Indian Sonneteer: రెండో సారి ప్రపంచ రికార్డు నెలకొల్పిన తెలుగు తేజం.. ఠాగూర్‌ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు..

వెంకట్ పూలబాల అనే వ్యక్తి గతంలో 'భారతవర్ష' అనే పుస్తకాన్ని ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా అన్ని సుమారు రెండు లక్షలకు పైగా తెలుగు పదాలతో,1265 పేజీలతో కూడిన పుస్తకం కేవలం 8 నెలల్లో రాశాడు. ఈ ఘనతకు గానూ భారతవర్ష పుస్తకం ప్రపంచ రికార్డను సాధించింది. అదే విధంగా పూలబాల వెంకట్ తాజాగా రాసిన ఇండియన్ సోనేటరీ అనే ఆంగ్ల పద్య పుస్తకం వెంకట్ పూలబాల గారికి రెండవసారి ప్రపంచ రికార్డు సాధించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..

Indian Sonneteer: రెండో సారి ప్రపంచ రికార్డు నెలకొల్పిన తెలుగు తేజం.. ఠాగూర్‌ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు..
Writer Venkat Poolabala
Follow us
M Sivakumar

| Edited By: Srilakshmi C

Updated on: Aug 20, 2023 | 6:56 PM

అమరావతి, ఆగస్టు 20: తెలుగు, సంస్కృతం, స్పానిష్, ఫ్రెంచ్, ఇటలీయన్, జాపనీస్ భాషలను అనర్గాలంగా మాట్లాడగలడు విజయవాడకు చెందిన బహుభాషవేత్త పూలబాల వెంకట ప్రసాద్‌. తన అరుదైన కవితలతో, కథలతో భారత వర్ష అనే పుస్తకాన్ని రచించి ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్న రచయికుడు. ఇండియన్ సోనెటీర్ అనే 200 వందల ఆంగ్ల పద్యాలు కలిగిన పుస్తకాన్ని రచించి రెండోవ సారి ప్రపంచ రికార్డును సాధించిన తెలుగు తేజం..

వెంకట్ పూలబాల అనే రచయిత గతంలో ‘భారతవర్ష’ అనే పుస్తకాన్ని ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా అన్ని సుమారు రెండు లక్షలకు పైగా తెలుగు పదాలతో, 1265 పేజీలతో కూడిన పుస్తకం కేవలం 8 నెలల్లో రాశాడు. ఈ ఘనతకు గానూ భారతవర్ష పుస్తకం ప్రపంచ రికార్డ్ సాధించింది. అదే విధంగా పూలబాల వెంకట్ తాజాగా రాసిన ఇండియన్ సోనెటీర్ అనే ఆంగ్ల పద్య పుస్తకం వెంకట్ పూలబాల గారికి రెండవసారి ప్రపంచ రికార్డు సాధించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..

‘సొనెట్ అంటే 14 లైన్ల చివర ఒకే రకమైన పద శబ్దంతో ముగిసే ఒక పద్యం. ఠాగూర్ రాసిన కవితలని బెంగాలీ భక్తి గీతాలని అంటారు. వాటిని అతడే స్వయంగా అంగ్లంలోకి అనువదించుకున్నాడు. వాటిని ప్రోస్ పోయెట్రీ (పాఠం లాంటి) అంటారు. దానికి YB Yeats (ఈట్స్) అనే ఆంగ్లకవి ముందు మాట రాశాడు. T Strudge Moor స్ట్రడ్జ్ మూర్ అనే బ్రిటిష్ కవి గీతాంజలిని నోబెల్ కమిటీకి నామినేట్ చేసాడు. ఆ నోబెల్ ప్రైజ్ వెనుక ఇంకా చాలానే కథ ఉందని వెంకట్ పూలబాల వెల్లడించారు. తాను రాసిన ఇండియన్ సోనెటీర్ పుస్తకంలో భారతదేశ మునుగడను ఉద్దేశించి పక్షులని, చీమ, చెట్టు, రకరకాల జీవులను వర్ణిస్తూ, మనుషుల హావభావాలను గురించి రాసానని తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

రబీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత భారతదేశనికి పుస్తకా రచనల్లో ఎలాంటి నోబెల్ ప్రైజ్ రాలేదని, తాను రాసే పుస్తకాలు నోబెల్ ప్రైజ్ తెచ్చేవరకు కథలు, పద్య, గద్య రచనలు చేస్తానాని వెల్లడించారు. భారతదేశ రచనకు సంబదించి నోబెల్ ప్రైజ్ తీసుకురావాలానేది ఒక భారతీయుడిగా, తెలుగు వ్యక్తిగా కృషి చేస్తూ ఉంటానని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.