Maharashtra: కన్న తండ్రినే చంపాలని ప్లాన్ వేసిన కూతురు.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..

ప్రేమ, కామం రెండూ వేరు వేరు.. ప్రేమ వివేకాన్ని కలిగి ఉంటుంది. కామం.. ఆ వివేకాన్ని, విచక్షణను పోగొడుతుంది. అయితే, కొన్నిసార్లు పిచ్చి ప్రేమ కూడా మనిషిని దారుణానికి ఒడిగట్టేలా ఉసిగొల్పుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఎదురైంది. ప్రేమ కోసం ఏకంగ తండ్రినే చంపాలని చూసింది ఓ కూతురు. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్ వేసింది. అనుకున్నట్లుగానే.. నలుగురు వ్యక్తులకు 60వేలు సుపారీ కూడా ఇచ్చారు. ప్లాన్‌ ప్రకారం ఆ నలుగురు వ్యక్తులు మహేంద్రపై దాడి చేశారు.దారుణంగా కొట్టి ఆయన రెండు కాళ్లు విరగొట్టారు. పదునైన ఆయుధంతో

Maharashtra: కన్న తండ్రినే చంపాలని ప్లాన్ వేసిన కూతురు.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..
Solapur Couple
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 11, 2023 | 12:09 PM

మాధా, షోలాపూర్, ఆగష్టు 11: ప్రేమ గుడ్డిది అని అంటారు. ప్రేమలో ఉన్న జంటలు తమ ప్రేమను సక్సె్స్ చేసుకోవడానికి దేనికైనా సిద్ధపడతారు. షోలాపూర్‌లోని మాదా తాలూకాలో ఓ యువతి ప్రేమ కోసం చేసిన పని యావత్ సమాజాన్ని షాక్ అయ్యేలా చేసింది. ఒక అమ్మాయి తన ప్రియుడిని దక్కించుకునేందుకు అడ్డుగా ఉన్న కన్న తండ్రినే చంపేయాలని ప్లాన్ వేసింది. ప్లాన్ వేయడమే కాదండో.. అమలు కూడా చేసింది. అయితే, మళ్లీ ఏం ఆలోచించిందో ఏమో గానీ.. చంపడం కంటే.. కాళ్లు విరగ్గొడితే చాలని భావించింది. కారణం.. తండ్రి వికలాంగుడైతే తన కోసం వెతకలేడని, తన కోసం రాలేడని భావించింది. ఇందుకోసం తన ప్రియుడి సాయం కూడా తీసుకుంది. మాదా షెట్‌ఫాల్ మార్గ్‌లోని వడచివాడి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన తండ్రిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా విషయం వెల్లడైంది. ఈ కేసులో మాదా పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుల్లో బాధితుడి కూతురు సాక్షి షా, చైతన్య కాంబ్లే, అతిక్ లంకేశ్వర్, మయూర్ చందన్‌శివే, రామ్ పవార్, ఆనంద్ అలియాస్ బంద్యా జాదవ్.

అసలేం జరిగింది?

సాక్షి షా, చైతన్య కాంబ్లేతో చాలా ఏళ్లుగా రహస్యంగా సహజీవనం సాగిస్తోంది. సాక్షి బారామతిలో ఎంబీఏ చదువుతుండగా, చైతన్య మాధాలో కేక్ షాప్ నడుపుతున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారు. అయితే, సాక్షి తండ్రి దీన్ని వ్యతిరేకించారు. దీంతో సాక్షి, చైతన్య తమ తండ్రిని ఎలాగైనా హంతమొందించాలని ప్లాన్ వేశారు. తన తండ్రి కాళ్లు నరికేస్తే ఇక కదలకుండా మంచానికే పరిమితం అవుతారని, తాము ఎంచక్కా లేచిపోవచ్చని ప్లాన్ వేసింది సాక్షి.

పక్కా ప్లాన్‌తో..

సాక్షి తన తండ్రితో కలిసి కారులో పూణె నుంచి షెట్‌ఫాల్‌కు వస్తోంది. ఈ సమయంలో సాక్షి వడచివాడి గ్రామం వద్దకు రాగానే టాయిలెట్‌కు వెళ్తానని చెప్పి కారును ఆపించింది. అలా కారు దిగి సాక్షి టాయిలెట్‌కి వెళ్లడమే ఆలస్యం.. ప్లాన్‌ ప్రకారం నలుగురు వ్యక్తులు వారి కారు వద్దకు వచ్చారు. ఈ నలుగురూ షాపై దాడి చేశారు. ఈ దాడిలో షా తలకు తీవ్ర గాయాలయ్యాయి. రెండు కాళ్లను విరగ్గొట్టారు. గాయపడిన షాను మాధాలోని పాటిల్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి షోలాపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మాడ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇలా తెలిసింది..

ఈ ఘటనపై సాక్షిని పోలీసులు విచారించగా.. దోపిడీ దారులే ఈ పని చేసినట్లు తెలిపింది. అయితే, విచారణ సమయంలో పోలీసులను సాక్షి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. దాంతో అనుమానం వచ్చిన పోలీసులు.. తమదైన శైలిలో విచారించారు. కాల్ డేటా మొత్తం తీసి ఆమె ముందు పెట్టారు. దెబ్బకు జరిగిన విషయం అంతా పోలీసులకు తెలిపింది. సాక్షి, ఆమె ప్రియుడు సహా మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..