Chandrayaan-3 Landing LIVE: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం.. భారత్ సంచలనం..

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Aug 23, 2023 | 10:03 PM

చందమామను ఎయిమ్‌ చేయాలన్న ఇస్రో టార్గెట్ ఇప్పటిది కాదు. దాదాపు రెండు దశాబ్దాల కిందటిది. గతంలో రెండు దశలుగా జరిగిన ప్రయత్నం సంపూర్ణంగా సఫలం కాకపోవడంతో... ఇప్పుడు చేసిన థర్డ్‌ ఎటెంప్టే చంద్రయాన్‌3. ఇది వందకోట్లకు పైగా భారతీయుల ఆశాకిరణం మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలన్నిటినీ మన వైపు తిప్పుకుంటున్న కీలక ఘట్టం. లాంచింగ్ నుంచి సాఫ్ట్‌ ల్యాండింగ్ దాకా… అసలీ జర్నీ ఎలా జరిగింది.. చూద్దాం.

చందమామను ఎయిమ్‌ చేయాలన్న ఇస్రో టార్గెట్ ఇప్పటిది కాదు. దాదాపు రెండు దశాబ్దాల కిందటిది. గతంలో రెండు దశలుగా జరిగిన ప్రయత్నం సంపూర్ణంగా సఫలం కాకపోవడంతో… ఇప్పుడు చేసిన థర్డ్‌ ఎటెంప్టే చంద్రయాన్‌3. ఇది వందకోట్లకు పైగా భారతీయుల ఆశాకిరణం మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలన్నిటినీ మన వైపు తిప్పుకుంటున్న కీలక ఘట్టం. లాంచింగ్ నుంచి సాఫ్ట్‌ ల్యాండింగ్ దాకా… అసలీ జర్నీ ఎలా జరిగింది.. చూద్దాం.చంద్రయాన్‌3… చరిత్రాత్మక ఘట్టానికి అంకురార్పణ జరిగిన రోజు జూలై 14. 348 టన్నుల ఫ్యూయల్‌ని బర్న్ చేస్తూ 40 రోజుల పాటు రేడియేషన్ దాడులను తట్టుకుని… స్పేస్‌లో 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ఎంట్రీ ఇచ్చి మొదటి దశను దాటేసింది చంద్రయాన్3. ఆ తర్వాత వరుసగా ఆగస్టు 6, 9, 14, 16వ తేదీల్లో కక్ష్య తగ్గింపు ప్రక్రియల్ని పూర్తి చేసి… చంద్రుడి ఉపరితలానికి జస్ట్‌… 100 కిలోమీటర్ల ఎగువకు చేరింది చంద్రయాన్.చంద్రయాన్‌-3 జర్నీలో మరో కీలక ఘట్టం… ప్రొపెల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ డిటాచ్ కావడం. తర్వాత ఆరు రోజుల పాటు చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టింది.చంద్రయాన్3 రోవర్ చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్ అయ్యే కీలకఘట్టం. వంద కిలోమీటర్ల అల్టిట్యూడ్‌ నుంచి చంద్రుడిపై ల్యాండింగ్ అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ని సేఫ్‌గా కంప్లీట్ చేయాలన్న ఇస్రో సంకల్పం మరికాస్సేపట్లో నెరవేరబోతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Aug 23, 2023 05:16 PM