Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..

Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..

Anil kumar poka

|

Updated on: Mar 27, 2023 | 9:17 AM

మీరు తీర్ధ యాత్రలు చేయాలనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్‌ న్యూస్‌.. మీకోసమే ఇండియన్‌ రైల్వే ప్రత్యేకమైన రైలును అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక సదుపాయాలతో..

మీరు తీర్ధ యాత్రలు చేయాలనుకుంటున్నారా… అయితే మీకో గుడ్‌ న్యూస్‌.. మీకోసమే ఇండియన్‌ రైల్వే ప్రత్యేకమైన రైలును అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ రైలు తెలుగురాష్ట్రాల్లో ప్రారంభమైంది. తెలంగాణ సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి మొట్టమొదటి టూరిస్టు రైలు ప్రారంభమైంది. భారత్‌ గౌరవ్‌ రైలును ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఇందులో యాత్ర ఆరంభంనుంచి పూర్తయ్యేవరకూ యాత్రికులకు అన్ని రకాల సేవలను ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. ఇందులో అన్ని రకాల ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తుంది. వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు కల్పిస్తోంది. ఉదయం టీ, అల్పాహారం , మద్యాహ్న భోజనం, రాత్రి భోజనం రైలు ప్రయాణంలోనూ, రోడ్డు ప్రయాణంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రొఫెషనల్ అనుభవం కలిగిన వారితో అందరికీ నచ్చేలా స్నేహ పూర్వక సేవలు, రైలులో ప్రయాణికుల భద్రత, అన్ని కోచ్‌లలో పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సౌకర్యం, ప్రయాణ బీమా, ప్రయాణ సమయంలో యాత్రికులకు కావాల్సిన సహాయం కోసం ఐఆర్‌సీటీసీకి చెందిన పర్యాటక మేనేజర్‌‌ల సమక్షంలో సిబ్బంది యాత్రికులకు సేవలందిస్తారు. ఇక ఈ ‘తెలుగు రాష్ట్రాల భారత్ గౌరవ్’, ‘పుణ్య క్షేత్ర యాత్ర.. పూరీ , కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లోని ముఖ్యమైన, చారిత్రక ప్రదేశాలను 8 రాత్రులు, 9 పగలు వ్యవధిలో సందర్శిస్తుంది. ఈ ట్రైన్ తొలి ప్రయాణంలో తాము కూడా భాగం కావాలనే ఉద్దేశ్యంతో తెలుగు రాష్ట్రాల నుంచి యాత్రికులు పెద్ద సంఖ్యంలో ముందుకు వచ్చారు. ఈ రైలులో ప్రయాణించేందుకు అందుబాటులో ఉన్న మొత్తం 700 సీట్లను యాత్రికులు పూర్తిగా బుక్ చేసుకున్నారు .

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్‌. వీడియో

Published on: Mar 27, 2023 09:17 AM