Kodali Nani: చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..
Kodali Nani on Megastar Chiranjeevi: కొడాలి నాని.. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక సెన్సెషన్.. ఆయన మాట్లాడితే.. ఆ రోజు మొత్తం హాట్ టాపికే.. సలహాలు అయినా.. విమర్శలు అయినా.. రాజకీయాల గురించి ఏం మాట్లాడినా ఘాటుగానే ఉంటుంది.. పొలిటికల్ పంచులతోపాటు ముందు వెనుక ఆలోచించకుండా సెన్సెషనల్ కామెంట్స్ చేయడంలో
Kodali Nani on Megastar Chiranjeevi: కొడాలి నాని.. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక సెన్సెషన్.. ఆయన మాట్లాడితే.. ఆ రోజు మొత్తం హాట్ టాపికే.. సలహాలు అయినా.. విమర్శలు అయినా.. రాజకీయాల గురించి ఏం మాట్లాడినా ఘాటుగానే ఉంటుంది.. పొలిటికల్ పంచులతోపాటు ముందు వెనుక ఆలోచించకుండా సెన్సెషనల్ కామెంట్స్ చేయడంలో, తిట్టడంలో ఆయనే ముందుంటారు. అయితే.. అలాంటి నాని ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అది కూడా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకల్లో.. ఇప్పుడు నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతోపాటు.. సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కొడాలి నాని చిరంజీవిపై ఘాటుగా స్పందించినట్లు వార్తలొచ్చాయి. అయితే.. దీనిపై క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని.. ఆ వ్యాఖ్యలను నిరూపించాలంటూ జనసేన, టీడీపీకి సవాల్ చేశారు. అసలు కొడాలి నాని ఏం మాట్లాడారు.. ఎందుకు మాట్లాడారో ఇప్పుడు చూద్దాం..
గుడివాడలో జరిగిన చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని విమర్శిస్తే రాజకీయంగా ఏం జరుగుతుందో తనకు తెలుసంటూ వ్యాఖ్యానించారు. మెగాస్టార్‌ను తానెప్పుడూ విమర్శించలేదంటూ కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. తాను శ్రీరామ అంటే టీడీపీ, జనసేనకు బూతుల్లా వినబడుతున్నాయ్ అంటూ చురకలంటించారు. ఎవరి జోలికి వెళ్లని చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడిని కానంటూ నాని వివరించారు. చిరును ఎన్నోసార్లు కలిశానని.. ఆయన సూచనలు పాటిస్తానని కొడాలి పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఓ శిఖరం, ఆయన్ని నేను ఎందుకు తిడతాను.. చిరుకి, తమకు అగాథం సృష్టించాలని టీడీపీ, జనసేన కుట్ర చేస్తున్నాయంటూ విమర్శించారు. తానేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన ఫ్యాన్స్‌కి తెలుసంటూ వివరించారు.
చిరంజీవి అంటే తనకు అపారమైన గౌరవముందని పేర్కొన్న వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని… చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడిని కాదని.. ఇది అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు. చిరంజీవిని తాను విమర్శించినట్టు నిరూపించాలని టీడీపీ, జనసేన నేతలకు ఆయన సవాల్ విసిరారు. తమకు సలహా ఇచ్చినట్టే ఫిల్మ్ ఇండస్ట్రీలో నటన, డ్యాన్స్ రాని పకోడి గాళ్లకు సలహా ఇవ్వాలని చిరంజీవిని కోరినట్టు కొడాలి నాని తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..