Telangana: ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం.. నీలి రంగు నీళ్లలో తెగ ఎంజాయ్ చేస్తున్న జనం..
మరో అద్భుతమైన జలపాతం వెలుగులోకి వచ్చింది.. వాజేడు మండలంలోని దూసపాటి కొద్ది కొంగాల జలపాతం ఇది. మిగితా జలపాతాలకు పూర్తి భిన్నంగా ఈ జలపాతం కనువిందు చేస్తుంది.. 50 అడుగుల ఎత్తు నుండి నీరు పాలధారలా జాలువారుతున్న నీరు నీలి రంగులో ఉండడం చూపరులును కనువిందు చేస్తుంది.. ఎక్కడో అరేబియా దేశాలలో సముద్రపు నీళ్ళలో ఎంజాయ్ చేస్తున్న అనుభూతి కలుగుతుంది..
తెలంగాణ- చత్తీస్ గఢ్ సరిహద్దులోని ములుగు జిల్లా అడవులు జలపాతాలకు పెట్టింది పేరు.. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎనిమిది జలపాతాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. బాహుబలి సినిమా అనంతరం ఈ జలపాతాలకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఎక్కడ జలపాతం కంటపడితే అక్కడికి వెళ్లి జలకాలాడడం- ప్రకృతి ఒడిలో తనివితీరా ఎంజాయ్ చేయడం కోసం జనం పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగత జలపాతాలు, వెంకటాపురం మండలం లోని ముత్యాల ధార జలపాతాలు ఫుల్ క్రేజీగా మారాయి..
తాజాగా మరో అద్భుతమైన జలపాతం వెలుగులోకి వచ్చింది.. వాజేడు మండలంలోని దూసపాటి కొద్ది కొంగాల జలపాతం ఇది. మిగితా జలపాతాలకు పూర్తి భిన్నంగా ఈ జలపాతం కనువిందు చేస్తుంది.. 50 అడుగుల ఎత్తు నుండి నీరు పాలధారలా జాలువారుతున్న నీరు నీలి రంగులో ఉండడం చూపరులును కనువిందు చేస్తుంది.. ఎక్కడో అరేబియా దేశాలలో సముద్రపు నీళ్ళలో ఎంజాయ్ చేస్తున్న అనుభూతి కలుగుతుంది..
నీలిరంగు నీళ్లలో పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.. సెల్ఫీలకు ఫోజులు కొడుతూ జలపాతాల వద్ద కేరింతలు కొడుతున్నారు..ప్రకృతి అందాలు- గలగలపారే జల సవ్వడుల మధ్య తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ జలపాతాలు వాజేడు మండల కేంద్రంలోని 8 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి..అక్కడికి నడుచుకుంటూ వెళ్లాలి.. కానీ జలపాతాలు కంటపడగానే అలసట మాయమైపోతుంది.. ఊహించని ఉత్సాహం ఒంట్లో ఉరకలేస్తుంది.. ఎంత ఇబ్బంది ఉన్నా ఈ జలపాతాల ఎంజాయ్ చేయడం కోసం సందర్శకులు పరుగులు పెడుతున్నారు.. ముఖ్యంగా సెలవు దినాల్లో వందలాదిగా తరలివచ్చి నీలిరంగు నీళ్లలో ప్రకృతి అందాల మధ్య కేరింతల కొడుకు ఎంజాయ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..