Life Style: పనిలో పరధ్యానంగా ఉన్నారా? మీ కోసం ఈ చిట్కాలు.. తప్పక మార్పు చూస్తారు..!

Lifestyle: అర్థరాత్రి దాకా నిద్రపోకపోవడం, అతిగా నిద్రపోవడం కొందరి దినచర్యగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఏ పనిపైనైనా పూర్తిగా దృష్టి సారించలేకపోతున్నారు. చేసే పనిలో శ్రద్ధ వహించలేకపోతున్నారు. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు కూడా మొబైల్ ఫోన్ చూడటం, చదువుతున్నప్పుడు మొబైల్ ఫోన్ చూడటం, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కూడా మెసేజ్ ఏమైనా వచ్చిందా?

Life Style: పనిలో పరధ్యానంగా ఉన్నారా? మీ కోసం ఈ చిట్కాలు.. తప్పక మార్పు చూస్తారు..!
Distracted
Follow us

|

Updated on: Aug 03, 2023 | 9:59 AM

హడావిడిగా జీవితాన్ని గడపడం, 8 గంటల ఆఫీసు పని ముగించుకుని సోషల్ మీడియాలో ఏదో ఒకటి చూడటం.. అర్థరాత్రి దాకా నిద్రపోకపోవడం, అతిగా నిద్రపోవడం కొందరి దినచర్యగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఏ పనిపైనైనా పూర్తిగా దృష్టి సారించలేకపోతున్నారు. చేసే పనిలో శ్రద్ధ వహించలేకపోతున్నారు. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు కూడా మొబైల్ ఫోన్ చూడటం, చదువుతున్నప్పుడు మొబైల్ ఫోన్ చూడటం, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కూడా మెసేజ్ ఏమైనా వచ్చిందా? నోటిఫికేషన్ ఏంటి? అని మొబైల్ వైపు చూస్తుంటారు.

మీరు కూడా రేపు ఏం చేయాలి? ఈ రోజు ఏం చేయాలి? ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారా? అయితే, ఈ ఆలోచనలు మీరు చేసే పనిని నియంత్రిస్తాయి. ఆ ఆలోచనలు మీ పనిని డిస్ట్రబ్ చేస్తాయి. మీరు ఇలాగే ఇబ్బంది పడుతున్నట్లయితే.. ముందుగా ఏం చేయాలి? ఏం చేయకూడదు? అని ఆలోచించుకోవాలి. అలాగే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

ధ్యానం: యోగా అనేది దృష్టి కేంద్రీకరణలో కీలక పాత్ర పోషిస్తుంది. ధ్యానం చేయాలి. రోజూ ధ్యానం చేయడం వలన మీ దృష్టి ఒకే అంశంపై నిలుస్తుంది. మీ మనస్సులో తరచుగా వస్తున్న ఆలోచనలను కట్టడి చేయడానికి రోజుకు మూడు నుంచి ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఒకే చోట కూర్చుని ధ్యానం చేయండి.

సరిపడా నిద్ర: రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది అర్థరాత్రి వరకు పడుకోరు. మళ్లీ తెల్లవారుజామునే నిద్రలేచి ఆఫీస్‌కి వెళ్తుంటారు. ఇలా చేయడం వలన కూడా మనస్సు నిలకడగా ఉండదు. విశ్రాంతి తప్పనిసరి అవసరం.

వ్యాయామం: మీ కార్యకలాపాల్లో సానుకూల మార్పులు కోసం మొబైల్ వినియోగం తగ్గించుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. జాగింగ్, వాకింగ్ చేయాలి. ఇష్టమైన క్రీడల్లో పాల్గొనాలి.

మల్టీ టాస్కింగ్‌ను నివారించాలి: అంటే ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తుంటే మానుకోండి. మీకు ముఖ్యమైన వాటిపైనే దృష్టా సారించండి. ఈ మల్టీ టాస్కింగ్ మీ పనులను డిస్ట్రబ్ చేస్తుంది.

విరామం: పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి. పరధ్యానాన్ని నివారించడానికి, పనితీరును మెరుగుపరుచుకోవడానికి పని మధ్యలో విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. విరామం లేకపోతే.. చేసే పనిపై దృష్టి పెట్టలేరు. ఎక్కువ గంటలు నిరంతరంగా పని చేయడం వల్ల దృష్టి తగ్గుతుంది.

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..