Peacock Dance: ఆహ్లాదకరమైన ప్రకృతికి పరవశించిన నెమలి.. వర్షానికి స్వాగతం చెబుతూ పురివిప్పి నాట్యం..

వర్షం కురిసేవేళ ప్రకృతి సోయాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. వర్షాలు ఒక వైపు.. చల్లని వాతావరణం ఒక వైపు.. ఈ నేచర్ ను మనసులు మాత్రమే కాదు జంతువులు కూడా ముఖ్యంగా నెమళ్లు కూడా తొలకరి జల్లులు పడే సమయానికి ముందు మబ్బు పడితే..

Peacock Dance: ఆహ్లాదకరమైన ప్రకృతికి పరవశించిన నెమలి.. వర్షానికి స్వాగతం చెబుతూ పురివిప్పి నాట్యం..
Peacock Dance
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 23, 2023 | 9:24 PM

ప్రకృతి పరవశిస్తే.. మనసు పులకరిస్తుంది. అది మనుషులకైనా.. పక్షులకైనా.. జంతువులకైనా సరే.. ముఖ్యంగా ఎండల నుంచి ఉపశమనాన్ని ఇస్తూ వర్షం కురిసేవేళ ప్రకృతి సోయాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. వర్షాలు ఒక వైపు.. చల్లని వాతావరణం ఒక వైపు.. ఈ నేచర్ ను మనసులు మాత్రమే కాదు జంతువులు కూడా ముఖ్యంగా నెమళ్లు కూడా తొలకరి జల్లులు పడే సమయానికి ముందు మబ్బు పడితే.. అప్పుడు ఏర్పడే వాతావరణాన్ని బాగా ఎంజాయి చేస్తున్నాయి.. అడవుల నుండి బయటకు వచ్చి మరి పొలాల్లో హాయిగా తిరుగుతున్నాయి. వీటిని చూస్తు రైతులు కూడా సంబరపడి పోతున్నారు..

నెమళ్లు తరచుగా జనావాసాల్లోకి పొలాల్లోకి రావడం సహజం. అయితే నెమలి పురి విప్పి నాట్యం చేస్తూ కనిపించడం బహుఅరుదు. అందుకనే నెమలి కనిపిస్తే చాలు.. అది పురి విప్పినప్పుడు చూడాలి అని చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి అరుదైన కనులకు విందు చేసే అందం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పరశురాం నగర్ గ్రామ పరిసరాల్లో చోటు చేసుకుంది.

నెమలి నాట్యం.. 

ఇవి కూడా చదవండి

ఈ గ్రామం చూట్టూ దట్టమైన అడవి ప్రాంతం ఉంటుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ అడవి నుండి ఇలా మయూరం బయటకు వచ్చి కాసేపు పురివిప్పి నాట్యం చేసింది. ప్రకృతికి పరవశిస్తూ  నాట్యం చేస్తున్న నెమలిని గమనించి అక్కడే ఉన్న రైతు తన ఫోన్లో రికార్డ్ చేసాడు. దట్టమైన అడవి ప్రాంతంలో వాగులు, వంకలు అందమైన సోయగల మధ్యన ఇలా అందమైన నెమలి సోయగాన్ని ప్రదర్శిస్తూ తిరుగుతూ నాట్యం చేస్తుంటే చూపరులు మైపరిచి పోయారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..