N Narayana Rao

N Narayana Rao

Reporter - TV9 Telugu

narayanarao.naidu@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Khammam: అనాథ శిశువుని అక్కున చేర్చుకున్న అమెరికా దంపతులు.. ఖమ్మం నుంచి యుఎస్ కు పయనం..

Khammam: అనాథ శిశువుని అక్కున చేర్చుకున్న అమెరికా దంపతులు.. ఖమ్మం నుంచి యుఎస్ కు పయనం..

మన దేశం కాదు.. మన రాష్ట్రం కాదు.. మన ఊరు కాదు . ఎక్కడో.. తల్లి కేరళ, తండ్రి ఆస్ట్రేలియా.. ఇద్దరు యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా లో స్థిరపడ్డారు. ఈ దంపతులు మన దేశం నుండి అనాధ బాలికని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్నెట్లో భారత దేశం పిల్లల దత్తత గురించి తెలుసుకొని, అక్కడి వర్గాల సూచన మేరకు భారత దేశం పిల్లల దత్తత గురించి ఆరా తీశారు.

Fake Police: ఫేక్‌ పోలీసుల హల్ చల్.. నకిలీ పురుగు మందులు అమ్ముతున్నారని తనిఖీలు.. తర్వాత ఏం జరిగిందంటే..

Fake Police: ఫేక్‌ పోలీసుల హల్ చల్.. నకిలీ పురుగు మందులు అమ్ముతున్నారని తనిఖీలు.. తర్వాత ఏం జరిగిందంటే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు పాడుమండలం పడమటి నర్సాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో పురుగుమందుల వ్యాపారి చెరుకుమల్లి రుక్కయ్య ఇంటికి కారులో వచ్చిన నలుగురు దుండగులు కత్తులతో బెదిరించి తలుపులు వేసి ఇంటిలో ఉన్న ఇంటి బీరువాలో ఉన్న నగదు సుమారు 15 లక్షలు తో పాటు 15 లక్షల విలువ చేసే బంగారు వస్తువులను ఎత్తుకు వెళ్ళారు. కారులో వచ్చిన నలుగురు దుండగులు ఇద్దరు గేటు బయట ఉండి ఇద్దరిని లోపలికి పంపించి మొదట పోలీసులమని చెప్పి తరవాత లోపలికి వచ్చి చోరీ చేశారు..

Khammam: మరణంలోనూ వీడని బంధం.. భార్య పార్థివ దేహం వద్దే ప్రాణాలు వొదిలేసిన భర్త..

Khammam: మరణంలోనూ వీడని బంధం.. భార్య పార్థివ దేహం వద్దే ప్రాణాలు వొదిలేసిన భర్త..

భార్య రాయల మార్తమ్మ (96) గుండెపోటు తో మరణించింది.. భార్య మరణాన్ని తట్టుకోలేక .. కొద్ది నిమిషాల్లోనే భర్త రాయల యేహాన్ ( 112) కుప్పకూలి మృతి చెందాడు. నీ తోడే నేను.. నీ వెంటే నేను.. కష్టాల్లో అయినా.. సుఖాల్లో అయినా.. నీ తోనే అంటూ.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని.. 70 ఏళ్ల వైవాహిక జీవితాన్ని గడిపిన ఇద్దరు వృద్ధ దంపతులు గుండెలు ఆగిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చండ్రుపట్ల

Wyra: కరెంట్ షాక్‌తో కోతి మృతి.. ఆ యువకులు ఏం చేశారో తెలిస్తే

Wyra: కరెంట్ షాక్‌తో కోతి మృతి.. ఆ యువకులు ఏం చేశారో తెలిస్తే

పాపం వానరం కరెంట్ షాక్ కొట్టడంతో మృతి చెందింది. దీంతో తోటి వానరాలు ఎంతో ఆవేదన చెందాయి. కాగా ఆ కోతికి మనుషుల మాదిరిగా అంత్యక్రియలు నిర్వహించారు స్థానిక యువకులు. కోతి అంటే ఆంజనేయ స్వామితో సమానమని.. అందులో ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు వారు తెలిపారు.

Watch: హై హై నాయకా..! మేకల మందపై కోతి ఫీట్లు.. గేదెలపై కుక్క సవారీ.. వైరలవుతున్న వీడియో..

Watch: హై హై నాయకా..! మేకల మందపై కోతి ఫీట్లు.. గేదెలపై కుక్క సవారీ.. వైరలవుతున్న వీడియో..

బాహుబలి సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యంగా ఆవుల మందపై దూకుతూ హీరో ప్రభాస్ ముందుకు వెళ్ళే ఫైట్ సీన్ మామూలుగా ఉండదు..! అచ్చంగా అలాంటి సీనే రిపీట్ అయింది కానీ.. ఈ సీన్లో హీరో ప్రభాస్ కాదు ఓ కుక్క అంటే నమ్ముతారా..? అదేంటి అనుకుంటున్నారా ఇదిగో ఈ వీడియో చూడండి.

Khammam: చిట్టి గుండెలు ఆగిపోతున్నాయి.. గుండెపోటుతో 9వ తరగతి విద్యార్థి మృతి

Khammam: చిట్టి గుండెలు ఆగిపోతున్నాయి.. గుండెపోటుతో 9వ తరగతి విద్యార్థి మృతి

సెకన్ల వ్యవధిలో నిండు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. హార్ట్ ఎటాక్ అనే మహమ్మారి పిల్లల్ని, యుక్త వయస్కుల్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఖమ్మం జిల్లాలో ఓ టీనేజర్ జీవితాన్ని మధ్యంతరంగానే ఆపేసింది. మారుతున్న ఆహారపుటలవాట్లని కొందరు, ఫిజికల్ ఎక్సర్‌సైజులు తిరగబడ్డం వల్ల అని మరికొందరు, మితిమీరిన స్టెరాయిడ్సే కొంప ముంచుతున్నాయని, పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అనీ రకరకాల కారణాలు చెబుతున్నారు. కానీ.. ఈ అకాల మరణాలు ఆగేదెప్పుడు.. గుండె పదిలమయ్యేదెప్పుడు?

Khammam: ఎస్ఐ అయిన హమాలీ కూతురు.. తల్లిదండ్రుల కష్టాలను చూసి పట్టుదలతో..

Khammam: ఎస్ఐ అయిన హమాలీ కూతురు.. తల్లిదండ్రుల కష్టాలను చూసి పట్టుదలతో..

Khammam District: మిడిదొడ్డి రాజయ్య–ఆండాళు దంపతులు 20 సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం నల్గొండ జిల్లా నార్కేట్‌పల్లి మండలం అమనబోలు గ్రామం నుండి ఖమ్మం నగరానికి వచ్చారు. ఖమ్మంలోనే కూలీ పనులు చేసుకుంటూ బతుకు బండి లాగిస్తున్నారు.. వీరికి ఒక కుమార్తె మనీష, కుమారుడు ఉపేందర్‌లు ఉన్నారు. మనీష, ఉపేందర్‌లను చదివించేందుకు రాజయ్య నగరంలోని గాంధీచౌక్‌లో హమాలీ పని చేస్తుండగా.. ఆండాళు వివాహ శుభకార్యాల్లో పనులు, ఇళ్లల్లో పనులు చేస్తూ..

Telangana: చేపల కోసం చెరువు వద్దకు వెళ్లిన గిరిజనుడు.. ఊహించని విధంగా అక్కడ…

Telangana: చేపల కోసం చెరువు వద్దకు వెళ్లిన గిరిజనుడు.. ఊహించని విధంగా అక్కడ…

స్మగ్లర్లు అరుదైన నక్షత్ర తాబేళ్లను వేటాడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇవి ఇంట్లో ఉంటే కలిసి వస్తుందని.. అసత్య ప్రచారం చేస్తూ ఉంటారు. నక్షత్ర తాబేళ్లు అన్ని జీవుల్లాంటివే అని.. కాకపోతే వాటి సంతతి అంతరించిపోయే దశలో ఉందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇవి బయట ఎవరి వద్ద ఉన్నా చట్టాన్ని మీరినట్లే అవుతుందని.. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఆ గిరిజనుడుకి తెలియక నక్షత్ర తాబేలును ఇంటికి తీసుకువచ్చాడని.. దాన్ని స్వాధీనం చేసుకుంటామని అటవీ శాఖ సిబ్బంది చెబుతున్నారు.

Telangana: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి.. పట్టపగలు సినీ ఫక్కీలో భార్య కిడ్నాప్.. అసలు కథ ఇదీ!

Telangana: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి.. పట్టపగలు సినీ ఫక్కీలో భార్య కిడ్నాప్.. అసలు కథ ఇదీ!

ఖమ్మం నగరానికి చెందిన దూలగొండ సన్నీ, కొత్తగూడెంకి చెందిన గొగ్గెల మాధవి లు కొంత కాలంగా ప్రేమించుకొని ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మాధవి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. మాధవి పరీక్ష రాయడానికి ఖమ్మం నుంచి కొత్తగూడెం ఆటోలో తీసుకెళుతుండగా మార్గమధ్యలో కారులో ఛేజ్ చేసి భర్తపై దాడి చేసి..

ఖమ్మంలో వెరైటీ దొంగతనాలు: ‘ఇదెక్కడి ఖర్మరా బాబూ.. చేతికి ఏది దొరికినా పర్లేదా..!’ వీడియో వైరల్‌

ఖమ్మంలో వెరైటీ దొంగతనాలు: ‘ఇదెక్కడి ఖర్మరా బాబూ.. చేతికి ఏది దొరికినా పర్లేదా..!’ వీడియో వైరల్‌

ఇక్కడ వరుసగా జరుగుతున్న దొంగతనాలు చూస్తే కొంచెం విచిత్రంగా ,వెరైటీ గా ఉంటున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సింగరేణి ఉద్యోగి కొండల రావు ఇంట్లో గ్యాస్ సిలిండర్ తో ఉన్న స్టౌవ్ ను చోరీ చేశాడు.. ఓ దొంగ. ఈ దొంగతనం కోసం రెక్కీ నిర్వహించి.. ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు కింద చాలా సేపు కాపు కాసి.. పట్టపగలు దర్జాగా.. చుట్టంలా ఇంట్లోకి వెళ్ళాడు. వాళ్ళు ఇంట్లో పనిలో నిమగ్నం అయి ఉండగా.. గ్యాస్ సిలిండర్‌ను ఏం చక్కా పట్టుకొని వచ్చాడు దొంగ..

Telangana: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసుపై సంచలన తీర్పు.. ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

Telangana: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసుపై సంచలన తీర్పు.. ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

తెలంగాణలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావును గొత్తి కోయలు హత్య చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ హత్య కేసుకు భద్రాద్రి జిల్లా కోర్టు జడ్జి సంచలన తీర్పు ఇచ్చారు. ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించారు. గత సంవత్సరం నవంబర్ నెలలో చండ్రగొండ మండలం బెండాళపాడు గ్రామ పంచాయతీ ఎర్రబోడు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ప్లాంటేషన్ పనులను పరిశీలించడానికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు వెళ్లారు.

Khammam: మీ ఇంట్లో మొనగాడి పుంజులున్నాయటగా.. అమ్ముతారా అని వచ్చారు.. ఆమె లేవు అంటుండగానే

Khammam: మీ ఇంట్లో మొనగాడి పుంజులున్నాయటగా.. అమ్ముతారా అని వచ్చారు.. ఆమె లేవు అంటుండగానే

గ్రామానికి చెందిన మేరమ్మ తన ఇంటి ముందు నిలబడి ఉండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్ద రిలో ఒకరు కిందకు దిగి నాటుకోళ్లు ఉన్నాయా అని ఆరా తీశారు. ఆమె లేవని చెబుతుండగానే ఇంటి ఆవరణలో ఉన్న కోడిపుంజును అమ్మాలని మాయమాటల్లోకి దింపాడు. ఆమెకు వారిపై అనుమానం కలిగి లేవని సమాధానం ఇచ్చింది. అయినా వారు వెళ్లలేదు.. కాస్త ధర ఎక్కువైనా వాటిని తాము కొంటామని మాటల్లో పెట్టారు. ఇరుగు పొరుగున ఎవరూ లేరని గమనించిన అనంతరం యాక్షన్‌లోకి దిగారు.