Telangana Crime: ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. పురుగుల మందుతాగి ఆత్మహత్య..

ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధింపులు తాళలేక యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం (మార్చి 20) హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో మృతి..

Telangana Crime: ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. పురుగుల మందుతాగి ఆత్మహత్య..
Telangana Crime News
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 20, 2023 | 6:59 PM

ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధింపులు తాళలేక యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం (మార్చి 20) హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన ఎంబడి రాజలింగం, రాజమణి దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె సంతానం. కుమార్తె సాయిష్మాను అదే గ్రామానికి చెందిన నలిమేల వినయ్ కుమార్ ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవాలని గత కొంతకాలంగా పదేపదే వేధింపులకు గురి చేయసాగాడు. ఐతే తనకు అప్పటికే వేరొక వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయిందని తనను వేధించవద్దని సాయిష్మా పలుమార్లు చెప్పింది. అయినా తన పద్ధతి మార్చుకోని వినయ్ తనను ప్రేమించకపోయినా.. పెళ్లి చేసుకోకపోయినా తన సంగతి చూస్తానంటూ మార్చి 18వ తేదీ బెదిరించాడు. ఈ క్రమంలో వినయ్‌ వేధింపులు తట్టుకోలేక మనస్థాపానికి గురై సాయిష్మా అదే రోజు సాయంత్రం 4 గంటలకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

వెంటనే కుటుంబ సభ్యులు సాయిష్మాను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. నిమ్స్ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. వినయ్ కుమార్ వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందని, అతన్ని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.