AP Polycet 2023 Counselling: ఏపీ పాలిసెట్-2023 కౌన్సెలింగ్ ఫలితాలు విడుదల.. ఆగస్టు 23 నుంచి తరగతులు
మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 19 నుంచి 23 వరకు ఆయా పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది. 2023-24 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ తరగతులు ఆగస్టు 23 నుంచి ప్రారంభంకానున్నాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో పాలీసెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం 29 విభాగాల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి విడతల మిగిలిపోయిన సీట్లకు రెండో విడతలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో సీట్లు కేటాయించనున్నారు..
అమరావతి, ఆగస్టు 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో మొదటి విడత పాలిసెట్-2023 కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు శుక్రవారం (ఆగస్టు 18) సీట్లు కేటాయించారు. ఏపీ పాలిసెట్ మొదటి విడత అలాట్‌మెంట్ లిస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. కాలేజీ, బ్రాంచీ వారీగా ఎంపికైన విద్యార్థుల జాబితా వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సులకు సంబంధించిన సీట్లను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.
మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 19 నుంచి 23 వరకు ఆయా పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది. 2023-24 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ తరగతులు ఆగస్టు 23 నుంచి ప్రారంభంకానున్నాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో పాలీసెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం 29 విభాగాల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి విడతల మిగిలిపోయిన సీట్లకు రెండో విడతలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో సీట్లు కేటాయించనున్నారు.
మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థుల లిస్టు కోసం క్లిక్ చేయండి.
విద్యా నిధి పథకానికి తెలంగాణ సర్కార్ దరఖాస్తుల 2023 ఆహ్వానం
విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే రాష్ట్ర విద్యార్ధులకు తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన విడుదల చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు చేసుకోవల్సిందిగా ఎస్సీ కులాల అభివృద్ధి ఉప సంచాలకులు పి యాదయ్య ప్రకటించారు. ఈ అవకాశం హైదారబాద్‌కు చెందిన షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు మాత్రమే కల్పిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.