Khammam: అనాథ శిశువుని అక్కున చేర్చుకున్న అమెరికా దంపతులు.. ఖమ్మం నుంచి యుఎస్ కు పయనం..

మన దేశం కాదు.. మన రాష్ట్రం కాదు.. మన ఊరు కాదు . ఎక్కడో.. తల్లి కేరళ, తండ్రి ఆస్ట్రేలియా.. ఇద్దరు యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా లో స్థిరపడ్డారు. ఈ దంపతులు మన దేశం నుండి అనాధ బాలికని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్నెట్లో భారత దేశం పిల్లల దత్తత గురించి తెలుసుకొని, అక్కడి వర్గాల సూచన మేరకు భారత దేశం పిల్లల దత్తత గురించి ఆరా తీశారు.

Khammam: అనాథ శిశువుని అక్కున చేర్చుకున్న అమెరికా దంపతులు.. ఖమ్మం నుంచి యుఎస్ కు పయనం..
Us Couple Adopts Orphan
Follow us
N Narayana Rao

| Edited By: Vimal Kumar

Updated on: Jan 05, 2024 | 5:50 PM

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందికి రెండు రోజుల క్రితం శిశువు కనిపించింది.. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చేరదీసి శిశు గృహంలో ఆశ్రయం కల్పించారు. కన్న తల్లి దండ్రులు ఎవరో తెలియక పోవడం.. వారి ఆచూకీ లేకపోవడంతో.. అనాథగా ప్రకటించి.. కారా వెబ్ సైట్ లో వివరాలు అప్ లోడ్ చేశారు. ఏడాది వయసున్న ఆ బాలికను అమెరికా కు చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు వారికి వారసురాలయ్యే అదృష్టం దక్కింది

మన దేశం కాదు.. మన రాష్ట్రం కాదు.. మన ఊరు కాదు . ఎక్కడో.. తల్లి కేరళ, తండ్రి ఆస్ట్రేలియా.. ఇద్దరు యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా లో స్థిరపడ్డారు. ఈ దంపతులు మన దేశం నుండి అనాధ బాలికని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్నెట్లో భారత దేశం పిల్లల దత్తత గురించి తెలుసుకొని, అక్కడి వర్గాల సూచన మేరకు భారత దేశం పిల్లల దత్తత గురించి ఆరా తీశారు. కేంద్ర శిశు, మహిళా సంక్షేమశాఖ ద్వారా అధికారికంగా www.cara.nic.in లో బాలిక దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తో వీడియో కాల్ నందు మాట్లాడి వివరాలు తెలుసుకొని వారి ధ్రువపత్రాలు పరిశీలించి, వారు సమర్పించిన పత్రాలన్నీ పక్కాగా ఉన్నాయని నిర్ధారించి, దత్తతకు అంగీకరించారు. ఖమ్మం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో విదేశీ దంపతులకు బాలిక ను (Mr. Florian Hackl and Mrs.Geena Kuriakose Athappily) అప్పగించారు. పిల్లల దత్తత కావాల్సిన వారు www.cara.nic.in నుండి చట్టబద్దంగా స్త్రీ- శిశు సంక్షేమ శాఖ ద్వారా అధికారికంగా దత్తత కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఆ దంపతులు బాలికను అక్కున చేర్చుకుంటూ..తమకు పిల్లలు లేని లోటు తీరుతుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..