Hyderabad Double Bedrooms: హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ షురూ.. పూర్తి వివరాలివే..

హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆన్‌లైన్‌ ద్వారా ఎంపిక చేస్తున్న లబ్దిదారులకు, వచ్చేనెల 2 నుంచి డబుల్‌బెడ్‌రూం ఇండ్లను పంపిణీ చేయనున్నారు. మొత్తం 12వేల లబ్డిదారులకు ఈ ఇండ్లను దశల వారీగా అందజేస్తారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు..

Hyderabad Double Bedrooms: హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ షురూ.. పూర్తి వివరాలివే..
TS 2BHK Housing Scheme
Follow us
Shiva Prajapati

| Edited By: Vimal Kumar

Updated on: Sep 08, 2023 | 12:09 PM

హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆన్‌లైన్‌ ద్వారా ఎంపిక చేస్తున్న లబ్దిదారులకు, వచ్చేనెల 2 నుంచి డబుల్‌బెడ్‌రూం ఇండ్లను పంపిణీ చేయనున్నారు. మొత్తం 12వేల లబ్డిదారులకు ఈ ఇండ్లను దశల వారీగా అందజేస్తారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు మంత్రి తలసాని. లబ్దిదారులను ఎంపిక చేసేందుకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు మంత్రి తలసాని.

లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే మొదటిసారిగా ఆన్‌లైన్‌ డ్రాను తీస్తున్నట్టు చెప్పారు మంత్రి. NSI రూపొందించిన ర్యాండమ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా అర్హులను ఎంపిక చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో మొదటి విడతలో 12 వేల మందికి ఇండ్లను అందజేస్తామన్నారు. మహానగరంలోని 24 నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 7500 మంది చొప్పున 60వేల మందితో జాబితాను సిద్దం చేశారు అధికారులు. డబుల్‌బెడ్‌రూం కోసం లక్షల్లో అప్లై చేసుకున్నారు పేదలు. లక్షా 160వేల మంది దరఖాస్తు చేసుకోగా, 80వేల మంది చిరునామాలకు వెళ్లిన వారి స్థితిగతులను పరిశీలించారు అధికారులు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్వీట్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..