Vidieo Viral: రిటైర్ కావడానికి ముందు తన తల్లికి సెల్యూట్ చేసిన భారత ఆర్మీ ఆఫీసర్..నెట్టింట్లో వీడియో వైరల్..

తల్లి కొడుకుల బంధం గురించి అది మాటల్లో చెప్పలేనిది. ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓ వీడియో. రిటైర్ కావడానికి ముందు భారత ఆర్మీ అధికారి తన తల్లికి సెల్యూట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Vidieo Viral: రిటైర్ కావడానికి ముందు తన తల్లికి సెల్యూట్ చేసిన భారత ఆర్మీ ఆఫీసర్..నెట్టింట్లో వీడియో వైరల్..
Army Officer Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Dec 25, 2022 | 12:24 PM

జన్మ భూమి, కన్న తల్లి స్వర్గ సమమని అన్నారు పెద్దలు. ఆర్మీలో అడుగు పెట్టి.. తన ప్రాణాలు ఫణంగా పెట్టి.. దేశ మాత రక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన ఓ ఆర్మీ ఆఫీసార్ ఉద్యోగంలో పదవి విరమణ చేసే సమయం వచ్చింది. అప్పుడు.. తన తల్లికి సైనిక వందనం చేసి.. ఆశీర్వాదం తీసుకున్నారు. అవును చిన్న తనంలో నుంచి తన జీవితంలో ఏ ముఖ్యమైన సంఘటన జరిగినా తల్లి ఉండాలని కోరుకుంటారు.. స్కూల్ ఈవెంట్‌లో ఏ చిన్న విజయం సాధించినా.. లేదా జీవితంలోని ప్రధాన సంఘటన అయినా మనిషి జీవితంలోని ప్రతి ల్యాండ్‌మార్క్ లోనూఓ తన పక్కన తల్లి ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే తల్లి కొడుకుల బంధం అలాంటిది మరి. వీరి బంధం గురించి అది మాటల్లో చెప్పలేనిది. ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓ వీడియో. రిటైర్ కావడానికి ముందు భారత ఆర్మీ అధికారి తన తల్లికి సెల్యూట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇది చూపరుల మనసుని కూడా కన్నీరు పెట్టించేలా చేస్తుంది. ఈ వీడియో క్లిప్‌ను మేజర్ జనరల్ రంజన్ మహాజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ఆర్మీ అధికారి మేజర్ జనరల్ రంజన్ మహాజన్ తన తల్లిని చూసేందుకు తన ఇంట్లోకి ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది.  ఆర్మీ యూనిఫారంలో జవాన్ లా నడుస్తూ..  సోఫాలో కూర్చున్న తన అమ్మ దగ్గరికి వెళ్లారు. తన దగ్గరకు వస్తున్న కొడుకుని చూసి తల్లి చాలా సంతోషించింది. సోఫా దగ్గరికివెళ్లి.. తల్లికి పాదాభివందనం చేశారు ఆఫీసార్. అప్పుడు తల్లి ప్రేమగా కొడుకు కౌగిలించుకుంది. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ సన్నివేశం హృదయపూర్వకంగా ఉంది. తల్లికి ముద్దుపెట్టిన ఆర్మీ ఆఫీసర్ అనంతరం ఒక పూల దండను వేసి తన తల్లిని గౌరవించారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Smiley (@iranjanmahajan)

హృదయానికి హత్తుకుంటున్న ఈ వీడియో క్లిప్ షేర్ చేయబడినప్పటి నుండి.. దాదాపు 43,000 లైక్స్ సొంతం చేసుకుంది. ఈ క్లిప్ చూసి చాలామంది భావోద్వేగానికి గురయ్యారు.

“ఎంత అందమైన జీవితం మీది అంకుల్! మీ రెండవ ఇన్నింగ్స్‌కు శుభాకాంక్షలు” అని ఒకరు.. మిమ్మల్ని మొదటిసారిగా పరిచయం చేసింది అమ్మ.. మీ ఉద్యోగంలో చివరి సెల్యూట్ కూడా అమ్మకే.. మీరు అదృష్టవంతులు సార్.. మీ విలువైన సేవలకు థాంక్స్ సార్.. !! సెల్యూట్!! హ్యాపీ రిటైర్మెంట్! ఆనందించండి! అంటూ మరొకరు.. “ఎంత ఎమోషనల్!! నేను ఏడుస్తున్నానని ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మన భారత ఆర్మీ అంటే ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నారు. తల్లి కొడుకుల ప్రేమకి కంట తడి పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..