Health Tips: రోజూ క్యారెట్ తినడం వల్ల కంటి చూపు పెరుగుతుందా? ఇందులో నిజమెంత? కీలక వివరాలు..

ఈ రోజుల్లో ప్రజలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు. ఆఫీసులో కంప్యూటర్ ముందు 9 10 గంటలు గడపడం వల్ల శరీరం రోగాల నిలయంగా మారడమే కాకుండా, సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా కూర్చుని చేసే జాబ్ వల్ల ఎక్కువ ప్రభావం కళ్లపై పడుతుంది. ఫలితంగా కళ్ళు బలహీనంగా మారతాయి. అయితే, ఈ కంటి చూపు సమస్య నుంచి బయటపడేందుకు ప్రజల్లో ఒక ఆలోచన ఉంది. అదే క్యారెట్ తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుందని నమ్ముతారు. ఇది పూర్తిగా నిజమని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. మరికొందరు దీనిని అపోహ అనుకుంటారు. అయితే, వాస్తవానికి ఇది కాస్త ఉపయోగకరమే..

Health Tips: రోజూ క్యారెట్ తినడం వల్ల కంటి చూపు పెరుగుతుందా? ఇందులో నిజమెంత? కీలక వివరాలు..
Carrot
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 11, 2023 | 3:00 PM

ఈ ఉరుకులు పరుగుల జీవితంలో, ఈ రోజుల్లో ప్రజలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు. ఆఫీసులో కంప్యూటర్ ముందు 9 10 గంటలు గడపడం వల్ల శరీరం రోగాల నిలయంగా మారడమే కాకుండా, సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా కూర్చుని చేసే జాబ్ వల్ల ఎక్కువ ప్రభావం కళ్లపై పడుతుంది. ఫలితంగా కళ్ళు బలహీనంగా మారతాయి. అయితే, ఈ కంటి చూపు సమస్య నుంచి బయటపడేందుకు ప్రజల్లో ఒక ఆలోచన ఉంది. అదే క్యారెట్ తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుందని నమ్ముతారు. ఇది పూర్తిగా నిజమని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. మరికొందరు దీనిని అపోహ అనుకుంటారు. అయితే, వాస్తవానికి ఇది కాస్త ఉపయోగకరమే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ఉండే బీటా కెరోటిన్ కళ్ల ఆరోగ్యాన్ని పెంచుతుంది.

క్యారెట్లు నిజంగా ప్రయోజనకరమా?

కంటి చూపు కోసం క్యారెట్ మాత్రమే కాకుండా పాలకూర, బచ్చలి కూర, క్యాప్సికం కూడా తినవచ్చు. ఇవి క్యారెట్ కంటే ఎక్కువ ప్రయోజనకరమైనవి. మరి క్యారెట్ తింటేనే ప్రయోజనం అని ఎందుకు చెబుతున్నారు అంటే.. ఇందులో నిజం లేదని రిప్లై ఇస్తున్నారు నిపుణులు. మిగతా వాటి మాదిరిగానే క్యారెట్లు కూడా పని చేస్తాయని చెబుతున్నారు.

క్యారెట్ వంటి కూరగాయలు తినకపోతే కళ్లు మరింత బలహీనపడుతాయని, కళ్లద్దాలు వస్తాయని చిన్ననాటి నుంచి పిల్లలను భయపెడుతూ, వాటిని తినేలా ప్రోత్సహిస్తుంటారు పెద్దలు. వాస్తవానికి 90ల నాటి పిల్లలు కళ్లద్దాలంటే చాలా భయపడేవారు. కానీ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మిగతా కూరగాయల మాదిరిగానే క్యారెట్ కూడా పోషకాహారం కలిగి ఉంటుందని చెబుతున్నారు.

కంటి చూపు మెరుగు అయ్యేందుకు దోహదపడే ఆహారాలు..

1. క్యారెట్: క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది విటమిన్ ఎ ను తయారు చేయడానికి శరీరం ఉపయోగిస్తుంది. విటమిన్ ఎ కళ్ళ ఆరోగ్యానికి ముఖ్యమైనది. అందుకే కంటి చూపు కోసం క్యారెట్ తినాలని సూచిస్తారు.

2. బచ్చలి కూర/ఆకు కూరలు: బచ్చలికూర, బ్రోకలీ వంటి ముదురు ఆకుపచ్చ ఆకు కూరలలో రెటీనాలో అధిక సాంద్రతలో ఉండే యాంటీఆక్సిడెంట్లు లుటిన్, జియాక్సంథిన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫిల్టర్‌గా పనిచేస్తాయి. బ్లూ లైట్ దెబ్బతినకుండా రెటీనాను రక్షిస్తాయి.

3. బెర్రీలు: నారింజ, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ, కివీ వంటి కూరగాయలు విటమిన్ సి కలిగి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది కంటిశుక్లం అభివృద్ధిని నిరోధించడంలో సహాయపడుతుంది.

4. సాల్మన్: ముఖ్యంగా సాల్మన్ చేపలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో నిండి ఉంటాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు రెటీనా ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. పొడి కళ్లను నివారించడంలో సహాయపడతాయి. సాల్మన్, సార్డినెస్, హెర్రింగ్‌లలో అధికస్థాయిలో ఒమేగా 3 ఉంటుంది.

5. నత్తగుల్లలు/నత్త మాంసం: ఇందులో జింక్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది వృద్దాప్య ఛాయలను నివారిస్తుంది. గుడ్లు, వేరుశెనగ, తృణధాన్యాలలో కూడా జింక్ ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..