Eye Care Tips: శరీరంలో ఈ విటమిన్‌ లోపిస్తే అంధత్వం గ్యారెంటీ.. రోజూ వీటిని తిన్నారంటే..

మన శరీరంలో ప్రతి అవయవానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. శరీరం మొత్తం సక్రమంగా పనిచేయాలంటే అవసరమైన విటమిన్లు, పోషకాలు తప్పక తీసుకోవల్సి..

Eye Care Tips: శరీరంలో ఈ విటమిన్‌ లోపిస్తే అంధత్వం గ్యారెంటీ.. రోజూ వీటిని తిన్నారంటే..
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 19, 2023 | 7:00 PM

మన శరీరంలో ప్రతి అవయవానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. శరీరం మొత్తం సక్రమంగా పనిచేయాలంటే అవసరమైన విటమిన్లు, పోషకాలు తప్పక తీసుకోవల్సి ఉంటుంది. లేదంటే క్రమేపీ వ్యాధులు ఆవరిస్తాయి. శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కళ్లు కీలకమైనది. కళ్లకు అంథత్వం వస్తే అంతా చీకటిమయం అవుతుంది. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ ‘ఏ’ అధికంగా ఉండే ఆహారాలు అధికంగా తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ విలమిన్‌ లోపిస్తే తొలుత ప్రభావితమయ్యేది కంటి చూపు. ఐతే రోజూ ఎంత మొత్తంలో విటమిన్ ఎ తీసుకోవాలి, ఏయే ఆహారాల్లో విటమిన్‌ ‘ఏ’ అధికంగా ఉంటుంది వంటి వివరాలు మీకోసం..

సూర్యరశ్మి నుంచి విటమిన్ ‘డి’ లభించినట్లు విటమిన్ ‘ఏ’ లభించదు. విటమిన్ ‘ఏ’ పొందాలంటే పౌష్టికాహారం తీసుకోవల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ 700 నుంచి 900 మైక్రోగ్రాముల విటమిన్ ‘ఏ’ అవసరం అవుతుంది. తద్వారా కంటి రెటీనా ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ ఎ లోపం ఉన్నవాళ్లు రాత్రి వేళల్లో ఆంధత్వంతో బాధపడతారు. అంటే రాత్రి సమయంల్లో కళ్లు స్పష్టంగా కనిపించక.. మసక బారినట్లు కనిపిస్తుందన్నమాట. ఈ కింది పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాల్లో విటమిన్‌ ‘ఏ’ పుష్కలంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి
  • నారింజ
  • పసుపు రంగు కూరగాయలు
  • అన్ని రకాల తృణ ధాన్యాలు
  • ఆకుపచ్చ కూరగాయలు
  • కాడ్ లివర్ ఆయిల్
  • గుడ్లు
  • పాలు
  • క్యారెట్లు
  • బొప్పాయి
  • పెరుగు
  • సోయాబీన్స్

మరిన్ని ఆరోగ్య సమాచారం క్లిక్‌ చేయండి.