Emergency Alert Message: మీకు ఫోన్‌కు ఈ ఫ్లాష్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఒకే..!
దేశవ్యాప్తంగా కొంతమంది మొబైల్ యూజర్లకు ఓ ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది. తీవ్ర అత్యవసర పరిస్థితి అన్న అర్థంతో ఆ ఫ్లాష్ మెసేజ్ ఉంది. దీంతో అది ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎందుకు వచ్చిందో తెలియక వారంతా గందరగోళానికి గురయ్యారు. అయితే, దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపిందట. కానీ, అందులో భయపడాల్సేందేమీ లేదు. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లో భాగంగా ఈ మెసేజ్ వచ్చినట్లు తెలిసింది.
దేశవ్యాప్తంగా కొంతమంది మొబైల్ యూజర్లకు ఓ ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది. తీవ్ర అత్యవసర పరిస్థితి అన్న అర్థంతో ఆ ఫ్లాష్ మెసేజ్ ఉంది. దీంతో అది ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎందుకు వచ్చిందో తెలియక వారంతా గందరగోళానికి గురయ్యారు. అయితే, దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపిందట. కానీ, అందులో భయపడాల్సేందేమీ లేదు. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లో భాగంగా ఈ మెసేజ్ వచ్చినట్లు తెలిసింది. భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదల్లాంటి విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి కేంద్రం ఈ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను రూపొందించింది. ఈ క్రమంలోనే తాజాగా దీన్ని పరీక్షించింది. దీంతో దేశవ్యాప్తంగా కొంతమంది స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పెద్ద సౌండ్‌తో ఈ ఫ్లాష్ మెసేజ్ వచ్చింది. ‘Emergency alert Severe’ పేరుతో వచ్చిన ఈ మెసేజ్‌లో.. ‘టెలికమ్యూనికేషన్ విభాగానికి చెందిన సెల్ బ్రాడ్‌కాస్టింగ్ పంపించిన నమూనా టెస్టింగ్ మెసేజ్ ఇది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజా భద్రతను మరింత మెరుగుపరుస్తుంది’’ అని రాసి ఉంది. తమ ఫోన్లను వచ్చిన ఈ ఫ్లాష్ మెసేజ్‌ను కొంతమంది యూజర్లు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...