Pregnancy Diet: గర్భధారణ సమయంలో ఈ ఆహారాలు తప్పనిసరిగా తినాలి.. లేదంటే బిడ్డ ఎదుగుదల..

ఆరోగ్యకరమైన గర్భధారణకు జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. జింక్ అనేది ఆరోగ్యానికి మేలు చేసే ముఖ్యమైన ఖనిజం. శరీరంలోని పలు ముఖ్యమైన క్రియల్లో జింగ్‌ కీలకంగా వ్యవహరిస్తుంది. ఐతే మన శరీరం జింక్‌ను నిల్వ చేయలేదు. అందువల్ల రోజు వారీ ఆహారంలో తగినంత మొత్తంలో జింక్ అందాలంటే పోషకవిలువలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఏయే ఆహారాల్లో జింక్ పుష్కలంగా ఉంటుందో చూద్దాం..

Pregnancy Diet: గర్భధారణ సమయంలో ఈ ఆహారాలు తప్పనిసరిగా తినాలి.. లేదంటే బిడ్డ ఎదుగుదల..
Pregnancy Diet
Follow us

|

Updated on: Aug 18, 2023 | 4:12 PM

ప్రతి స్త్రీకి తల్లి అయ్యే సమయం ఎంతో కీలకమైనది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో జింక్ వంటి ఇతర పోషకాల లోపం తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందుకే పోషకాహార నిపుణులు గర్భిణీ మహిళలకు ప్రత్యేక డైట్‌ను సూచిస్తారు. అందుకే గర్భిణీ మహిళకు, కడుపులోని బిడ్డకు ఇద్దరి ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు అందేలా తగిన ఆహార నియమాలు పాటించాలని చెబుతుంటారు. ఆరోగ్యకరమైన గర్భధారణకు జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. జింక్ అనేది ఆరోగ్యానికి మేలు చేసే ముఖ్యమైన ఖనిజం. శరీరంలోని పలు ముఖ్యమైన క్రియల్లో జింగ్‌ కీలకంగా వ్యవహరిస్తుంది. ఐతే మన శరీరం జింక్‌ను నిల్వ చేయలేదు. అందువల్ల రోజు వారీ ఆహారంలో తగినంత మొత్తంలో జింక్ అందాలంటే పోషకవిలువలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఏయే ఆహారాల్లో జింక్ పుష్కలంగా ఉంటుందో చూద్దాం..

ఉసిరికాయ

ఇందులో ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, జింక్ ఉంటాయి. ఉసిరికాయతో తయారు చేసిన రకరకాల ఆహారాలను తయారు చేసి మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

కాయధాన్యాలు

మొక్కల ఆధారిత కాయధాన్యాల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. జింక్ పుష్కలంగా ఉండే కాయధాన్యాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

బాదం

బాదంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయం పూట ఆహారంలో నానబెట్టిన బాదంపప్పును చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

జీడిపప్పు

జీడిపప్పులో ఫైబర్, ప్రోటీన్, మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా జీడిపప్పులో జింక్‌, మెగ్నీషియం, ఇనుము, భాస్వరం వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి.

నువ్వులు

క్యాల్షియం, ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాల్లో నువ్వులు ముఖ్యమైనది. సలాడ్లు, రొట్టెలు, మఫిన్లు వంటి వివిధ వంటకాలకు నువ్వులను జోడించి తింటే ఆరోగ్య పదిలంగా ఉంటుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలు

పొద్దుతిరుగుడు విత్తనాల్లో చాలా ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాలను తింటే గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.

పనీర్

శాకాహారులకు పనీర్ మంచి ప్రొటీన్ మూలం. మీ ఆహారంలో పనీర్‌ను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.