Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్‌పై యూకే న్యూస్ యాంకర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన నెటీజన్లు

చంద్రయాన్ - 3 విజయవంతం కావడం వల్ల భారత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు అసాధ్యామనుకున్న ఈ చంద్రయాను సుసాధ్యం చేసినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలపై అన్ని దేశాలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కొందమంది బ్రిటన్ జర్నలిస్టులు భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. చందమామ దక్షిణ ధ్రువంపైకి రాకెట్లను పంపించేలా అంతరిక్ష రంగంలో పురోగతి సాధించినటువంటి రాష్ట్రాలకు బ్రిటన్ ఆర్థికంగా సాయం చేయాల్సిన అవసరం లేదంటూ ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్‌పై యూకే న్యూస్ యాంకర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన నెటీజన్లు
Uk News Anchor
Follow us
Aravind B

| Edited By: Vimal Kumar

Updated on: Sep 05, 2023 | 3:59 PM

చంద్రయాన్ – 3 విజయవంతం కావడం వల్ల భారత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు అసాధ్యామనుకున్న ఈ చంద్రయాను సుసాధ్యం చేసినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలపై అన్ని దేశాలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కొందమంది బ్రిటన్ జర్నలిస్టులు భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. చందమామ దక్షిణ ధ్రువంపైకి రాకెట్లను పంపించేలా అంతరిక్ష రంగంలో పురోగతి సాధించినటువంటి రాష్ట్రాలకు బ్రిటన్ ఆర్థికంగా సాయం చేయాల్సిన అవసరం లేదు అని ఆ దేశానికి చెందిన సోఫీ అనే జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అలాగే దీనిపై జీబీ న్యూస్‌కు చెందిన మరో మీడియా ప్రజెంటర్ కూడా స్పందించారు. నిబంధనల ప్రకారం చంద్రుని అవతలివైపుకు రాకెట్లను ప్రయోగించే మీరు.. విదేశీ సాయం కోసం మావద్దకు రావద్దు అంటూ రాసుకొచ్చారు.

అంతేకాదు.. తమ బ్రిటన్ దేశం ఇచ్చినటువంటి 2.3 బిలియన్ పౌండ్లను కూడా మాకు తిరిగిచ్చేయాలని అంటూ వ్యాఖ్యానించారు. దీనివల్ల ఈ జర్నలిస్టులపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు శతాబ్దాల పాటు భారతదేశాన్ని పాలించి.. తమ నుంచి దోచుకున్న యూకే మొత్తం 45 ట్రిలియన్ డాలర్లు తిరిగి ఇచ్చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇవి వైరలైపోయాయి. ఇప్పుడు 45 మిలియన్లు అనే పదం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ 45 ట్రిలియన్లను భారత్ నుంటి యూకే దోచుకెళ్లిందనేది ఎలా తెలిసిందనే దానికి కూడా ఓ కారణం ఉంది. భారత్‌కు చెందినటువంటి ప్రముఖ ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ ఇటీవల కొలంబియా యూనివర్సిటీ ప్రెస్‌లో ఓ అధ్యయనాన్ని ప్రచూరించారు.

ఇవి కూడా చదవండి

అయితే ఇందులో 1765 నుంచి 1938 వరకు బ్రిటన్.. భారత్ నుంచి 45 ట్రిలియన్ డాలర్లు తీసుకెళ్లిందని పట్నాయక్ అన్నారు. పన్నులు, వాణిజ్యంపై అందుబాటులో ఉన్నటువంటి డేటాను అధ్యయనం చేసి ఆమె ఈ లెక్క చెప్పారు. ఆ మొత్తం కూడా ప్రస్తుతం యూకే జీడీపీ కంటే 15 రేట్లు ఎక్కువ. మరోవైపు చూసుకుంటే అంతరిక్ష ప్రయోగాలకు యూకే నుంచి ఆర్థిక సాయాన్ని భారత్ 2015లోనే నిలిపివేసిందని.. ఈ ఏడాది మార్చిలో గార్డియన్ ఓ కథనం వెలువరించింది అయితే ఆ తర్వాత ఇండిపెండెంట్ కమిషనర్ ఫర్ ఎయిడ్ ఇంపాక్ట్ సమీక్ష చేపట్టారు. 2016 నుంచి 20121 వరకు యూకే.. ఇండియాకు 2.3 బిలియన్ పౌండ్లు సాయంగా అందించామని ప్రకటించింది. అయితే దీన్ని ఉద్దేశిస్తూనే యూకే జర్నలిస్టులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అలాగే ఇండియన్స్ కూడా దీనిపై తీవ్రంగా స్పందిస్తూ వారికి సమాధానం ఇస్తున్నారు. ఇదిలో ఉండగా చంద్రుని దక్షిణ ధ్రవంపై ల్యాండర్ అడుగుపెట్టడంతో ప్రస్తుతం రోవర్ చంద్రునిపై తిరుగుతున్నట్లు  ఇస్రో శాస్త్రవేత్తల తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..