమ్ బ్యూరో హెడ్‌గా ప్రయాణం మొదలుపెట్టి 2012లో ఢిల్లీ బ్యూరోకి మారాను. 2014 నుంచి సీనియర్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ర్యాంక్‌లో ‘ఢిల్లీ బ్యూరో హెడ్‌’గా బాధ్యతలు చేపట్టి 2023 నుంచి ‘అసోసియేట్ ఎడిటర్‌’గా కొనసాగుతున్నాను. 2013లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో జపాన్, థాయిలాండ్ దేశాల పర్యటనతో మొదలుపెట్టి అదే ఏడాది ఉత్తరాఖండ్ ను కుదిపేసిన కేదార్‌నాథ్ జలప్రళయం, 2015లో నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం, కాశ్మీర్ లోయ, ఈశాన్య రాష్ట్రాల్లో చోటుచేసుకునే హింసాత్మక ఘటనలు, హిమాలయ రాష్ట్రాల్లో సంభవించే ప్రకృతి వైపరీత్యాలు సహా 2022లో మొదలైన “ఉక్రెయిన్ – రష్యా యుద్ధం” కవరేజ్ వరకు నిత్యం వివిధ రాష్ట్రాలు, దేశాలు పర్యటిస్తూ గ్రౌండ్ జీరో నుంచి రిపోర్టింగ్ చేస్తున్నాను.

Read More
Follow On:
Mera Bill Mera Adhikar: కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. షాపింగ్ బిల్ అప్‌లోడ్ చేస్తే రూ.1 కోటి..! పూర్తి వివరాలివే..

Mera Bill Mera Adhikar: కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. షాపింగ్ బిల్ అప్‌లోడ్ చేస్తే రూ.1 కోటి..! పూర్తి వివరాలివే..

Mera Bill Mera Adhikar: కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు మీరు ఎక్కడ షాపింగ్ చేసినా ఫరవాలేదు,  ఏ వస్తువు కొన్నా ఫరవాలేదు, కాకపోతే బిల్లు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ బిల్లును అప్‌లోడ్ చేస్తే చాలు.. లక్కీ డ్రాలో మీరు బహుమతి గెలుచుకోవచ్చు. అది ఒకరికో, ఇద్దరికో పరిమితం చేసే బహుమతి కాదు. వందల మంది ఈ బహుమతులు గెలుచుకోవచ్చు. పది మంది తలో రూ. 10 లక్షలు గెలుచుకోవచ్చు. ఇద్దరు అదృష్టవంతులు చెరో రూ. 1 కోటి గెలుచుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన..

Board exams: విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం

Board exams: విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్న "న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (NEP)"లో భాగంగా సరికొత్త విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. పరీక్షల నిర్వహణ విధానాల్లోనూ సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు అమలవుతున్న పరీక్షా విధానంలో విద్యార్థులు పాఠ్యాంశాల్లోని అంశాలను ఎంతవరకు అర్థం చేసుకున్నారు అన్నది తేల్చలేం.

Supreme Court of India: ఆ కేసులో ఆఘమేఘాలపై కదిలిన సుప్రీంకోర్టు.. సెలవు దినాల్లోనూ విచారణ.. ఎందుకో తెలుసా?

Supreme Court of India: ఆ కేసులో ఆఘమేఘాలపై కదిలిన సుప్రీంకోర్టు.. సెలవు దినాల్లోనూ విచారణ.. ఎందుకో తెలుసా?

దేశంలో న్యాయస్థానాల్లో పేరుకుపోయిన కేసుల భారంతో సత్వర న్యాయం అందించడం చాలా వరకు సాధ్యం కావడం లేదు. మీడియాలో విస్తృతంగా ప్రసారమయ్యే సెన్సేషనల్ కేసుల్లోనే కాస్తో కూస్తో వేగంగా న్యాయం అందుతుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టినప్పటికీ చాలా కేసులు నత్తనడకనే సాగుతున్నాయి. ఎన్నికల అక్రమాల కేసుల్లో న్యాయస్థానంలో విచారణ ముగిసే సమయానికి పదవీకాలం కూడా పూర్తయిపోతోంది. ఈ ఉపోద్ఖాతం ఎందుకు అంటే.. అంతటి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న న్యాయవ్యవస్థ ఒక కేసు విషయంలో పరుగులు తీసింది. ఆఘమేఘాలపై స్పందించి, విచారణ చేపట్టింది. 24 గంటల్లోగా నివేదిక తెప్పించుకుని..

China Economic Crisis: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చైనా కీలక నిర్ణయాలు.. అక్కడ మందు వేస్తే..

China Economic Crisis: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చైనా కీలక నిర్ణయాలు.. అక్కడ మందు వేస్తే..

China Interest Rates: ప్రపంచీకరణ యుగంలో ఒక చోట తుమ్మితే.. యావత్ ప్రపంచానికి జలుబు చేస్తుంది. ఇది కోవిడ్-19 వంటి మహమ్మారి వంటి వైద్యారోగ్య రంగానికి సంబంధించిన విషయంలోనే కాదు, ఆర్థిక రంగంలో కూడా ప్రభావాలు అలాగే ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న అంశం చైనా ఆర్థిక మందగమనం.

INDIA కూటమి లోగో రెడీ.. ముహూర్తం, వేదిక ఖరారు.. ఇక విడుదల చేయడమే తరువాయి.. నెక్స్ట్ ఏంటి..?

INDIA కూటమి లోగో రెడీ.. ముహూర్తం, వేదిక ఖరారు.. ఇక విడుదల చేయడమే తరువాయి.. నెక్స్ట్ ఏంటి..?

Logo of INDIA alliance: ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A) లోగో సిద్ధమైంది. తదుపరి సమావేశంలోనే విడుదల చేసేందుకు కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. కూటమి వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. తదుపరి ముంబై మహానగరంలో జరగబోయే సమావేశంలో 'లోగో' ఆవిష్కరించేందుకు చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Climate changes: ఈ శతాబ్ది చివరలో ఆ ఎడారి పచ్చగా మారుతుంది.. కారణాలు తెలిస్తే షాక్ తింటారు..

Climate changes: ఈ శతాబ్ది చివరలో ఆ ఎడారి పచ్చగా మారుతుంది.. కారణాలు తెలిస్తే షాక్ తింటారు..

మానవ తప్పిదాలతో పెరిగిపోతున్న భూతాపం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులకు కారణమవుతోంది. వాతావరణ సమతౌల్యత దెబ్బతిని అతి భారీ వర్షాలు లేదా అనావృష్టి, అతి తీవ్ర తుఫానులు, అధిక వేడిగాలులు లేదా అతి శీతల గాలులు వంటి వైపరీత్యాలకు ఈ వాతావరణ మార్పులే (Climate Change) కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ మార్పులు అంతటా చేటే చేస్తాయా అంటే.. కాదు అని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో థార్ ఎడారి పచ్చగా మారనుందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

National: ప్రతిపక్ష కూటమి ప్రధాని అభ్యర్థి ఆమేనా.? దేశ రాజకీయాల్లో ఏం జరగనుంది.?

National: ప్రతిపక్ష కూటమి ప్రధాని అభ్యర్థి ఆమేనా.? దేశ రాజకీయాల్లో ఏం జరగనుంది.?

ఎన్డీఏలో బీజేపీనే ఏకైక జాతీయ పార్టీ. ఆ కూటమి ప్రధాని అభ్యర్థిగా ఈసారి కూడా నరేంద్ర మోదీయే ఉన్నారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) నుంచి I.N.D.I.A గా పేరు మార్చుకున్న విపక్ష కూటమి నుంచే ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. 2004లో ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకపోయినా.. గెలుపొందిన తర్వాత సోనియా గాంధీపై విదేశీ విమర్శల నేపథ్యంలో మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా ఎన్నుకున్నారు...

Priyanka Gandhi : ఈసారి ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ?.. మరైతే పోటీ ఎక్కణ్ణుంచి?

Priyanka Gandhi : ఈసారి ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ?.. మరైతే పోటీ ఎక్కణ్ణుంచి?

కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు ఆమె రాకను ఆకాంక్షిస్తూ, స్వాగతిస్తూ పలు సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పుడు పార్టీని దాటి మిత్రపక్షాల నుంచి కూడా మద్దతు కనిపిస్తోంది. ఇప్పటికే జట్టు కట్టిన 26 పార్టీలు ప్రధాని మోదీని ఎలా ఢీకొట్టాలా అని చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్నాచెల్లెళ్లు రాహుల్ - ప్రియాంక ఇద్దరూ ఎన్నికల బరిలో నిలిచి పార్టీ శ్రేణులను ఉత్తేజితం చేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Independence day: మువ్వన్నెల జెండా కోసం ఇల్లు అమ్ముకున్నాడు.. అలాంటి దేశభక్తి ఎక్కడా చూడలేదన్న పూనమ్ కౌర్

Independence day: మువ్వన్నెల జెండా కోసం ఇల్లు అమ్ముకున్నాడు.. అలాంటి దేశభక్తి ఎక్కడా చూడలేదన్న పూనమ్ కౌర్

దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి కాపాలా కాసే జవాన్లను చూశాం. దేశభక్తి అంటే ఇది కదా అనుకుంటాం. అందరికీ సైన్యంలో చేరే అవకాశం రాదు. కానీ దేశం పట్ల తమకున్న భక్తిని చాటుకోడానికి ఒక్కొక్కరు ఒక్కోలా ప్రయత్నిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వాసి రుద్రాక్షల సత్యనారాయణ చేసిన ప్రయత్నం ఇప్పుడు యావద్దేశాన్ని ఆకట్టుకుంటోంది. వృత్తిరీత్యా నేత కార్మికుడైన సత్యనారాయణ, ఎలాంటి అతుకులు లేకుండా జాతీయ జెండాను రూపొందించాలని అనుకున్నాడు. కేవలం రూపొందించడమే కాదు, ఆ జెండాను ప్రధాన మంత్రి చేతుల మీదుగా ఎర్రకోట మీద ఎగరేయించాలన్నది ఆశయంగా పెట్టుకున్నారు.

PM Modi: హలో.. నేను నరేంద్ర మోదీని మాట్లాడుతున్నా.. బీజేపీ బూత్ వర్కర్లకు పెద్ద నేతల ఫోన్లు. ఎందుకో తెలుసా?

PM Modi: హలో.. నేను నరేంద్ర మోదీని మాట్లాడుతున్నా.. బీజేపీ బూత్ వర్కర్లకు పెద్ద నేతల ఫోన్లు. ఎందుకో తెలుసా?

పేరుకు రాజకీయ పార్టీయే కానీ వ్యవస్థ ఓ కార్పొరేట్ కంపెనీని మించి ఉంటుంది. మోదీ-షా తరం మొదలయ్యాక పార్టీలో సమూల మార్పులు తీసుకొచ్చారు. జాతీయ ప్రధాన కార్యాలయ భవనాలతో పాటు ప్రతి జిల్లాలో పార్టీకి కార్యాలయం ఉండేలా చర్యలు చేపట్టారు. గతంలో కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే ఈ తరహా వ్యవస్థ ఉండేది. బీజేపీ ఒక అడుగు ముందుకేసి అన్ని హంగులు, వసతులతో కార్యాలయాలను తీర్చిదిద్దడంతో పాటు పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్త సమాచారాన్ని నిక్షిప్తం చేసే ప్రక్రియ ప్రారంభించింది.

Mobile Phones: అక్కడి స్కూళ్లలో మొబైల్ ఫోన్లు బంద్.. సర్క్యులర్ జారీ చేసిన సర్కారు.. ఎందుకో తెలుసా?

Mobile Phones: అక్కడి స్కూళ్లలో మొబైల్ ఫోన్లు బంద్.. సర్క్యులర్ జారీ చేసిన సర్కారు.. ఎందుకో తెలుసా?

మొబైల్ ఫోన్ కలిగించే ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే ఎక్కువ ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ల యుగంలో అవి అందించే వినోదం పక్కదారి పడుతోంది. సోషల్ మీడియా ఒక వ్యసనంగా తయారవుతోంది. మరీ ముఖ్యంగా పరిణితి లేని వయస్సులో పిల్లలు వీడియో గేమ్స్‌కు బానిసల్లా మారి మతి, గతి తప్పుతున్న ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే..

Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్, జూదంపై 28 శాతం జీఎస్టీ.. బిల్లుకు కేబినెట్ ఆమోదం.. అప్పటినుంచే అమలు!

Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్, జూదంపై 28 శాతం జీఎస్టీ.. బిల్లుకు కేబినెట్ ఆమోదం.. అప్పటినుంచే అమలు!

కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. కేంద్ర ప్రభుత్వం దాన్నే కాస్త మార్చి.. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ జీఎస్టీకి అనర్హం అంటోంది. ఆదాయం సమకూర్చుకునే ఏ ఒక్క అవకాశాన్నీ ప్రభుత్వం వదులుకోదల్చుకోవడం లేదు. ఈ క్రమంలో తాజాగా వస్తు, సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ – GST) పరిధిలోకి మరికొన్నింటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆధునిక జీవితంలో ఒక భాగంగా మారిపోతున్న ఆన్‌లైన్ గేమింగ్‌తో […]