Telangana: మరీ ఇంత దారుణమా.. పెళ్లి చేయడం లేదని తల్లిని హత్య చేసిన కొడుకు

ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే గొడవ పడటం, ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం, చివరికి హత్యలకు కూడా దారి తీస్తున్నాయి. కుటుంబ కలహాలతో వచ్చే గొడవల వల్ల క్షణికావేశంలో హత్యలు చేసుకునే ఘటనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. తనకు పెళ్లి చేయడం లేదనే కోపంతో ఓ కొడుకు కన్న తల్లినే హత్య చేయడం కలకలం రేపుతోంది. ఈ దారుణం సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారంలో చోటుచేసుకుంది.

Telangana: మరీ ఇంత దారుణమా.. పెళ్లి చేయడం లేదని తల్లిని హత్య చేసిన కొడుకు
Venkatamma
Follow us

| Edited By: Vimal Kumar

Updated on: Sep 05, 2023 | 3:55 PM

ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే గొడవ పడటం, ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం, చివరికి హత్యలకు కూడా దారి తీస్తున్నాయి. కుటుంబ కలహాలతో వచ్చే గొడవల వల్ల క్షణికావేశంలో హత్యలు చేసుకునే ఘటనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. తనకు పెళ్లి చేయడం లేదనే కోపంతో ఓ కొడుకు కన్న తల్లినే హత్య చేయడం కలకలం రేపుతోంది. ఈ దారుణం సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే బండమైలారం గ్రామానికి చెందిన మిరియాల వెంకటమ్మ(45) కొడుకు, కూతురుతో కలిసి ఉంటోంది. పదిహేను సంవత్సరాల క్రితమే ఆమె భర్త మృతి చెందాడు. ఆమె కుమార్తె పేరు శైలజ, కుమారుడు ఈశ్వర్. కూతురు శైలజకు పెళ్లి అయ్యింది.

అయితే వెంకటమ్మ పాత ఇనుప సామాగ్రి క్రయవిక్రయాలతో జీవనాన్ని సాగిస్తోంది. అయితే గతంలో కొడుకు ఈశ్వర్‌కు ఓ విద్యుత్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఈశ్వర్ చేతికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీంతో వైద్యలు అతడి చేయి తొలగించారు. ఈశ్వర్‌కు ఒ చేయి లేకపోవడంతో అతడ్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఈశర్వర్ తనకు పెళ్లి కావడం లేదని బాధపడుతూ ఉండేవాడు. ఇదే విషయంలో తల్లీకుమారుల మధ్య పెళ్లి గురించి తరచుగా గొడవలు జరుగుతుండేవి. తనకు పెళ్లి చేయాలంటూ ఈశ్వర్ తల్లితో తగదా పడుతుండేవాడు. చివరికి అతడు మద్యానికి బానిసై పోయాడు. దీంతో ఈశ్వర్ తన బంధువైన పర్వతం రాము సాయంతో తన తల్లి వెంకటమ్మను హత్య చేశాడు. పదునైన ఆయుధంతో ముందుగా వారు గొంతును నరికారు. దీంతో ఆమె ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.

అయితే ఈ హత్య విషయం బయటికి రాకుండా ఉండేందుకు ఈశ్వర్, అతని బంధువులు దురాలోచన చేశారు. ఆ తల్లి రెండు కాళ్లను నిరికేశారు. ఆమెకు కాళ్లకు ఉన్న కడియాలను దాచిపెట్టారు. ఆ తర్వాత తల్లి చనిపోయిన విషయాన్ని ఈశ్వర్ తన సోదరి శైలజకు చెప్పాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తల్లిని చంపారని. కాళ్లకున్న కడియాలను ఎత్తుకెళ్లారని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ తన తల్లి మృతిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఈశ్వర్ ప్రవర్తనలో తేడా కనిపించడాన్ని వారు గమనించారు. చివరికి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయగా ఈశ్వర్ అసలు జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. తల్లిని హత్య చేసినట్లు అంగీకరించాడు. తల్లినే కొడుకు చంపడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..