Viral Video: పెట్రోల్, డబ్బులు ఆదా, ఎక్సర్సైజ్ కి ఎక్సర్సైజ్.. నీ ఐడియా అదుర్స్ గురూ

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌కు యువతలో ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ బుల్లెట్‌ పట్ల అన్ని వయసుల వారిలోనూ క్రేజ్ ఉంది. అయితే దీని ధర, బైక్ ప్రియులు కొనుగోలు చేసే విషయంలో చేతులు కట్టేస్తోంది.

Viral Video: పెట్రోల్, డబ్బులు ఆదా, ఎక్సర్సైజ్ కి ఎక్సర్సైజ్.. నీ ఐడియా అదుర్స్ గురూ
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 23, 2022 | 4:33 PM

భారతీయుల ప్రతిభకు కొలమానం లేదు. జుగాడ్ లు తయారు చేయడంలో అందెవేసిన చేయి అని చెప్పవచ్చు. రకరకాల జుగాడ్ లను తయారు చేసి.. ప్రజల మన్నలను పొందుతున్నారు. అంతేకాదు ‘ దేశీ జుగాడ్ ‘ లతో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నారు కూడా.. ప్రస్తుతం, సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో ప్రజల దృష్టిని ఆకర్షించింది. ‘జుగాడ్ టెక్నాలజీ’ని ఉపయోగించి తయారు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఈ వీడియోను ప్రజలు.. తమ బంధువులు, స్నేహితులకు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ఈ జుగాడ్ వీడియోలో ఏముందంటే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌కు యువతలో ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ బుల్లెట్‌ పట్ల అన్ని వయసుల వారిలోనూ క్రేజ్ ఉంది. అయితే దీని ధర, బైక్ ప్రియులు కొనుగోలు చేసే విషయంలో చేతులు కట్టేస్తోంది. అయితే మనలో ప్రతిభ ఉంటే అభిరుచిని, ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా ఎవరూ ఆపలేరు.. అందుకు సాక్ష్యంగా ఇప్పుడు ఓ అబ్బాయి సైకిల్‌ను బుల్లెట్ బైక్‌గా మార్చిన ఈ క్లిప్ పై లుక్ వేయండి..

ఇవి కూడా చదవండి

సైకిల్ బుల్లెట్ ఎలా మారిందో చూడండి

View this post on Instagram

A post shared by Prince Raj (@prince_raj9927)

ఓ యువకుడు తన సైకిల్‌ను బుల్లెట్ బైక్‌గా మార్చి  చక్కర్లు కొడుతున్నాడు. ఈ వీడియో చూస్తుంటే  యువకుడు బుల్లెట్ బైక్ నడుపుతున్నట్లు అనిపించినా అతను దగ్గరికి వచ్చేసరికి అసలు విషయం తెలుస్తుంది. ఎందుకంటే అది బుల్లెట్ లా కనిపించేలా సైకిల్ అని తెలిసేది. ఆ యువకుడు రోడ్డుపై బుల్లెట్ సైకిల్ ను నడుపుతున్నప్పుడు.. ప్రజలు దానిని చూసి ఆశ్చర్యపోయారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొందరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో కనిపించిన వెంటనే వైరల్‌గా మారింది.

ఈ వీడియోను Prince_raj9927 అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేసారు. 9 లక్షల మందికి పైగా దీన్ని లైక్ చేసారు. ఆ యువకుడి ప్రతిభ అద్భుతం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు సోదరా.. నీ తెలివి తేటలకు ఎన్ని బహుమతులు ఇచ్చినా తక్కువే అంటూ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..