Positive Vibes: ప్రతిసారి ప్రతికూల ఆలోచనలే వస్తున్నాయి.. అయితే, ఇలా చేయండి.. మీ లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది..!

Positive Vibes: ఏదైనా ఆలోచించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన ఏదయినా.. అది మీకు సాధ్యమేనా? ఆ ఆలోచన మంచిదేనా? అని కూడా ఆలోచించాలి. కొందరు ఏదైనా పని చేయాలన్నా.. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఏది కరెక్ట్? ఏది తప్పు? అని బేరీజు వేసుకుంటారు. తీరా ఒక నిర్ణయానికి వచ్చాక ఆ నిర్ణయం అమలులో వెనకడుగు వేస్తారు. కారణం..

Positive Vibes: ప్రతిసారి ప్రతికూల ఆలోచనలే వస్తున్నాయి.. అయితే, ఇలా చేయండి.. మీ లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది..!
Negative Thoughts
Follow us

|

Updated on: Aug 03, 2023 | 7:57 AM

ఈ ప్రపంచంలో గాలి కంటే వేగమైనది.. మనస్సు. ఆ మనస్సు కంటే వేగమైంది ఆలోచన. ఈ ఆలోచనలే వ్యక్తి గతిని మార్చేస్తాయి. వ్యక్తి ఉన్నత శిఖరాలకు చేరాలన్నా.. అథపాతాళానికి చేరాలన్నా ఈ ఆలోచనలే కారణం అవుతాయి. అయితే, ఏదైనా ఆలోచించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన ఏదయినా.. అది మీకు సాధ్యమేనా? ఆ ఆలోచన మంచిదేనా? అని కూడా ఆలోచించాలి. కొందరు ఏదైనా పని చేయాలన్నా.. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఏది కరెక్ట్? ఏది తప్పు? అని బేరీజు వేసుకుంటారు. తీరా ఒక నిర్ణయానికి వచ్చాక ఆ నిర్ణయం అమలులో వెనకడుగు వేస్తారు. కారణం.. భయం, నెగెటివ్ థింకింగ్, ఆత్మవిశ్వాసం లేకపోవడం. అందుకే ఆ నెగెటీవ్ థాట్స్‌కు దూరంగా ఉండాలని సూచిస్తారు మానసిక నిపుణులు. ఆ నెగెటీవ్ థింకింగ్‌ను వదిలేసి, అన్నీ సాధ్యమే అనే పాజిటివ్ దృక్పథాన్ని పెంచుకోవాలి.

1. ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే.. వెంటనే ఆగ్రహానికి గురవకుండా, వారిని పట్టించుకోవడం మానేయండి. మీ ముఖంపై చిరునవ్వును చెరగనివ్వొద్దు. అదే వారికి మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ అవుతుంది. ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే.. ముఖాన్ని కిందకు దించండి. అయితే, విచారంగా నిలబడొద్దు. పదే పదే ఆలోచిస్తూ చింతించొద్దు. వారు అన్న అంశాలను పట్టించుకోకుండా చిరునవ్వుతో ఉండండాలి. చివరకు మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారే తల దించుకుంటారు.

2. నెగెటివ్ థింకింగ్‌ను వదులుకునే విషయంలో మరో కీలక అంశం. ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి. అందరి మాటలు వినాల్సిన అవసరం లేదు. అలా అందరి మాటలు విని.. మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దు. ఏదైనా కరెక్ట్ కాదనిపిస్తే.. మీవల్ల కాదనపిస్తే వెంటనే సూటిగా, సుత్తి లేకుండా నో చెప్పేయండి.

3. పనికిరాని అంశాలపై చర్చలు పెట్టొద్దు. ప్రతికూల అంశాలపై చర్చించడం మానుకోవాలి. ఇవి మీ మనస్సుపై చెడు ప్రభావం చూపుతాయి. అందుకే, చెడు, ప్రతికూల అంశాలపై చర్చకు దూరంగా ఉండాలి.

4. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మీరు చేసే పనిని ప్రేమించండి. మీకు సంతోషాన్ని కలిగించే పనినే ఎంచుకోండి. మీకు బాధ కలిగించే ఆలోచనలు, పనులను వదిలేయండి. ఇలా చేయడం లన నెగెటీవ్ థింకింగ్ తగ్గి.. మీలో పాజిటివ్ వైబ్స్ పెరుగుతాయి.

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..