Telangana Crime: ఆమె, అతను.. ఇద్దరి మధ్య ఆ సంబంధం.. కట్‌చేస్తే భర్తను ఇలా చంపేసింది..

పచ్చగా ఉన్న కాపురంలో వివాహేత సంబంధం చిచ్చురేపింది. ప్రియుడితో కలిసి ఓ భర్య తన భర్తను కడతేర్చింది. కొత్తగూడెం సన్యాసి బస్తీలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....

Telangana Crime: ఆమె, అతను.. ఇద్దరి మధ్య ఆ సంబంధం.. కట్‌చేస్తే భర్తను ఇలా చంపేసింది..
Wife Killed Her Husband
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 19, 2023 | 7:22 PM

పచ్చగా ఉన్న కాపురంలో వివాహేత సంబంధం చిచ్చురేపింది. ప్రియుడితో కలిసి ఓ భర్య తన భర్తను కడతేర్చింది. కొత్తగూడెం సన్యాసి బస్తీలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం కొత్తగూడెం సన్యాసి బస్తీలో ప్రవీణ్, లావణ్య అనే దంపతులు కాపురం ఉంటున్నారు. కొంత కాలం సవ్యంగా సాగిన వీరి సంసారంలో వివాహేతర సంబంధం అనుకోని అలజడి సృష్టించింది. ప్రవీణ్ భార్య లావణ్య భర్తకు తెలియకుండా సుమంత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ప్రవీణ్ అడ్డుతొలగించుకోవాలని భావించారు. అందుకోసం పక్కాగా పథకం కూడా పన్నారు.

దీంతో లావణ్య తన ప్రియుడితో కలిసి భర్తపై దాడికి పాల్పడింది. దాడిలో భర్త ప్రవీణ్‌కు తీవ్ర గాయాలవ్వగా ఇరుగు పొరుగు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రవీణ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రవీణ్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతుడి భార్య లావణ్య, ఆమె ప్రియుడు సుమంత్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఓ పోలీసధికారి మీడియాకు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.