Lady Jawan: గుండెల్ని పిడేసిన దృశ్యం.. బిడ్డను వదిలి దేశ సేవకు మహిళా జవాన్..
దేశ రక్షణ కోసం సైన్యంలో చేరడమంటే కుటుంబంతో పాటు అన్నింటినీ త్యాగం చేయాల్సిందే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. అవసరమైతే తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి దేశాన్ని కాపాడుతుంటారు సైనికులు.
దేశ రక్షణ కోసం సైన్యంలో చేరడమంటే కుటుంబంతో పాటు అన్నింటినీ త్యాగం చేయాల్సిందే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. అవసరమైతే తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి దేశాన్ని కాపాడుతుంటారు సైనికులు. అటువంటి ఓ సైనికురాలు తన పది నెలల కుమార్తె, భర్తను వదిలి బోర్డర్‌లో విధులకు బయలుదేరారు. కుటుంబాన్ని వదిలి వెళ్తూ రైలెక్కిన ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అయినా సరే, మాతృత్వ వేదనను పంటి కింద అదిమిపట్టి దేశమాత సేవ కోసం ఆ సైనికురాలు రైలెక్కారు. ఆ సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కర్వీర్ తాలూకా నంద్‌గావ్‌కు చెందిన వర్షా రాణి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవానుగా పనిచేస్తున్నారు. పది నెలల కిందటే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చారు. మెటర్నిటీ సెలవులు పూర్తి కావడంతో తన 10 నెలల పాపను వదిలిపెట్టి సరిహద్దుల్లో విధులకు బయలుదేరారు. ఈ క్రమంలో వర్షా రాణిని రైలెక్కించడానికి భర్త, కుమార్తె సహా కుటుంబసభ్యులు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. తన బిడ్డను వారి చేతుల్లో పెట్టి రైలెక్కుతూ ఆమె కన్నీరు ఆపుకోలేకపోయారు. ఆమెకు వీడ్కోలు చెబుతూ కుటుంబసభ్యులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. ఉద్వేగంతో ఆమె తన భర్తను కౌగిలించుకుని కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాన్ని అక్కడవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. వర్షా రాణి పాటిల్.. గుండెను దిటువు చేసుకుని బిడ్డను అప్పగించి రైలెక్కింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా ఉద్వేగానికి గురవుతున్నారు. పొత్తిళ్లలో బిడ్డను వదిలి కర్తవ్య నిర్వహణకు బయలుదేరిన ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.
Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..
Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..