Viral Video: అర్ధరాత్రి నడిరోడ్డుమీద అమ్మాయిలు రచ్చ రచ్చ.. ఓ బాలికను జుట్టుపట్టుకుని లాగి మరీ కర్రలతో కొడుతున్న యువతలు..

కొంతమంది  అమ్మాయిలు కలిసి ఒక యువతిని రోడ్డుమీద పడేసి మరీ కొడుతున్నారు. ఆ యువతి జుట్టును ఒకరు లాగుతూ..  నేలమీదకు తోసి మరీ కర్రతో కొడుతున్నారు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించాడు.

Viral Video: అర్ధరాత్రి నడిరోడ్డుమీద అమ్మాయిలు రచ్చ రచ్చ.. ఓ బాలికను జుట్టుపట్టుకుని లాగి మరీ కర్రలతో కొడుతున్న యువతలు..
Girls Fight Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 26, 2022 | 8:09 PM

నేటి తరం అమ్మాయిలు.. తాము అన్నింటా పురుషులతో సమానమే అంటున్నారు. అంతేకాదు.. కొంతమంది అమ్మాయిలు నడి రోడ్డుమీద కొట్టుకోవడంలో కూడా ఏమీ తక్కువ కాదంటూ గత కొంతకాలంగా నిరూపిస్తూనే ఉన్నారు.. పగలు రాత్రి అనే తేడా లేకుండా తమ తోటి అమ్మాయిలను కొడుతూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో దర్శనం ఇచ్చింది. కొంతమంది అమ్మాయిల మధ్య జరిగిన నాటకీయ పోరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. కొంతమంది  అమ్మాయిలు కలిసి ఒక యువతిని రోడ్డుమీద పడేసి మరీ కొడుతున్నారు. ఆ యువతి జుట్టును ఒకరు లాగుతూ..  నేలమీదకు తోసి మరీ కర్రతో కొడుతున్నారు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించాడు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ లోని రూర్కీలోని ఒక హోటల్ పక్కన ఉన్న పార్కింగ్ ప్రాంగణంలో చోటు చేసుకుంది. వీరందరూ  పాఠశాలకు వెళ్లే బాలికలే అని తెలుస్తోంది.

ఆదివారం ఉదయం ట్విటర్‌లో ఈ వీడియో షేర్ చేయగా.. ప్రస్తుతం ఓ రేంజ్ లో వైరల్‌ అయింది. అయితే.. ఈ ఘటన జరిగిన ఖచ్చితమైన తేదీ తెలియదు. అంతేకాదు ఈ వీడియో సోషల్ మీడియా ద్వారా పోలీసుల దృష్టికి చేరుకుంటూనే గానీ ఈ సంఘటన గురించి పోలీసులకు తెలియలేదు. పోలీసుల బృందం సంబంధిత ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోంది. బాలికలను .. పోరాట వివరాలను గుర్తించే పనిలో ఉంది.

ఇవి కూడా చదవండి

కొంతమంది బాలికలు కలిసి.. ఓ బాలికను నేలపైకి నెట్టడం..  కర్రతో పదే పదే కొట్టడం వీడియోలో ఉంది. బాలిక లేచి నిలబడి ఎదురుదాడికి ప్రయత్నించింది. తనపై పడిన ఓ బాలిక జుట్టుని పట్టుకుని లాగడం కూడా కనిపించింది. అనంతరం ఆ ఇద్దరు బాలికలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని లాగుతున్నారు. అప్పుడు చుట్టు పక్కల వారు గుంపుగా అమ్మాయిల గొడవను చూడడానికి చేరుకున్నారు. ఎవరూ ఈ బాలికలను విడదీయానికి ప్రయత్నించనట్లు తెలుస్తోంది.

అయితే రికార్డ్ అయిన వీడియోలో మీరు చిన్న పిల్లలు.. చదువుకునే బాలికలు..  గొడవను ఆపండి.. అని ఒక వ్యక్తి వీడియోలో చెప్పడం వినవచ్చు. అతను జోక్యం చేసుకుని ఇక ఈ కొట్లాటను ఆపమని కోరాడు. అనంతరం చాలా మంది వ్యక్తులు అమ్మాయిల గుంపు వైపు వెళ్లడం చూడవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..