Mysterious Fish: వామ్మో ఇదేం చేప.. దంతాలతో స్కూబా డ్రైవర్ పట్టి పీకేసింది.. షాకింగ్ వీడియో వైరల్

స్తవానికి ట్రిగ్గర్ ఫిష్ పేరుకు తగినట్లు చాలా దుడుకు స్వభావం కలిగి ఉంటాయి. తమ గుడ్లను, గూళ్లను కాపాడుకునే విషయంలో ప్రత్యేక రక్షణ తీసుకుంటాయి. అవసరం అయితే తమ పళ్లనే ఆయుధంగా చేసుకుని శత్రువుల మీద దాడి చేస్తాయని అలెక్స్ చెప్పారు.

Mysterious Fish: వామ్మో ఇదేం చేప.. దంతాలతో స్కూబా డ్రైవర్ పట్టి పీకేసింది.. షాకింగ్ వీడియో వైరల్
Fish With Human Teeth
Follow us
Surya Kala

|

Updated on: Dec 25, 2022 | 1:28 PM

ప్రకృతిలో అనేక వింతలు విశేషాలున్నాయి.. భూమి మీద మాత్రమే కాదు.. సముద్ర గర్భం కూడా అనేక వింతలను తనలో దాచుకుంది.  వింత జీవులు, అరుదైన మొక్కలు, రత్నాలు, రాళ్లకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా సముద్రపు లోతుల్లో మనుషులు ఇంతకు ముందెన్నడూ చూడని వింతలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వాస్తావం చెప్పాలంటే.. మీరు వివిధ రకాల చేపలను చూసి ఉంటారు. అయితే మీరెప్పుడైనా మనుషుల్లా దంతలున్న చేపలను ఎప్పుడైనా చూశారా.. ఇలాంటి వింత చేప ఒకటి నైలు నది వార ప్రసాదం ఈజిప్ట్ తీరంలో మళ్ళీ కనిపించింది. సముద్రంలోకి అందంగా డైవ్‌ను ఆస్వాదిస్తున్న ఒక స్కూబా డైవర్‌ని ఒక చేప వెంబడించి మరీ దాడి చేసింది. అంతేకాదు ఆ చేపకు మనిషికి ఉన్నట్లు బలమైన దంతాలు ఉన్నాయి.. అవి ముందుకు పొడుచుకు వచ్చి భయంకరంగా కనిపిస్తోంది ఆ సముద్ర జీవి.. ఆ డైవర్ ని వెంబడించి కాలు ని గట్టిగా పట్టుకుని కరిచింది. దీంతో అతను తీవ్ర బాధను అనుభవించాడు.

USA లోని అలబామాకు చెందిన అలెక్స్ పికుల్ ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్ షేక్ తీరంలో స్కూబా డైవింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో “మానవ దంతాలు ఉన్నట్లు కనిపించే ఒక ట్రిగ్గర్ ఫిష్ అతనిపై తీవ్ర దాడి చేసింది.

బోటిక్ స్కూబా డైవింగ్ సంస్థ మార్ హోస్ట్డ్ ట్రిప్స్ యజమాని మైరా నేతృత్వంలో ఎనిమిది మంది డైవర్ల బృందం ఈ తీరంలో సందడి చేస్తోంది.  ఈ బృందంలో అలెక్స్  కూడా ఒకడు. అయితే అనుకోకుండా.. ఈ 8మంది బృందం ట్రిగ్గర్ ఫిష్ గుడ్లు ఉన్న ప్లేస్ నుంచి ఈదుకుంటూ వెళ్లారు.. దీంతో తన సంతానాన్ని రక్షించుకునేందుకు  మగ ట్రిగ్గర్ ఫిష్ ఈ బృందంపై దాడిని ప్రారంభించింది. వారిని వెంబడించడం ప్రారంభించింది. అప్పుడు అలెక్స్ కాలు దోరకండంతో అకస్మాత్తుగా అతని కాలుని పట్టుకుని గట్టిగా కరిచింది.

ఇవి కూడా చదవండి

అప్పుడు నేను పడ్డ బాధ చెప్పనలవి కానిది అని అంటున్నాడు అలెక్స్,. అంతేకాదు చర్మం చిట్లిపోయింది.. రక్తస్రావం అవుతుందని భావించి నేను సముద్రం నుంచి అరవడం ప్రారంభించినట్లు వెల్లడించాడు. వాస్తవానికి ట్రిగ్గర్ ఫిష్ పేరుకు తగినట్లు చాలా దుడుకు స్వభావం కలిగి ఉంటాయి. తమ గుడ్లను, గూళ్లను కాపాడుకునే విషయంలో ప్రత్యేక రక్షణ తీసుకుంటాయి. అవసరం అయితే తమ పళ్లనే ఆయుధంగా చేసుకుని శత్రువుల మీద దాడి చేస్తాయని అలెక్స్ చెప్పారు.

ఈ ట్రిగ్గర్ ఫిష్ తన బలమైన దంతాలతో పీతలు, సముద్రపు అర్చిన్‌లతో సహా వివిధ రకాల చేపలపై దాడి చేసి.. ఆహారాన్ని సంపాదించుకుంటుంది. తాను ఇంతకు ముందుకూడా ఈ ట్రిగ్గర్ ఫిష్‌ని చూశానని .. అయితే వాటి దంతాలు ఎలా ఉంటాయో.. ఇప్పటి వరకూ ఇంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదని చెప్పాడు అలెక్స్.  ఈ ట్రిగ్గర్ ఫిష్ తరచుగా తీరప్రాంత ఆవాసాలలో కనిపిస్తుంది.  2020 లో మలేషియాలో ఒక జాలరి ఈ చేపను మొదటి సారి చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..