Andhra Pradesh: చంద్రబాబుతో భేటీ అయిన యార్లగడ్డ.. మరి దుట్టా దారెటు.. గన్నవరంలో హాట్ డిస్కర్షన్..
గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం బలప్రదర్శనకు వేదికగా మారింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాలను కార్యకర్తల సమావేశంలో ప్రస్తావించిన ఆయన.. తమను ఓడించిన వ్యక్తితోనే సంధి ఏంటంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తీవ్ర విమర్శలు చేశారు. అదే సమావేశంలో చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇస్తే కలుస్తానన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం నాడు యార్లగడ్డ వెంకట్రావు చంద్రబాబును హైదరాబాద్‌లో కలిశారు. అయితే, వీరి భేటీలో ఏయే అంశాలు ప్రస్తావనకు వస్తాయన్నది...
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం రాజకీయాలు రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ క్రమంలో యార్లగడ్డకు సన్నిహితంగా ఉండే దుట్టా రామచంద్రరావు దారెటు అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే, ఇప్పటికే దుట్టా అనుచరులు యార్లగడ్డ వెంట నడుస్తున్నారు. దుట్టా రామచంద్రరావు మాత్రం ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నారు. వైసీపీలోనే కొనసాగుతారన్న టాక్ కూడా వినిపిస్తుంది. పార్టీ మారడానికి సంబంధించి ప్రస్తుతానికి దుట్టా నుంచి మాత్రం బహిరంగంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం బలప్రదర్శనకు వేదికగా మారింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాలను కార్యకర్తల సమావేశంలో ప్రస్తావించిన ఆయన.. తమను ఓడించిన వ్యక్తితోనే సంధి ఏంటంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తీవ్ర విమర్శలు చేశారు. అదే సమావేశంలో చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇస్తే కలుస్తానన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం నాడు యార్లగడ్డ వెంకట్రావు చంద్రబాబును హైదరాబాద్‌లో కలిశారు. అయితే, వీరి భేటీలో ఏయే అంశాలు ప్రస్తావనకు వస్తాయన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే, యార్లగడ్డ టీడీపీలో చేరిక దాదాపు కన్ఫామ్ అయ్యింది. ఈ నెల 22న నారా లోకేష్ సమక్షంలో ఆయన టీడీపీలో జాయిన్ అవుతున్నారు.
గత ఎన్నికల్లో తనపై గెలిచిన వల్లభనేని వంశీ.. వైసీపీలో చేరడంతో యార్లగడ్డకు నియోజకవర్గంలో ప్రాధాన్యత తగ్గింది. ఓటమి తర్వాత ఆయనకు కేడీసీసీ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు కేవలం 990 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరడంతో నియోజకవర్గంలో పరిస్థితి యార్లగడ్డ వర్సెస్ వల్లభనేనిగా మారింది.
ఇక వంశీ రాకను వ్యతిరేకిస్తూ.. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు ఒక్కటయ్యారు. యార్లగడ్డకు వెనక ఉండి మద్దతిస్తూ వచ్చారు దుట్టా రామచంద్రరావు. ఆత్మీ సమావేశంలో దుట్టాకు కూడా వైసీపీ అన్యాయం చేసిందంటూ యార్లగడ్డ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆత్మీయ సమావేశానికి ముందు దుట్టాతో పలుమార్లు భేటీ అయ్యారు యార్లగడ్డ. ఈ నేపథ్యంలోనే యార్లగడ్డ టీడీపీలోకి వెళ్తుండగటంతో.. దుట్టా కూడా ఆయనతో పాటే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటారా? అనే సందేహాలు వచ్చాయి. అయితే, అవసరం వచ్చినప్పుడు తన నిర్ణయం చెబుతానంటూ దుట్టా బదులిచ్చారు. దాంతో టీడీపీలో దుట్టా చేరికపై సస్పెన్స్ నెలకొంది.
మొత్తంగా చూసుకుంటే.. యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరితే, గన్నవరం టికెట్ ఆయనకు కేటాయిస్తే ఎన్నికల్లో టఫ్ ఉంటుందని మాత్రం అంచనా వేస్తున్నారు పొలిటికల్ విశ్లేషకులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..