ISRO LVM3: భారతదేశపు అతిపెద్ద రాకెట్.. ఇస్రో LVM3 రాకెట్ లాంచ్..(లైవ్)

ISRO LVM3: భారతదేశపు అతిపెద్ద రాకెట్.. ఇస్రో LVM3 రాకెట్ లాంచ్..(లైవ్)

Anil kumar poka

|

Updated on: Mar 27, 2023 | 5:09 PM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్రలో మరో రైలు రాయి. వన్‌ వెబ్‌కు చెందిన 36 ఉప గ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యారు ఇస్రో శాస్త్రవేత్తలు. అంతరిక్ష ఆధారిత

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్రలో మరో రైలు రాయి. వన్‌ వెబ్‌కు చెందిన 36 ఉప గ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యారు ఇస్రో శాస్త్రవేత్తలు. అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్‌ను ప్రపంచం మొత్తానికి అందించే శాటిలైట్స్‌ను ఇస్రో అంతరిక్షంలోకి పంపిస్తోంది. శ్రీహరికోటలోని షార్‌ సెంటర్‌ నుంచి 36 ఉపగ్రహాలతో కూడిన సముదాయాన్ని ప్రత్యేకంగా రూపొందించిన లాంచ్‌ వెహికల్‌ మార్క్‌ త్రీ భూకక్ష్యలోకి ప్రవేశపెడుతోంది.ఒక్కొటి 150 కిలోగ్రాముల బరువు ఉండే ఉపగ్రహాలను 12 విమానాల్లో నిక్షిప్తం చేశారు. అంతరిక్షంలోని వెళ్లిన తర్వాత ప్రతీ నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఈ విమానాలు విడిపోయి ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చుతాయి. భూమికి 1200 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఉపగ్రహాలు పనిచేస్తాయి. ఈ ప్రయోగం కోసం ఉపయోగించే లాంచ్‌ వెహికల్‌ పేరును GSLV జియోసింక్రనస్‌ లాంచ్‌ వెహికిల్‌ మార్క్‌ త్రీని లాంచ్‌ వెహికల్‌ మార్క్‌ త్రీగా మార్చారు. ఈ ప్రయోగాన్ని 19.7 నిమిషాల్లో పూర్తి చేసి 36 ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా నిర్దేశించిన సమయంలో నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్‌. వీడియో

Published on: Mar 26, 2023 08:59 AM