Telangana: బొల్లారం అడవుల్లో వింత.. చూసేందుకు భారీగా తరలి వస్తున్న జనాలు..
ఈ విగ్రహాలను స్థానిక ప్రజలు గుర్తించారు. విషయం గ్రామస్తులకు తెలియజేయగా.. వారు వచ్చి పరిశీలించారు. జలకన్య, నాగకన్య, చంద్రకన్య, మత్స్యకన్యగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విగ్రహాలను గ్రామ దేవతలుగా భావిస్తున్నారు స్థానికులు. వరంగల్ ఉమ్మడి జిల్లాను రక్షించే పొలిమెర దేవతగా ప్రచారం సాగుతోంది.
ములుగు, ఆగష్టు 03: ములుగు జిల్లా బొల్లారం అడవుల్లో వింత ఘటన వెలుగు చూసింది. జలకన్య, నాగకన్య, మత్స్యకన్య, చంద్రకన్య ఆకారాలు బయటపడ్డాయి. మైతాపురం జలపాతం వద్ద ఈ ఆకారాలు వెలుగుచూశాయి. గుట్టపై రాతి శిలల్లో బయటపడ్డ ఈ విగ్రహాలను స్థానిక ప్రజలు గుర్తించారు. విషయం గ్రామస్తులకు తెలియజేయగా.. వారు వచ్చి పరిశీలించారు. జలకన్య, నాగకన్య, చంద్రకన్య, మత్స్యకన్యగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విగ్రహాలను గ్రామ దేవతలుగా భావిస్తున్నారు స్థానికులు. వరంగల్ ఉమ్మడి జిల్లాను రక్షించే పొలిమెర దేవతగా ప్రచారం సాగుతోంది. కాగా, ఈ విగ్రహాలను సమీపించాలంటే మైతాపురం జలపాతం దాటాల్సి ఉంటుంది. దాంతో స్థానికులు ఆ జలపాతాన్ని ఈదుకుంటూ వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు ఈ వింత విగ్రహాల సమాచారం అందుకున్న చుట్టు పక్కన గ్రామాల ప్రజలు.. ఆ విగ్రహాలను చూసేందుకు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు.
అయితే, కాకతీయుల కాలంలో గ్రామ దేవతలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండేంది. ప్రజలు తమ గ్రామాల రక్షణ కోసం గ్రామ దేవతలను ప్రతిష్టి పూజించేవారు. ఈ విగ్రహాలు కూడా గ్రామ దేవతలే కావొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..