Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.
సాధారణంగా ఆరోగ్యానికి, వాహన ప్రమాదాలకు ఇన్సూరెన్స్ చేయించడాన్ని మనం చూస్తుంటాం. కాని ప్రేమ విఫలమైనందుకు బీమా డబ్బులు పొందిన ఉదంతాన్ని ఎప్పుడైనా విన్నారా.. ప్రేయసి తనను మోసం చేసినందుకు హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్..
సాధారణంగా ఆరోగ్యానికి, వాహన ప్రమాదాలకు ఇన్సూరెన్స్ చేయించడాన్ని మనం చూస్తుంటాం. కాని ప్రేమ విఫలమైనందుకు బీమా డబ్బులు పొందిన ఉదంతాన్ని ఎప్పుడైనా విన్నారా.. ప్రేయసి తనను మోసం చేసినందుకు హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ కింద తనకు 25,000 రూపాయలు బీమా సొమ్ము అందినట్లు ప్రతీక్ ఆర్యన్ అనే భగ్నప్రేమికుడు ట్వీట్ చేశాడు. తాను, తన ప్రేయసి కలసి బ్యాంకులో జాయింట్ అకౌంట్ తెరిచామని, అందులో ప్రతినెల చెరో 500 రూపాయలు వేయడం ప్రారంభించామని ప్రతీక్ రాసుకొచ్చాడు. ఇందులో భాగంగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నామని, ఇద్దరిలో ఎవరైనా ప్రేమబంధాన్ని తెంచేసి వెళ్లిపోతే మోసపోయిన వ్యక్తికి బీమా సొమ్ము వచ్చే విధంగా తాము ఒప్పందం కూడా చేసుకున్నామని అతను తెలిపాడు. తన ప్రేయసి తనను మోసం చేసి వెళ్లిపోవడంతో హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ కింద రూ. 25,000 తనకు దక్కింందని అతను ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే 8 లక్షల మందికి పైగా దీన్ని వీక్షించడమేగాక ప్రతీక్‌ను అభినందిస్తూ కామెంట్లు కూడా పోస్ట్ చేశారు. తాము కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటామని పలువురు నెటిజన్లు సంసిద్ధతను వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్. వీడియో